గుప్పెడంతమనసు ఫిబ్రవరి16 బుధవారం ఎపిసోడ్
మేడం షార్ట్ ఫిలింలో గౌతమ్ యాక్ట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదని రిషి అంటే..మీరు ఎలా చెబితే అలా అంటుంది జగతి. తను నా ఫ్రెండ్ అది నా వ్యక్తిగతం, తనని తీసుకొచ్చి షార్ట్ ఫిలింలో నటించేలా చేయడం నాకు నచ్చలేదని రిషి అంటే..గతంలో శిరీష్ ని కూడా ఇన్వాల్వ్ చేశాం కదా అని జగతి మనసులో అనుకుంటే... అదే విషయం రిషి ప్రస్తావించగానే మనసు చదివేశాడా అని షాక్ అవుతుంది. తన ప్లేస్ లో ఎవరినైనా తీసుకోండి అని రిషి అంటే..మహేంద్ర సార్ మాటిచ్చారని జగతి చెప్పగానే, ఆయన కాలేజీ డైరెక్టర్ అయితే నేను ఎండీని అంటాడు రిషి. మీ ఇష్టం సార్ అనేసి జగతి వెళ్లిపోతుంది.


కాన్ఫరెన్స్ రూమ్ లో ఫైల్స్ చూస్తున్న వసుధాని చూసి వాటే ఛాన్స్ , మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచి సమయం అనుకుని వెళతాడు గౌతమ్. ఏమైనా హెల్ప్ చేయాలా అంటే.. మీరు నన్ను డిస్టబ్ చేయకపోవడమే పెద్ద హెల్ప్ అంటుంది. అక్కడున్న గులాబీ తీసుకెళ్లి ముందుగా ఇచ్చి ప్రపోజ్ చేద్దామని ముందు గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేసి, ఆ తర్వాత చార్ట్ తో సర్ ప్రైజ్ చేస్తా అనుకుంటాడు. గులాబీ ఉన్న చేతిని ముందుకు చాపి కళ్లు మూసుకుంటాడు..కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా రిషి ఉంటాడు. నీకు ఇక్కడేం పని, ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని క్వశ్చన్ చేస్తాడు. సార్ అని వసు వెనక్కి తిరిగి చూసేలోగా వసు నీపని నువ్వు చేసుకో అంటాడు.


Also Read: కార్తీక్ చేతిలో బాబుని చూసిన మోనిత, ఇప్పటి వరకూ ఓలెక్క ఇకపై మరో లెక్క అన్న వంటలక్క, కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్
గౌతమ్ ని బయటకు తీసుకెళ్లిపోయిన రిషితో నీ కోసమే వెతుక్కుంటూ వచ్చానంటాడు గౌతమ్. నాకోసం అయితే నా క్యాబిన్ కి రావాలి కదా అన్న రిషి..గులాబీ పట్టుకుని చేయి ఇలా పెట్టావేంటని అడుగుతాడు. చెయ్యి నొప్పి పెట్టిందన్న గౌతమ్ తో..ఏదైనా నమ్మేలా చెప్పరా అన్న రిషితో.. నా బాడీకి ట్రాకింగ్ చిప్ పెట్టినట్టు నేను ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చేస్తావేంటి అని అడుగుతాడు. ఇన్నీ తర్వాత చెబుతాలే కానీ నువ్వెళ్లి జగతిమేడంని కలువు...మేడంగారు నీతో ఏదో మాట్లాడాలి అన్నారని పంపించేస్తాడు. నువ్వు నన్ను కావాలనే పంపిస్తున్నావని అనిపిస్తోందని గౌతమ్ అంటే..నువ్వేం అనుకున్నావన్నది కాదు నేను ఏం నమ్మానన్నదే ముఖ్యం. నువ్వెళ్లు మాకు మీటింగ్ ఉందని పంపించేస్తాడు. బయటకు వెళ్లిన గౌతమ్..రిషి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు..కొంపతీసి మనోడు వసుధారని అనుకుని..అలా ఏం లేదు నేను భయపడాల్సిన పనేలేదు అనుకుంటాడు. కట్ చేస్తే వసుధార అంతా రెడీనా అంటూ వెళ్లిన రిషిని చూసుకోకుండా డ్యాష్ ఇస్తుంది ( బ్యాగ్రౌండ్ లో ఓ లవ్ సాంగ్ ).  


