గుప్పెడంతమనసు ఫిబ్రవరి17 గురువారం ఎపిసోడ్


మహేంద్ర, జగతి ఇద్దరూ కాఫీ గురించి డిస్కషన్ చేసుకోవడం చూసి గౌతమ్ కి డౌట్ వస్తుంది. క్లాస్ మేట్స్ కాదు, కొలిగ్స్ అయితే పండుగకి ఇంటికి ఎందుకు పిలుస్తారు, ఈ విషయంలో ఓ క్లారిటీ రావాల్సిందే, అడిగితే రిషి తిట్టొచ్చు కానీ అయినా మనం ఆగుతామా అయినా ఆలోచించాల్సింది అంకుల్, మేడం గురించి కాదు, రిషి-వసుధార గురించి అనుకుంటాడు. ఇంతలో దూరం నుంచి వసు, రిషి రావడం..వసు చేతిలో గులాబీ ఉండడం చూసి గౌతమ్ షాక్ అవుతాడు. నేను వసుకి ఇవ్వాలనుకున్న గులాబీ లాక్కుని నువ్వు వసుకి ఇస్తావా, మిత్రద్రోహి ఎంతపని చేశావ్ నీ కడుపులో ఇంత కుట్ర ఉందా అని ఫీలవుతాడు. ఈ గులాబీ అని గౌతమ్ మాట్లాడేలోగా..ఏంటి నీ బాధ అని అడ్డుపడతాడు రిషి. వసు ఆ గులాబీ ఎక్కడిది అని అడుగుతాడు... గులాబీ పూలు ఎక్కడివంటే ఎలా చెట్టుకి పూస్తాయ్, నీ స్టాండడ్ కి తగ్గా ప్రశ్నలు అడుగు అంటాడు. ఈ గుబాలీ నాదే అని వసుకి చెప్పినా రిషిగాడు ఏదో ఒకటి చెప్పి నన్ను ఫూల్ చేస్తేస్తాడు అనుకుంటాడు.


Also Read:  డాక్టర్ గా కార్తీక్ లైసెన్స్ రద్దు వెనుక మోనిత కుట్ర ఉందని దీప కనిపెట్టేసిందా, కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ఈ రోజు వాతావరణం బావుంది కదా వసు అని గౌతమ్ అంటే...సైకలాజీ ప్రకారం అని వసు మొదలెడుతుంది. హలో హలో ఇప్పుడు గ్రౌండ్ లో పెద్ద చర్చ పెట్టొద్దంచాడు రిషి. మీరు రెస్టారెంట్ కి వెళుతున్నారా అంటే..లేదు సార్ అంటూ వసు చెప్పేలోగా మేం ఎక్కడికి వెళితే నీకెందుకు, నిన్ను మేడంని కలవమని చెప్పాను కదా అంటాడు రిషి. కలిసేందుకు వెళ్లాను కానీ మేడం, అంకుల్ మాట్లాడుకుంటుంటే చూసి వచ్చేశాను అంటాడు. వాళ్లిద్దరూ ఏంటి అంత క్లోజ్ గా ఉన్నారని అడిగితే షార్ట్ ఫిలిం గురించి డిస్కషన్ అనుకుంటా అని వసు చెబుతుంది. లేదు లేదు అంతకుమించి అనిపించారని గౌతమ్ అనగానే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు రిషి. నేను వస్తాను అని గౌతమ్ అడిగినా...నువ్వు ఇంటికెళ్లి నేను రావడం లేటవుతుందని పెద్దమ్మకి చెప్పు అని పంపించేస్తాడు. ఏదో జరుగుతోంది..నన్ను కావాలనే ఇంటికి పంపిస్తున్నాడు, వసుధారని కలవకుండా చేస్తున్నాడు, అయినా ఎలా కలవాలో నాకు బాగా తెలుసు అనుకుంటాడు గౌతమ్.


ఓ గ్రౌండ్ లో నిల్చున్న రిషి..గౌతమ్ మాటలు గుర్తుచేసుకుని వసుతో.. విన్నావ్ కదా గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడో, నా పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడుగుతుంటే ఎలా అనిపించిందో తెలుసా, మీ మేడంకి నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే..ఏం చెప్పమంటారు చెప్పండి అంటుంది వసు. మహేంద్ర సార్, జగతి మేడంది పవిత్రమైన బంధం, ప్రతీసారి గౌతమ్ ఏదో తెలియకుండా అంటున్నాడు...అటు డాడ్ , నేను నలిగిపోతున్నాం అన్న రిషితో... మీ బాధ కన్నా వందరెట్లు మేడం క్షోభ పడుతున్నారు సార్ అని క్లారిటీ ఇస్తుంది. పుస్తకాల్లో స్త్రీ గురించి గొప్పగా రాస్తారు కానీ, ఓ స్త్రీ ఒంటరిగా ఉండాలంటే నిత్య జీవితంలో ఇంకా  చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇస్తుంది వసుధార. ఇన్నాళ్లూ లేని బాధ ఇప్పుడెలా వచ్చింది... కాలేజీలో ఆవిడ అడుగు పెట్టినప్పటి నుంచే నాకు కష్టాలు మొదలయ్యాయి. నా కాల్లో ముల్లు గుచ్చుకుంది బాధ మీకెలా తెలుస్తుందని రిషి అంటే.. మీకు కాల్లో గుర్చుకుంటే ఆవిడ కంట్లో ముల్లుగుచ్చుకుంది నేను ఏం చెప్పాలంటుంది వసుధార. మీరు తల్లిని మాత్రమే కోల్పోయారు..కానీ జగతి మేడం భర్త, బిడ్డ, అత్తింటివారిని కోల్పోయారంటుంది వసుధార. మీరు ద్వేషించినా, జాలిపడకపోయినా వాళ్లిద్దరూ భార్య, భర్తలు కాకుండా పోరు కదా అంటుంది. దాచడానికి, అనుమానించడానికి ఏముంది... మీరు ఔనన్నా కాదన్నా మేడం మీ .... అమ్మ అనబోయి రిషి మొహం చూసి ఆగిపోతుంది.


