Dhanteras 2024 Wishes In Telugu: ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజునే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. 5 రోజుల దీపావళి పండుగ ధన త్రయోదశితో మొదలవుతుంది.  ఈ ఏడాది అక్టోబరు 30 బుధవారం వచ్చింది .  ఈ రోజే ధన్వంతరి జయంతి, పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి దేవి ఆవిర్భవించిన రోజు. అందుకే లక్ష్మీ ఆవిర్భావానికి చిహ్నంగా బంగారం, వెండి కొనుగోలు చేసి ప్రత్యేక పూజ చేస్తారు. ధన త్రయోదశి రోజు బంగారు, వెండి ఆభరణానలు పూజలో ఉంచి గణేషుడిని, శ్రీ మహాలక్ష్మిని, కుబేరుడిని పూజిస్తే సిరిసంపదలకు కొదువ ఉండని పండితులు చెబుతారు. ఈ రోజు సాయంత్రం వెలిగించే యమదీపం అపమృత్యుదోషాన్ని తొలగిస్తుందని విశ్వాసం.


5 రోజుల వెలుగుల పండుగలో మొదటి రోజైన ధనత్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి.


Also Read: ధన త్రయోదశికి వెండి, బంగారం కొనలేనివారు తక్కువ ఖర్చుతో ఇవి కొనుక్కున్నా మంచిదే!


ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
ధన త్రయోదశి శుభాకాంక్షలు


అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత |
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే ||
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు


ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం|
స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ||
మీ అందరకీ ధన త్రయోదశి శుభాకాంక్షలు


ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే 
అమృతకలశహస్తాయ సర్వామయవినాశనాయ 
త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా |
ధన త్రయోదశి శుభాకాంక్షలు


ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి |
తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ ||
ధన త్రయోదశి శుభాకాంక్షలు 


 ఓం హ్రీం శ్రీ క్రీం క్లీం శ్రీ లక్ష్మీ మమ గృహే ధన పూరాయే, ధ పూరాయే|
చింతయా దూర దూర స్వాహా ||
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు


Also Read: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!


యా రక్తాంబుజవాసినీ విలాసినీ ఛన్దశు తేజస్వినీ|
యా రక్త రుధిరాంబర హరిశాఖీ యా శ్రీ మనోళాదినీ||
యా రత్నాకరమంథానాత్ప్రగతితా విష్ణోస్వయ గేహినీ|
సామాంపాతు మనోరమా భగవతీ లక్ష్మీశ్చ పద్మావతీ||
ధన త్రయోదశి శుభాకాంక్షలు


లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ ఇల్లు సిరిసంపదలతో నిండిఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు


కొత్త కలలు, కొత్త ఆశలు నెరవేరి 
మీ జీవితంలో వెలుగులు విరజిమ్మాలి
ధన త్రయోదశి శుభాకాంక్షలు


శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు
ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరి అనుగ్రహం 
మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలి
ధన త్రయోదశి శుభాకాంక్షలు


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!


ఇల్లంతా వెలుగులు పంచే దీపకాంతులతో మృత్యుభయం తొలగిపోవాలి
మీరు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు


ఈ ధన త్రయోదశి మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని అందించాలి
ధన త్రయోదశి శుభాకాంక్షలు


ధన త్రయోదశి రోజు యమదీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదవండి
 
'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సః
త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ ధన త్రయోదశి శుభాకాంక్షలు