కట్ చేస్తే షార్ట్ ఫిలింలో గౌతమ్ ని రిషి వద్దన్నాడా అని షాకింగ్ గా అడుగుతాడు మహేంద్ర. ఈ విషయం తనకి ఎలా చెప్పగలం అంటుంది జగతి. మంచితనం, మొహమాటం ఎంత ఎక్కువైతే జీవితంలో అన్ని కష్టాలన్న మహేంద్రతో.. కొత్త కొటేషనా అని కౌంటర్ ఇస్తుంది జగతి. చెప్పడం ఎలా అన్న జగతితో.. అవసరమైతే రిషి చెప్పేస్తాడులే చిన్న విషయం గురించి ఎక్కువ ఆలోచించకు అంటాడు మహేంద్ర. మనిద్దరం ఎక్కడికైనా సరదాగా లాంగ్ డ్రైవ్ వెళదామా అంటే..నన్ను కూల్ చేయాలని ప్రయత్నించకు నేను బాగానే ఉన్నానంటుంది జగతి. భలే కనిపెడతావ్ నువ్వు అని మహేంద్ర అంటే వీటినే తెలివితేటలు అంటారు, కానీ ఈ తెలివి తేటలు నా జీవితంలో ఉపయోగపడడం లేదు అంటుంది జగతి. మిమ్మల్ని కాఫీలు, టీలు తగ్గించమన్నారు కదా అంటే ఈ ఒక్కసారి తాగేస్తా అని మహేంద్ర..ఇద్దరూ కాఫీ కప్ ని అటు ఇటు లాగుతూ ఉంటే గౌతమ్ అక్కడకు వస్తాడు. వీళ్లేంటి ఇంత క్లోజ్ గా ఉన్నారు, మేడం, అంకుల్ అస్సలు కొలిగ్స్ లా కనిపించరేంటని అనుకుంటాడు. ఏంతైనా నువ్వు చేసిన కాఫీలా లేదు అంటాడు మహేంద్ర. మేడం ఒక్కరూ ఉన్నప్పుడు వెళ్లి కలుస్తాను, కాఫీ తాగుతున్నారు కదా డిస్టబ్ చేయడం ఎందుకు అనుకుని వెళ్లిపోతాడు.  


Also Read: గౌతమ్ తీసుకొచ్చిన గులాబీ లాక్కుని వసుధారకి ఇచ్చిన రిషి, గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్


వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రజంటేషన్ చేస్తుంటే రిషి అలా చూస్తుంటాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి వివరిస్తూ మూడింటిలో మొదటి అక్షరాలు కలిపితే 'సూచన ' అని ఇదే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని వివరిస్తాడు. ఇంతలో గౌతమ్ చేతిలోంచి పక్కనున్న ఛైర్ లో పడిన గులాబీ తీసి వసుధారకి ఇస్తాడు రిషి. వసు షాక్ లో ఉండిపోతుంది. ఇప్పటికిప్పుడు నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాలేదు ఇది తీసుకో అంటాడు. సార్ అి వసు ఫోన్ తీస్తుంటే... సెల్ఫీనా నో అనేస్తాడు. ఈ గులాబీని ఎప్పటికీ ఇలానే దాచుకుంటా అని వసు అనుకుంటే...ఇప్పుడు నీ మనసులో ఏమనుకున్నావో నాకు తెలుసు అంటాడు. చెప్పండి అని అంటే ఏమనుకున్నానో తెలుసు అన్నాకానీ చెబుతా అనలేదు కదా..గుడ్ వర్క్ అనేసి వెళ్లిపోతుంటే నేను కూడా వస్తాను అంటుంది. మీరేం అనుకున్నారో చెప్పలేదని వసు అంటే..మనిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు చెప్పడం ఎందుకు  అంటాడు. ( ఈ గులాబీని అందమైన జ్ఞాపకంలా దాచుకోవాలని అనుకుంటున్నావ్ అని నాకు తెలుసు అనుకుంటాడు). ఎపిసోడ్ ముగిసింది.


రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
ఇద్దరూ ఎక్కడికి రెస్టారెంట్ కా అని అడిగిన గౌతమ్ తో...నీకెందుకు రా, నిన్ను మేడంని కలవమని చెప్పాను కదా అంటాడు రిషి. మేడంని కలిసేందుకు వెళ్లాను..అంకుల్-మేడం కాఫీ తాగుతున్నారు.  వాళ్లిద్దరూ ఏంటి క్లోజ్ గా, చిన్నప్పటి ఫ్రెండ్స్ లా సరదాగా ఉన్నారని గౌతమ్ అడగడంతో  విన్నావ్ కదా గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడో,  నువ్వైనా మీ మేడంకి చెప్పొచ్చు కదా అని ఫైర్ అవుతాడు రిషి. ఏం చెప్పాలి సార్ మీరు ఎంత కాదన్నా మేడం మీ అమ్మ  అంటుంది....