AP Weather Updates Today: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. నిన్న ఏపీలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు తూర్పు దిశ, ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు అలాగే ఉంటాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.  చలి తీవ్రత మరికొన్ని రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొనసాగనుంది. ఆ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. అత్యల్పంగా కళింగపట్నంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.  విశాఖపట్నంలో 16.8డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18.4 డిగ్రీలు, నందిగామలో 18.9 డిగ్రీలు, తునిలో 18.7 డిగ్రీలు, బాపట్లలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఆంక్షలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యవరంలో ఏకంగా 15.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 17.1 డిగ్రీలు, నంద్యాలలో 17.8 డిగ్రీలు, కర్నూలులో 19.4 డిగ్రీలు, తిరుపతిలో 19.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల లాగే సీమలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


తెలంగాణలో చలి
Weather Updates Today In Telangana: తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు దట్టంగా కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి. వర్షాలు లేకపోయినా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు.


Also Read: Gold Price Today: గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర, రూ.1,200 మేర పెరిగిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ


Also Read: Pawan Kalyan: ఎరను ఆహారం అనుకుని ఆశపడుతున్నారు పవన్ సెటైరికల్ ట్వీట్, వాళ్లను ఉద్దేశించేనా?