Statue of Belief Largest Statue of Lord Shiva: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ బిలీవ్'. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో నిర్మించిన ఈ విగ్రహం ప్రత్యేకతలివే..
- 'స్టాట్యూ ఆఫ్ బిలీవ్' విగ్రహం ఎత్తు 369 అడుగులు
- 2 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మించిన ఈ విగ్రహం 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది
- ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు 50 వేల మందికి పదేళ్లు సమయం పట్టింది
- ఈ ఆకర్షణీయమైన విగ్రహం కోసం 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుక ఉపయోగించారు
- విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి
- వర్షం, సూర్యకాంతి నుండి రక్షించడానికి, విగ్రహానికి జింక్ పూత, రాగి పెయింట్ చేశారు
- విగ్రహం క్రిందిభాగం లోపల నిర్మించిన హాలులో 10 వేల మంది భక్తులకు ప్రవేశం ఉంటుంది
- ఈ విగ్రహం ముందు 25 అడుగుల ఎత్తు, 37 అడుగుల వెడల్పుతో నందిని కూడా తయారు చేశారు
Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా
2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గహ్లోత్, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. కొండపైన ప్రతిష్టించిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో రూపొందించారు. ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగే ఈ విగ్రహం రాత్రిపూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 250 కి.మీ వేగంతో వీచే గాలులు కూడా విగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపకుండా నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఈ విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతంలో బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటి వాటిని ఏర్పాటు చేశారు.
Also Read: పాలు, నీళ్లు, పంచామృతాలు - శివుడికే అభిషేకం ఎందుకు చేస్తారు!
శ్రీ శివ పంచాక్షరి స్తోత్రమ్
ఓం నమః శివాయ శివాయ నమః ఓంఓం నమః శివాయ శివాయ నమః ఓం
నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ |నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||
మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయతస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||
శివాయ గౌరీ వదనాబ్జ బృందసూర్యాయ దక్షాధ్వర నాశకాయ |శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయతస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్యమునీంద్ర దేవార్చిత శేఖరాయ |చంద్రార్క వైశ్వానర లోచనాయతస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||
యఙ్ఞ స్వరూపాయ జటాధరాయపినాక హస్తాయ సనాతనాయ |దివ్యాయ దేవాయ దిగంబరాయతస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
Also Read: 'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
Also Read: అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!