Mahesh Babu New Look Viral: ప్రస్తుతం మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి-మహేష్‌ సినిమా కోసం. యాక్షన్‌ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ మూవీ ప్రకటనతోనే విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడెప్పుడు సెట్‌పైకి వస్తుందా? అని ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా ట్రెండింగ్‌లో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను శరవేగంగా జరుగుతుందట. ఇక ఈ సినిమా కోసం మహేష్‌ ఇటీవల యూరప్‌ వెళ్లోచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ కోసం వెళ్లాడు. అంతేకాదు లుక్‌ పరంగా మేకోవరై వచ్చాడు.


ఎంతపని చేశావ్ మహేష్!


ఇక సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వస్తుందని మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు. తన లేటెస్ట్‌ లుక్‌ షేర్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అయితే ఇది చూసి అభిమానులంతా ఫుల్‌ ఖుష్ అవుతుంటే.. SSMB29 టీం మాత్రం టెన్షన్‌ పడుతుందట. మహేష్‌ ఏంటీ ఇంతపని చేశాడంటున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో ఓ రెండు లేదా మూడేళ్లు ఆయనకే కేటాయించాలి. మరే ఇతర ప్రాజెక్ట్స్‌కి కమిట్ అవ్వకూడదు. ముఖ్యంగా మూవీ షూటింగ్‌ గురించి కానీ, నటీనటుల పాత్రలపై ఎలాంటి లీక్స్‌ ఉండకూడదు. చెప్పాలంటే జక్కన్నతో సినిమా అంటే మూవీ షూటింగ్‌ అయ్యేవరకు ఆ హీరోలు బయటకు కనిపించకూడదు. అంతేకాదు సోషల్‌ మీడియాపై కూడా యాక్టివ్‌ ఉండకూడదు. ఉన్న తమ వ్యక్తిగత విషయాలను మాత్రమే ప్రస్తావించాలి. తన మూవీకి సంబంధించి స్వయంగా హీరో ఎలాంటి అప్‌డేట్‌, లీక్‌ ఇవ్వకూడదు.






జక్కన్న నిబంధనను ఉల్లంఘించాడా? 


ఆ ప్రాజెక్ట్‌ సంబంధించి ఎలాంటి ప్రకటన, అప్‌డేట్‌ అయిన స్వయంగా మూవీ టీం నుంచే వెళ్లాలి అనేది ఆయన కండిషన్‌. అసలు విషయం చెప్పాలంటే ఆ సినిమా చేస్తున్నంత కాలాం ఆ హీరో అజ్ఞాతం చేయాల్సిందే. సినిమా పనులు మొదలైనప్పటి నుంచి ఈ రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే. కానీ మహేష్‌ ఆదిలోనే జక్కన్నకు షాక్‌ ఇచ్చాడని, ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడా? అంటున్నారు. ఎందుకంటే జక్కన్న మూవీలో మేకింగ్‌ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడు. తన ప్రాజెక్ట్స్ సంబంధించిన ఎలాంటి లీక్స్‌ రాకుండ జాగ్రత్త పడతాడు. ముఖ్యంగా తన హీరోల లుక్‌, పాత్రలపై గ్రాంటెడ్‌గా వ్యవహరిస్తాడు. అలాంటిది తాజాగా మహేష్‌ తన కొత్తలుక్‌ షేర్‌ చేశాడు. ఒకవేళ ఇది SSMB29 సినిమాలోని లుక్‌ అయితే మాత్రం జక్కన్నకు ఇది  గట్టి షాక్ అనే చెప్పాలి.


అదే నిజమైతే మాత్రం మహేష్‌ రాజమౌళి కండిషన్స్‌ని దిక్కరించినట్టే అవుతుంది. మరి మహేష్‌ రిలీజ్‌ చేసిన ఈ కొత్త లుక్‌ రాజమౌళి సినిమాదా? లేక ఏదైనా ప్రకటనకు సంబంధించిందా అనేది తెలియాలి. ఇదిలా ఉంటే SSMB29 కోసం రాజమౌళి, మహేష్ కోసం సుమారు ఎనిమిది లుక్స్‌ ప్లాన్‌ చేసినట్టు రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడట. ఇదే ఫీచర్స్‌ రాజమౌళి మొత్తం ఎనిమిది లుక్స్‌ను డిజైన్ చేయించారట. వీటిలో మహేష్ బాబుకి సెట్ అయ్యే బెస్ట్ లుక్‌ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారనేది తాజా సమాచారం. మరి ఆ తాజా లుక్‌లోనిది ఇదేనేమో అంటున్నారు. లేదా లాంగ్‌ హెయిర్‌, గుబురు గడ్డంలోకి మారేముందు ఒకసారి తన క్లిన్‌ లుక్‌ని షేర్‌ చేశాడా? అని కూడా నెటజన్లు చర్చించుకుంటున్నారు.