విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌(Benz Circle) రెండో ఫ్లై ఓవర్‌(Flyover)ను ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan), కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ(Nitin Gadkari), కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రారంభించారు. సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి గురువారం విజయవాడ(Vijayawada)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేంద్రమంత్రి గడ్కరీ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులు, 31 జాతీయ రహదారుల(National Highways) ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. బెంజి సర్కిల్ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్ల ఖర్చయ్యింది. 


రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : నితిన్ గడ్కరీ


విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్‌పేయి(Vajpayee) నమ్మారని, వాజ్‌పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి(Golden Quadrilateral) నిర్మాణం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సడక్‌ యోజన(Gram Sadak Yojana) అత్యంత కీలకమైన పథకమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రోడ్లు బాగుంటే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందని తెలిపారు. చైనాతో పోల్చితే భారత్‌లో రవాణా వ్యయం చాలా ఎక్కువ అని తెలిపారు. త్వరలో డీజిల్‌ లారీలకు బదులు ఎలక్ట్రిక్‌ లారీలు, డీజిల్‌ స్థానంలో సీఎన్‌జీ, ఎల్‌పీజీ(LPG) రవాణా వాహనాలు రానున్నట్లు  పేర్కొన్నారు. పోలవరం పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాను జలవనరుల మంత్రిని కాక‌పోయినా, పోలవరం చూస్తానన్నారు. 'ఎంతో మంది నైపుణం ఉన్న యువత ఏపీలో ఉన్నారు. ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలి. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం బాగా తగ్గాలి.  గ్రీన్‌ హైడ్రోజన్‌(Green Hydrogen) వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు.  దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం. సీఎం జగన్‌ ఇచ్చిన ఈస్ట్రన్‌ రింగ్‌(Eastern Ring) రోడ్డుకు ఇప్పుడే ఆమోదం తెలుపుతున్నా. ఏపీలో రూ. 3 లక్షల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తాం. ఏపీలో 6 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే(Green Field Express Highway)లను కేంద్రం నిర్మిస్తోంది. 2024 నాటికి రాయపూర్‌- విశాఖ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే(Raypur Visakha Green Field Highway) పూర్తి చేస్తాం. పరిశ్రమలతోనే ఉపాధి సాధ్యం. కేంద్ర నిర్వహిస్తున్న గ్రామ సడక్‌ యోజన ఇప్పుడు అత్యంత కీలకమ‌వుతుంది' అని నితిన్ గడ్కరి అన్నారు. 



కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారుల అభివృద్ధి : సీఎం జగన్


కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో జాతీయ రహదారులు అభివృద్ధి జరిగిందని సీఎం జగన్(CM Jagan) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం ఎయిర్ పోర్టు(Bhogapuram Airport) వరకు సముద్రతీరంలో ఆరు లైన్ల రహదారి ఏర్పాటు చేసి దాన్ని 16వ నంబరు జాతీయ రహదారి(NH 16)కి అనుసంధానించాలని సీఎం జగన్ కోరారు. బెంజి సర్కిల్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని 2019 ఆగస్టులో తాను గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు సీఎం తెలిపారు. ఆ మేరకు గడ్కరీ నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు వేగవంతం చేశారని, ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అసంపూర్తిగా ఉన్న తూర్పు ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవరు(Kanakadurga Flyover) గడ్కరీ సహకారంతో వాయువేగంతో అభివృద్ధి అసంపూర్తిగా ఉన్న తూర్పు ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ ను గడ్కరీ సహకారంతో వాయువేగంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణానికి అత్యంత చొరవతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పారు. భూసేకరణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని మిగిలిన రోడ్లను కూడా రూ.10,600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులపై ఎలాంటి రాజకీయాలు లేకుండా తమ సంతోషాన్నివెలిబుచ్చుతున్నట్లు చెప్పారు.



 నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ మంత్రి : కిషన్ రెడ్డి 


ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖామంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ మంత్రి(Flyover Minister)గా పేరు తెచ్చుకున్నారన్నారు. అనేక దేశాల కంటే వేగంగా జాతీయ రహదారుల‌ నిర్మాణం మన దేశంలో జరుగుతోందన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందన్నారు. రూ.21 వేల కోట్లతో ఏపీలో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలలో రూ.60 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో కూడా రోడ్లు అత్యంత అభివృద్ధి చెందాయన్న ఆయన...రోడ్డు, సముద్ర, వాయు కనెక్టివిటీ చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) భావిస్తున్నారన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడుతున్నాయన్నారు. రూ.7500 కోట్లతో‌ 14 విద్యా సంస్ధలను అభివృద్ధి చేశారన్నారు. శ్రీశైలం, సింహాద్రి, అన్నవరం(Srisailam, Simhadri, Annavaram)లో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. 


'ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా అల్లూరి సీతారామరాజు మ్యూజియం(Alluri Sitaramaraju Museum) విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు రాష్ట్రం, కేంద్రం నిర్వహిస్తాయి. విశాఖపట్నంలో అనేక పరిశ్రమలకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణాలో 32 జిల్లాలు పూర్తిగా జాతీయ రహదారి‌ కనెక్టివిటీ ఉంటోంది. విజయవాడ చిన్నది కావడంతో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది.