Radhe Shyam Vs 30 Weds 21: అయ్యో 'రాధే శ్యామ్'! ఆ వెబ్ సిరీస్ కంటే వెనుక పడిందే? 

ప్రేమికుల రోజున 'రాధే శ్యామ్' గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. దీని కంటే అదే రోజున విడుదలైన ఓ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ కొంత వర్రీ అవుతోంది.

Continues below advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ప్రేమకథా చిత్రం 'రాధే శ్యామ్'. ప్రేమికుల రోజున సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే... అదే రోజున '30 వెడ్స్ 21' రెండో సీజన్ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ కూడా విడుదలైంది. రెండు రోజులకు ప్రభాస్ గ్లింప్స్‌ కంటే ఆ ఎపిసోడ్‌కు ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

Continues below advertisement

యూట్యూబ్‌లో బుధవారం సాయంత్రం '30 వెడ్స్ 21' సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ టాప్ పొజిష‌న్‌లో ట్రెండ్ అవుతోంది. దాని తర్వాత ప్లేస్‌లో మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో 'కళావతి...' సాంగ్, ఆ తర్వాత ప్లేస్‌లో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుతు...' ఉన్నాయి. ఆ తర్వాత 'రాధే శ్యామ్' గ్లింప్స్ ఉంది. 'కళావతి...' పాట 23 మిలియన్ వ్యూస్, 'అరబిక్ కుతు...' పాట 33 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. మరి, 'రాధే శ్యామ్' గ్లింప్స్‌కు ఎందుకు ఆదరణ లభించలేదనేది బాహుబలి అభిమానులకు అర్థం కావడం లేదు.


'రాధే శ్యామ్' గ్లింప్స్‌ కంటే '30 వెడ్స్ 21' సీజన్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు ఎక్కువ వ్యూస్ రావడం అభిమానులను కలవరపెడుతోంది. '30 వెడ్స్ 21' ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కావడం కూడా వాళ్ళకు కలిసొచ్చింది.

Also Read: రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్

Continues below advertisement