గుప్పెడంతమనసు(Guppedantha Manasu) ఫిబ్రవరి15 మంగళవారం ఎపిసోడ్
వసుధార సెల్ నుంచి రిషికి కాల్ చేసిన జగతి థ్యాంక్స్ చెప్పి షాక్ ఇస్తుంది. ఓ ఆడపిల్లకి ధైర్యాన్నిచ్చేది తండ్రి ..ఆ తర్వాత ఎవరు అలాంటి సపోర్ట్ ఇచ్చినా గొప్ప విషయమే అంటుంది. ఫోన్ వసుకి ఇవ్వండని చెప్పిన రిషి..నాకు తెలిసిన పేపర్ వాళ్లున్నారు వాళ్ల నంబర్లు ఇవ్వనా అంటాడు. ఎందుకు అని అడిగిన వసుతో.. లైబ్రరీలో మనిద్దరం ఉండిపోయామన్న విషయం అందరికి చెప్పు అని ఫైర్ అవుతాడు. నేను చెప్పేలేదు అని వసు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోడు రిషి. అందుకే నిన్ను హాస్టల్ కి అనేసి( గతంలో వసుని హాస్టల్ కి పంపించేయమని జగతితో చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు) ఆగిపోతాడు. హాస్టల్ ఏంటి సార్ అని వసు అడిగినా ఏం లేదు అనేది కాల్ కట్ చేస్తాడు.
కాల్ కట్ చేసి పక్కకు చూస్తే తండ్రి మహేంద్ర నిల్చుని ఉంటాడు. నా మాటలు మొత్తం విన్నారా అంటే మొత్తం వినలేదు, ఇప్పుడు చెప్పు వింటాను అంటాడు. గుడ్ నైట్ చెప్పేసి వెళ్లిపోతాడు . రూమ్ లో రిషి, గౌతమ్ కూర్చుని ఎవరి ఆలోచనల్లో వాళ్లుంటారు. వసు, రిషిని లైబ్రరీలో ఉంచేసి దేవుడు నాకు అన్యాయం చేశాడని గౌతమ్ అనుకుంటే.. వసు ఊహల్లో రిషి ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని గౌతమ్ మొదలుపెడతాడు. కాలేజీ షార్ట్ ఫిలింలో నేను హీరోగా నటిస్తున్నా అని చెబుతాడు. మహేంద్ర అంకుల్, జగతి మేడంతో మాట్లాడి రూట్ క్లియర్ చేసుకున్నా అని క్లారిటీ ఇస్తాడు. హీరో-జీరోకి ఒకటే అక్షరం తేడా అనేసి బెడ్ పైనుంచి లేచి వెళ్లిన రిషి..గతంలో వసు బొమ్మ గీసిన పేపర్స్ అన్నీ చూస్తుంటాడు. ఇక్కడ గీసిన బొమ్మేది అని అడుగితే ఏమో తెలియదు అంటాడు గౌతమ్.
కాలేజీలో బుక్ చదువుకుంటూ కూర్చున్న మహేంద్ర...మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ రిషిపై వేయొద్దని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. బయట నిల్చున్న గౌతమ్ తన దగ్గరున్న చార్టు ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. చార్ట్ మారిపోయిందే అనుకుని లోపలకు వెళ్లి మహేంద్రని పలకరిస్తాడు. నేను మిమ్మల్ని డిస్టబ్ చేయలేదు కదా అంటే పర్వాలేదులే అంటాడు. నేను కూడా చార్టులు చూడొచ్చా అని ఓపెన్ చేసి చూస్తుంటాడు. ఇంతలో మహేంద్ర వసుధార బొమ్మున్న చార్ట్ ఓపెన్ చేస్తుంటాడు. మహేంద్ర చేతిలోంచి లాక్కున్న గౌతమ్ ఇది నేను చూస్తా అంటాడు. నేను చూసేసి ఇస్తానంటాడు మహేంద్ర. నేను చూసి చదివి చెబుతాను కదా అని గౌతమ్ లాగేసుకుంటాడు. మిగిలిన చార్టులు కిందపడడంతో వాటిని తీసేందుకు ప్రయత్నించి చార్ట్ మార్చేస్తాడు గౌతమ్. బాయ్ అంకుల్ నేను వెళతాను అనేసి వెళ్లిపోతున్న గౌతమ్ ని...ఎందుకు వచ్చావ్, ఎందుకు వెళుతున్నావ్ అని అడిగితే.. రావాలి అనిపించింది వచ్చాను, వెళ్లాలి అనిపించింది వెళుతున్నా అంటాడు. అయితే చార్ట్ దాచిన విషయం గమనించిన మహేంద్ర..గౌతమ్ ఏదో కోతిపని చేస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు.
షార్ట్ ఫిలిం వర్క్స్ మీరు చూసుకోండి మేడం అన్న రిషి... మినిస్టర్ గారికి ఈ డీటేల్స్ అప్ డేట్ చేయమని చెబుతాడు. ఆర్టిస్ట్ సెలెక్షన్ గురించి మాట్లాడుతుండగా డాడ్ మీరు ట్యాబ్లెట్స్ వేసుకునే టైమ్ అయిందని చెప్పి వాటర్, ట్యాబ్లెట్స్ ఇస్తాడు రిషి. జగతి నువ్వు నాకు ఇచ్చిన అందమైన కానుక రిషి అని మహేంద్ర, ఇంతమంచి కొడుకు దగ్గర ఉండలేకపోతున్నా అని జగతి, ముగ్గురూ విడివిడిగా మంచివారే అని వసుధార ఎవరికి వారు అనుకుంటారు. డాడ్ మీరు రెస్ట్ తీసుకోండి, వసు నువ్వు బ్యాలెన్స్ వర్క్ చూసుకో, ఇక మీరు వెళ్లొచ్చని చెబుతాడు. మేడం మీరు ఉండండి మాట్లాడాలి అంటాడు. రిషి సార్ మేడంని ఎందుకు ఆపినట్టు అని వసు అడిగితే..రిషి ఎప్పుడు ఏం చేస్తాడో నాకే అర్థంకాలేదు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి, మళ్లీ తనని బాధపెట్టే మాటలు అంటాడేమో అని నాకు భయంగా ఉందంటాడు మహేంద్ర.
Also Read: వసుధార నాకు చాలా ప్రత్యేకం-మరి నేను తనకో, బయటపడిన రిషి ప్రేమ, గుప్పెడంతమనసు సోమవారం ఎపిసోడ్
మేడం షార్ట్ ఫిలింలో గౌతమ్ యాక్ట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు మీరేమంటారు అని అడుగుతాడు రిషి. మీరు ఎలా చెబితే అలా అంటుంది జగతి. తను నా ఫ్రెండ్ అది నా వ్యక్తిగతం, తనని తీసుకొచ్చి షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయించడం నాకు నచ్చడం లేదంటాడు. ఎపిసోడ్ ముగిసింది.,
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ముందు గులాబీ ఇస్తాను, దాంతో ప్రపోజ్ చేస్తానని గులాబీ తీసి పట్టుకుంటాడు గౌతమ్. కళ్లు మూసుకుని తెరిచే సరికి రిషి కనిపిస్తాడు. నీకు ఇక్కడేం పని అని అడిగి బయటకు పంపించేస్తాడు. గౌతమ్ నుంచి తీసుకున్న గులాబీని రిషి వసుకి ఇస్తాడు....