Prema entha maduram Serial Today Episode: ఆనందిని వెతుక్కుంటూ వెళ్లిన ఆర్యను వాళ్ల బాబాయ్‌ కొడుకు అజయ్‌ ఒక బిల్డింగ్‌  కు రప్పిస్తాడు. నువ్వు ఎవరికోసం వెతుకుతున్నావో నాకు తెలుసు అంటాడు అజయ్‌. అజయ్‌ వైఫ్‌ మీరా ఆనందిని కిడ్నాప్‌ చేసిన వీడియో చూపిస్తుంది. దీంతో ఆర్య కోపంగా అజయ్ మీదకు వెళ్తాడు. అజయ్‌ రివాల్వర్‌ తీస్తాడు. ఇంతలో కొంతమంది రౌడీలు వస్తారు. వాళ్లను ఆర్య కొడతాడు దీంతో పక్కనుంచి రౌడీలతో ఆర్యను షూట్‌ చేయిస్తాడు అజయ్‌. దీంతో ఆర్య కిందపడిపోతాడు. బలవంతంగా స్టాంప్‌ పేపర్స్‌ మీద ఆర్య సైన్‌ తీసుకుని వెళ్లిపోతారు అజయ్‌, మీరా మరోవైపు ఆర్య కోసం అను ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ దూరంగా పడటంతో ఆర్య లిఫ్ట్‌ చేయలేకపోతాడు. భయంతో అను బయటకు వచ్చి ఆర్యను వెతుకుతుంది. కేశవ ఎదురవుతాడు.


కేశవ: ఏమైంది అను


అను: సార్‌ అది ఆర్య సార్‌ సైట్‌ దగ్గరకు వెళ్లారు. ఫోన్‌ చేస్తే తీయడం లేదు.


కేశవ: అవునా నేను కనుక్కుంటాను


అంటూ సత్యంకు ఫోన్‌ చేసి ఆర్య గురించి అడుగుతాడు. ఆర్య సైట్‌ దగ్గరకు రాలేదని చెప్పడంతో ఇద్దరూ షాక్‌ అవుతారు. వెంటనే కేశవ తన ఫోన్‌తో ఆర్య ఫోన్‌కు కనెక్ట్‌ చేసి లోకేషన్‌ తెలుసుకుంటాడు. ఫోన్‌లో లిల్లి గార్డెన్స్‌ లోకేషన్‌ చూపించడంతో ఇద్దరూ కంగారుగా లిల్లి గార్డెన్స్‌కు వెళ్తారు. అక్కడ ఆర్య పడిపోయి ఉండటాన్ని చూసి ఆర్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మరోవైపు అజయ్‌, మీరా జ్యోతిష్యుడి దగ్గర ఉంటారు.


జ్యోతిష్యుడు: నీకు మహార్జాతకం నడుస్తుందని చెప్పాను కదా అజయ్‌. నౌ యు ఆర్‌ ఏ కింగ్‌ మేకర్‌. నువ్వు ఏం చేసినా నీకు తిరుగుండదు. నీ గ్రహబలం చాలా బాగుంది.


అజయ్‌: థాంక్యూ శర్మగారు. మీ సహకారం, మీరా సహకారం లేకపోతే నేను ఇదంతా చేయలేను.


జ్యోతిష్యుడు: ఆడవాళ్లు తలుచుకుంటే పెద్దపెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఆ ఆర్యవర్దన్‌ ఎంత?


మీరా: నా పంతం ఇంకా తీరలేదు శర్మగారు. ఏ వ్యాపార సామ్రాజ్యానికి అయితే ఆర్యవర్ధన్‌ మహారాజులా ఫీలవుతున్నాడో ఆ స్థానం ఆ సామ్రాజ్యం పూర్తిగా నా భర్త అజయ్‌ వర్ధన్‌కు దక్కాలి.


జ్యోతిష్యుడు: తీరుతుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ మీకు మరోకరు యాడ్‌ అయితే మీ కొరిక తప్పకుండా తీరుతుంది.


అనగానే ఎవరు అని అజయ్‌ అడగ్గానే అక్కడకు జలంధర్‌ వస్తాడు. ఫస్ట్‌ బాల్‌కే సిక్సర్‌ కొట్టినట్టు దిగిదిగగానే ఆర్యకు మంచి స్ట్రోక్ ఇచ్చావు అనగానే అందరూ కలిసి ప్లాన్‌ చేస్తారు. ఆర్య చావుబతుకుల మధ్య ఉండగానే ఆయన ఇండస్ట్రీస్‌ను హస్తగతం చేసుకోవాలి అని జ్యోతిష్యుడు చెప్పగానే అవును అంటూ అందరూ  ప్లాన్‌ చేస్తారు.    


జ్యోతిష్యుడు: ఇవాళ మధ్యాహ్నం నీ జాతకం మారబోతుంది అదే టైంకు ప్రెస్‌మీట్‌ పెట్టి వర్ధన్‌ ఫ్యామిలిలో మరో వారసుడు ఉన్నాడని ఆస్థిలో న్యాయమైన వాటాకోసమే నువ్వు వచ్చావని చెప్పు.


జలంధర్‌: ఇలా పబ్లిక్‌ కు లీక్‌ చేస్తే ఆర్యవర్ధన్‌ శత్రువులం మేమే అని చెప్పినట్లు అవుతుందేమో?


అజయ్‌: నో జలంధర్‌ పబ్లిక్‌ కు ఓపెన్‌ అవ్వడం వల్ల మన విషయంలో ఆర్య ఏదైనా యాక్షన్‌ తీసుకోవాలన్నా? ఆలోచించాల్సి వస్తుంది. ఇట్స్‌ లైక్‌ అవర్‌ సెక్యూరిటీ.


జ్యోతిష్యుడు: మరో ముఖ్య విషయం. ఈ ఆస్తులన్నింటికన్నా లిల్లి గార్డెన్స్‌  లో చోటు ముఖ్యం. అందులో 900 ఏండ్ల నాటి శివలింగం ఉంది. ఆర్యవర్ధన్‌ ఎదుగుదలకు ఆ లింగం ప్రభాం చాలా ఉంది. అందుకే మనం ఎలాగైనా ఆ లింగాన్ని వశం చేసుకోవాలి.


అజయ్‌: అన్నీ వన్‌బైవన్‌ జరిగిపోతాయి శర్మగారు.


అంటూ అందరూ ప్లాన్‌ వేస్తుంటారు. మరోవైపు హాస్పిటల్‌లో ఆర్యను అడ్మిట్‌ చేస్తారు అను కేశవ. ఐసీయూలో ఉన్న ఆర్యను చూసి అను, కేశవ ఏడుస్తుంటారు. ఇంతలో పిల్లలను తీసుకుని శారదాదేవి, నీరజ్, మాన్షి వస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. 


Also Read: ఎంతపని చేశావ్‌ మహేష్‌! - ఆ రూల్‌ బ్రేక్‌ చేసి రాజమౌళికి షాకిచ్చిన సూపర్‌ స్టార్‌?