Also Read:  దగ్గరవుతున్న వసు-రిషి, మహేంద్ర-జగతి విషయంలో కన్ఫ్యూజన్లో గౌతమ్, గుప్పెడంతమనసు బుధవారం ఎపిసోడ్
మీకున్న కారణాలతో మీరు దూరం అవొచ్చు, మీరు కాదనుకున్న మాత్రాన వాళ్ల బంధం అబద్ధం అవదు... ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, మనం చర్చించడం అంత మంచిది కాదు....ఈ అంశం గురించి నాతో డిస్కస్ చేయకపోవడమే మంచిది అంటుంది. కానీ ఒక్క మాట... వాళ్ల బంధం వాళ్ల పర్సనల్, ఈ చర్చ మళ్లీ మన మధ్య రాకపోవడమే మంచిది అంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ప్రశ్నించిన రిషితో... సమస్య అనుకుంటేనే పరిష్కారం కావాలంటుంది. అన్నింట్లో ఆదర్శంగా ఉండే మీరు ఈ ఒక్క విషయంలో అని ఆగిపోతుంది... చెప్పు ఏంటి అని రిషి రెట్టించేసరికి... ఏం లేదు ఇది మాటలతో ముగించలేం, కొన్నింటిని కాలానికే వదిలేయాలి, ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం అంటుంది. కోపంగా వెళ్లి కార్లో కూర్చుంటాడు రిషి...వసు కూడా కార్లో కూర్చుంటుంది. జగతి మేడంకి కాల్ చేసిన వసుధార...రిషి సార్ నేను ప్రాజెక్ట్ పనిమీద బయటకు వెళుతున్నాం లేట్ అవొచ్చని చెబుతుంది. సరే వసు..త్వరగా వచ్చెయ్ అని చెబుతుంది జగతి. 


కట్ చేస్తే ఓ కొండపై నిల్చుని బస్తీని గమనిస్తుంటాడు రిషి.ఈ బస్తీలో తిరిగి చూద్దామా అంటుంది వసుధార. ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందామా అంటాడు రిషి. నా కాలునొప్పి కదా ఎలా పరిగెడతాను అంటుంది. అందుకే బస్తీ విజిట్ మానేసి ఇక్కడి నుంచి చూస్తున్నా అని క్లారిటీ ఇస్తాడు. అయితే కాలు నొప్పి తగ్గిన తర్వాత ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అంటుంది వసుధార. ఇక వెళదామా అని ఇద్దరూ కారు దగ్గర నిల్చుంటారు...పక్కనుంచి వెళ్లిన బైక్ వాడు పైన బురద కొట్టి వెళ్లిపోతాడు. నేను క్లీన్ చేస్తానని వసు అంటే వద్దు నాపని నేను చేసుకుంటా అంటాడు. నేను పక్కనున్నప్పుడు మీరు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి క్లీన్ చేస్తుంది. చిన్నప్పుడు వర్షాకాలంలో స్కూల్ కి వెళ్లినప్పుడు కూడా ఇలాగే జరిగేది అని మొదలుపెట్టగానే...బాల్యంలో నీకు ప్రతిరోజూ ఏదో జ్ఞాపకం మిగిలే ఉంది కదా అన్న రిషితో..బాల్యం ఎంత అందంగా ఉంటుందో తెలుసా మీకు అని వసు అంటే నాకు తెలీదు అని రిప్లై ఇస్తాడు రిషి. ఎపిసోడ్ ముగిసింది...  


రేపటి ( శుక్రవారం) ఎపిసోడ్ లో
వసుధార పుస్తకాలు జగతి సర్దుతుంటే అక్కడకు వెళ్లిన గౌతమ్..నేను సర్దుతా అని వసు రూమ్ కి వెళతాడు. గోళీలు చూడగానే... రిషి దగ్గరా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయని ఆలోచనలో పడతాడు. మరోవైపు ఎప్పటిలా పల్లీలు ఎలా తినాలో రిషికి చెబుతుంటుంది వసుధార...