కార్తీకదీపం ఫిబ్రవరి15 మంగళవారం ఎపిసోడ్
సౌందర్య ఇంట్లో దీప, కార్తీక్ పెళ్లిసందడికి పిలవకుండా వచ్చిన మోనిత ఎప్పటిలానే రచ్చ చేస్తుంది. పిలవని పేరంటానికి వచ్చావ్ భోజనం చేసి వెళ్లు అని సౌందర్య, దీప చెబుతారు. పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వెళితే మంచిది లేదంటే నా భాషలో చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది దీప. ఓ సెల్ఫీ తీసుకుందామా అని మోనితని రెచ్చగొట్టడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటికొచ్చిన మోనిత... దీప-కార్తీక్ పెళ్లి గుర్తు చేసుకుని రగిలిపోతుంటుంది. ఎక్కడికో వెళ్లారని వెతుక్కుంటే దూరంగా వెళ్లినా ఇద్దరి బంధం మరింత బలపడినట్టుంది, వచ్చీ రాగానే పెళ్లి సందడి ఏంటో అన్యోన్యత ఏంటో అర్థంకాలేదు, ఏదో ఒకటి చేయాలి, మోనిత అంటే వీళ్లకి తెలిసేలా చేయాలి అనుకుంటుంది. 


తన బాబాయ్ నుంచి కాల్ రావడం చూసి ఇకపై బాబాయ్ ని ఎందుకు వాడుకోకూడదు, గతంలో నేను ఎంత ఇబ్బంది పెట్టినా రెండు కన్నీటి బొట్లు కారిస్తే కరిగిపోతాడు అనుకుంటుంది దీప. ఆరోగ్యం ఎలా ఉందని అడిగిన మోనితతో... ఆశలు వదిలేసుకోవడమే అంటాడు. ఏ ఆపరేషన్ అయినా నేను చేయిస్తా అంటుంది. కార్తీక్ ఆపరేషన్ చేస్తే బావుంటుందని ఇక్కడకు వచ్చాను, కార్తీక్ నాకు ఆపరేషన్ చేస్తాడా అని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు చేయడు, ఇప్పుడు ఆయన మీ అల్లుడు అని చెబుతుంది. మీరు నమ్మడం లేదా..నేను, కార్తీక్, బాబు గుడిలో పూజ చేసిన ఫొటో పంపిస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నువ్వు దీప నా కళ్లముందు కలిసి ఉంటే మోనిత చూస్తూ ఊరుకుంటుందా, కళ్లలో నిప్పులు పోసుకుంటుంది, దీప మిమ్మల్ని విడగొట్టేవరకూ నాకు మనశ్సాంతి ఉండదు, కార్తీక్ నావాడు చూస్తూ ఉండు..కార్తీక్ ని నీవైపు నుంచి నా వైపు తిప్పుకుంటాను, ఈ సారి అదిరిపోయే ప్లాన్ వేశాంటుంది. 


Also Read: తమ దగ్గరున్న ఆనంద్ మోనిత కొడుకే అని దీప-కార్తీక్ తెలుసుకుంటారా, కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
నువ్వు డాక్టర్ వి అయినా నాకు కొడుకువే అని సౌందర్య కార్తీక్ కి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దీప నేను బస్తీకి వెళ్లొస్తా అంటుంది.  బస్తీకా అని ఆదిత్య, సౌందర్య షాక్ అవుతారు. మీరు ఊర్లో లేనప్పుడు ఇక్కడ చాలా జరిగాయంటూ మోనిత బస్తీలో ఆసుపత్రి పెట్టిన విషయం చెబుతారు. ఇలాంటప్పుడు నువ్వు బస్తీకి వెళితే అది అక్కడే ఉంటుంది, కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకు ఇప్పుడు వెళ్లొద్దంటారు సౌందర్య, ఆదిత్య.  మన తప్పు లేకున్నా మోనితకి భయపడుతున్నాం ఇది మానేయాలి అంటుంది దీప. మోనిత బాబు నిజంగా తప్పిపోయాడా, డ్రామా ఆడుతోందా అనుకుంటాడు కార్తీక్. మోనితకి భయపడాల్సిన అవసరం లేదు..బస్తీకి వెళ్లొస్తా అని వెళుతుంది దీప.


మోనిత ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో బస్తీలో ఉన్న అరుణ వెళ్లి తలుపుతీస్తుంది. నేను మోనిత బాబాయ్ ని అంటాడు. కొంచెం బాబాయ్ ని మెప్పించే మాట్లాడు అనుకుని బయటకు వెళ్లి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తున్న తన బాబాయ్ ని నన్ను నమ్మడం లేదా..అయినా నమ్మించక తప్పదంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నాకున్న చుట్టాలైనా, దగ్గరవాళ్లైనా బాబాయ్ ఒక్కరే అంటుంది. ఇంట్లోకి రావడంతోనే గోడపై ఉన్న మోనిత, కార్తీక్ ఫొటో చూస్తూ ఆలోచనలో పడతాడు. అది చూసి మోనిత దొంగ ఏడుపు మొదలెడుతుంది..గతంలో నేను అన్నవన్నీ మనసులో పెట్టుకోవద్దు నన్ను క్షమించు అని కాళ్లపై పడుతుంది. నీకు కోపంతో పాటూ ప్రేమ కూడా ఎక్కువే అంటాడు మోనిత బాబాయ్. 


Also Read:  వసుధార నాకు చాలా ప్రత్యేకం-మరి నేను తనకో, బయటపడిన రిషి ప్రేమ, గుప్పెడంతమనసు సోమవారం ఎపిసోడ్
చాలా రోజులు తర్వాత హాస్పిటల్లో అడుగుపెట్టిన కార్తీక్ కి ఘన స్వాగతం పలుకుతారు. మీ క్యాబిన్ క్లీన్ చేయించాం అంటారు. తన క్యాబిన్లోకి వెళ్లి గతంలో జరిగినవి, మీరు ఎప్పటికీ డాక్టర్ బాబే అన్న దీప మాటలు గుర్తుచేసుకుంటాడు. మీరు హాస్పిటల్ కి రాగానే మోనిత మేడం ఇన్ఫామ్ చేయమన్నారని సిబ్బందిలో ఒకరొచ్చి చెబుతారు. ఇన్ఫామ్ చేయాలా, వద్దా అంటే....అవసరం లేదని చెబుతాడు కార్తీక్. ఏపిసోడ్ ముగిసింది...