ప్రముఖ యూట్యూబర్, 'బిగ్ బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ జీవితంలో ఓ హ్యాపీ మూమెంట్ ఇది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అతడి ఇన్‌స్టా అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.5 మిలియన్స్‌కు చేరుకుంది. పాతిక లక్షల మంది అతడి ఖాతాను అనుసరిస్తున్నారన్నమాట. అయితే... అతడి కంటే దీప్తీ సునయనకు ముందున్నారు. 3.4 మిలియన్ ఫాలోయర్స్‌తో షణ్ముఖ్ జస్వంత్ కంటే ఆమె ఓ మెట్టు పైన ఉన్నారు.
ఇక, షణ్ముఖ్ జస్వంత్ గురించి చెప్పాలంటే... 'బిగ్ బాస్'కు ముందు, 'బిగ్ బాస్'కు తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే? 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి ముందు అతడికి పాజిటివ్ ఇమేజ్ ఉండేది. హౌస్‌లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఇది అతడు చెప్పిన మాటే. హౌస్‌లో జరిగిన విషయాల వల్ల లవ్ లైఫ్‌లో సమస్యలు వచ్చాయి. అతడికి దీప్తీ సునయన బ్రేకప్ చెప్పింది.
Also Read: 'మా బ్రేకప్ కు కారణం సిరి కాదు' అసలు విషయం చెప్పిన షణ్ముఖ్
'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి ముందు 'సాఫ్ట్‌వేర్ డెవ్‌లవ్‌పర్', 'సూర్య' వెబ్ సిరీస్‌ల విజయాలతో హ్యాపీగా ఉన్నారు. హౌస్‌లోకి వెళ్ళడానికి ముందు జరిగిన యాక్సిడెంట్, ఆ తర్వాత హౌస్‌లో జరిగిన విషయాల వల్ల విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ 2.5 మిలియన్ ఫాలోయర్స్ అందుకోవడం చిన్న హ్యాపీ మూమెంట్ అని చెప్పవచ్చు.
Also Read: అయ్యో 'రాధే శ్యామ్'! ఆ వెబ్ సిరీస్ కంటే వెనుక పడిందే?