Maha Shivaratri 2024:  మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని,సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అయితే ప్రత్యేక పూజలు చేయకపోయినా శివలింగంపై కనీసం నీళ్లు, పాలు..ఇంకా వీలైతే పంచామృతాలు సమర్పించి  పంచాక్షరి మంత్రం అయిన ఓ నమఃశివాయ అని జపించినా చాలు అని చెబుతారు. శివుడికి మరో పేరు రుద్రుడు. అందుకే జలాభిషేకాన్ని రుద్రాభిషేకం అని కూడా ఉంటారు. ఇంతకీ శివలింగానికి నీళ్లు, పాలతో ఎందుకు అభిషేకం చేస్తారు? శివుడుని అభిషేక ప్రియుడు అని ఎందుకంటారు? 


Also Read: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి!


శివుడికి అభిషేకం ఎందుకు
శివలింగానికి నీళ్లు, పాలు, పంచామృతాలతో ఎందుకు అభిషేకం చేస్తారో చెప్పేందుకు పురాణాల్లో ఓ కథ చెబుతారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి కౌస్తుభ మణి, కల్పవృక్షం, ఐరావతం, మహాలక్ష్మి, ధన్వంతరి, అమృత కలశం ఉద్భవించాయి. అయితే వీటిన్నింటికన్నా ముందు హాలాహలం వెలువడింది. ఆ విషం కారణంగా సకల జీవరాశులు ప్రమాదంలో పడడంతో బ్రహ్మ, విష్ణువు అగ్రతాంబూలం తీసుకోవాలని శివుడిని అడుగుతాడు. అప్పుడు ఆ విషాన్ని సేవించమంటావా అని పార్వతీదేవి అంగీకారం తీసుకున్నాకే శివుడు దానిని సేవించాడు. ఆ గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. అయితే ఆ వేడిని చల్లార్చేందుకే నిత్యం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారని చెబుతారు. 


Also Read:  అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!


ఏ భార్య అయినా భర్తని విషం మింగమంటుందా..కానీ పార్వతీ దేవి అలా ఎలా ఒప్పుకుంది అనే ప్రశ్నకు సమాధానమే ఈ పద్యాలు...


నీయందు సంభవించును
నీయందు వసించి యుండు నిఖిల జగంబుల్
నీయంద లయము బొందును
నీయుదరము సర్వభూత నిలయము రుద్రా


శిక్షింతు హాలహలమును
భక్షింతును మధూర సూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతు బ్రాణికోట్లను
వీక్షింపుము నేడు నన్ను వికచాబ్జముఖీ


మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో


భావం:  ఇక్కడ పార్వతీ దేవి మంగళసూత్రాన్ని నమ్మడం అంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం! ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలోని సత్యాన్ని నమ్మడం! ఇక్కడ పార్వతి ఎవరు, "సర్వమంగళ". అంటే పరిపూర్ణమైన శుభానికి ఆకారమే ఆవిడ. తన మాంగల్యం మీద  అంత నమ్మకం ఉండడం వల్లే ఆమె సర్వమంగళ అయింది. అందుకేలమింగుతున్నది తన భర్తని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది.


Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా


శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి
శివలింగానికి బంగారం, వెండి, ఇత్తడి లేదా రాగి పాత్రలో నీరు సమర్పించాలి..మట్టి పాత్ర అయినా పర్వాలేదు కానీ ప్లాస్టిక్, స్టీలు పాత్రలు వినియోగించరాదు. అభిషేకం చేస్తున్నప్పుడు శివపంచాక్షరి మంత్రం జపించాలి.  పంచామృతాలు, బిల్వ పత్రాలు తో శివుడికి అభిషేకం చేయడం పుణ్య ఫలం. 


Also Read:  'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!