Jagadhatri Serial Today Episode: తానేంటే రేపటి నుంచి ఆ ధాత్రికి చూపిస్తానని చెప్తుంది దివ్యాంక. అందుకోసం మీరు నాకు హెల్ప్ చేయాలని నిషికను అడుగుతుంది. అయితే నిన్నగాక మొన్న పరిచయం అయిన కౌషికి కోసమే మిమ్మల్ని ఓ అటాడుకుంది ఇప్పుడు వాళ్ల అమ్మ గురించే నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ధాత్రి ఊరుకుంటుందా? అంటూ వైజయంతి అడుగుతుంది. ఊరుకోదు కానీ మీరు రేపు నా పెళ్లి మీ ఇంట్లో జరిగేటట్లు చూడాలి తర్వాత కథ నేను నడిపిస్తాను అంటుంది దివ్యాంక.
వైజయంతి: నీ పెళ్లి మా ఇంట్లో జరగడానికి కౌషికి ఎందుకు ఒప్పుకుంటుంది.
నిషిక: నేను ఒప్పిస్తాను. నేను మాటిస్తున్నాను దివ్యాంక రేపే మాఇంట్లో నీ మెహింది ఫంక్షన్ జరుగుతుంది.
వైజయంతి: ఎట్టా జరిపిస్తావమ్మీ.. ఆ కౌషికి అడ్డుపడుతుంది కదా?
నిషిక: ఇలా భయపడుతూ ఉంటే అలానే ఉండిపోతామత్తయ్యా? ఏదో ఒకటి చేసి ఆ ఫంక్షన్ ఈ ఇంట్లోనే జరిగేలా చేస్తాను.
అని శపథం చేస్తుంది నిషిక. మరోవైపు ధాత్రి ఏడుస్తూ నిషిక, దివ్యాంక అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. కేదార్ వచ్చి ధాత్రిని ఓదారుస్తాడు.
ధాత్రి: మా అమ్మా నేరస్తురాలు కాదని నేను నిరూపించలేనేమోనని భయమేస్తుంది కేదార్.
కేదార్: అసలు నువ్వు మా ధాత్రివేనా? దివ్యాంక లాంటి వాళ్లు వందమంది వచ్చినా సమాధానం చెప్పే జగధాత్రివి నువ్వు.
ధాత్రి: మా అమ్మ నగలు నేను వేసుకుంటానని ఏనాడు అనుకోలేదు కేదార్.
ఇంతలో కౌషికి అక్కడకు వస్తుంది.
కౌషికి: ధాత్రి వాళ్ల మాటలకు బాధపడుతున్నావా? అయినా ఎప్పుడో మీ అమ్మా చేసిన తప్పుకు నిన్ను నిందించినందుకు వాళ్లు సిగ్గుపడాలి. మీ అమ్మా ఏ తప్పూ చేయలేదని నువ్వు నమ్ముతున్నావంటే అది నిజమే అయ్యుంటుంది జగధాత్రి. అది నిరూపించడానికి నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను.
ధాత్రి: థాంక్స్ వదిన మా అమ్మా ఏ తప్పు చేయలేదు. మా అమ్మను నిజాయితీ పోలీసాఫీసర్‌గా గుర్తు పెట్టుకునేలా చేస్తాను.
అనగానే కౌషికి ధాత్రిని మెచ్చుకుంటుంది. వాళ్ల అమ్మా చనిపోయిన రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారని అడుగుతుంది. డ్రైవర్ ఉన్నాడని ఆరోజు నుంచి తను కూడా కనిపించడం లేదని చెప్తుంది. తర్వాత యువరాజ్ కేదార్ టీషర్ట్‌కు వేసిన స్టిక్కర్ చూసి కేదార్, ధాత్రి పోలీసులేనని డిసైడ్ అయిపోతాడు. కేదార్, ధాత్రిని పిలుస్తాడు. మీరు పోలీసులు కదా అని యవరాజ్ నిలదీయడంతో
కేదార్: ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది. మేము సాదారణ స్కూల్ టీచర్లం. మేము పోలీసులమేంటి?
యువరాజ్: అబ్బాబ్బా ఏం పర్మామెన్స్ ఇంట్లోనేమో అమాయకులు, బయటేమో పోలీసులు. మీరు ఈ ప్రపంచాన్ని మోసం చేయోచ్చోమో కానీ నన్ను మోసం చేయలేరు.
అనగానే అసలు నువ్వు మమ్మల్ని పోలీసులని ఏ ఆధారంతో అంటున్నావు అనగానే తను అతికించిన స్టిక్కర్ గురించి చెప్తాడు. స్టిక్కర్ ఎక్కడుంది అని ధాత్రి అడుగుతుంది. వెంటనే యువరాజ్ టీషర్ట్ తీసి చూడటంతో అక్కడ స్టిక్కర్ ఉండదు. దీంతో యువరాజ్ వెళ్లిపోతాడు. ఎలా ధాత్రి స్టిక్కర్ ఎవరు తీశారు అని అడగ్గానే తానే తీశానని ఎలా తీసింది చెప్తుంది ధాత్రి. తర్వాత యువరాజ్ అనుమానంతో ధాత్రిని ఎలాగైనా పట్టించాలని డిసైడ్ అవుతాడు. మరోవైపు ధాత్రి కూడా మనం పోలీసులమని తెలిసినా ఏం చేయలేడని చెప్తుంది. తర్వాత సుధాకర్‌కు ధాత్రి కాఫీ తీసుకొస్తుంది. సుధాకర్ నేను అడిగానా? ఎందుకు తెచ్చావని చెప్పి వెళ్లిపోతాడు. ధాత్రి, కేదార్ బాధపడతారు. పక్కకు వెళ్లిన సుధాకర్ కూడా భగవంతుడా మంచి మనిషి ధాత్రిని బాధపెట్టాను అంటూ తాను బాధపడతాడు. తర్వాత దివ్యాంక రావడంతో ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. నిషికను మీ వాళ్లకు చెప్తా అన్నావు చెప్పావా అని దివ్యాంక అడగడంతో చెప్పడానికే కిందకు వస్తున్నాను ఇంతలోనే నువ్వు వచ్చావు అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: దెయ్యంతో డేటింగ్, రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది - ఉత్కంఠగా సాగిన ఆశిష్ 'లవ్ మీ' టీజర్