Fabulous Facts About Diwali 2024


దీపావళి 2024 ఎప్పుడు ( Diwali 2024 Date 31 or 1)


తిథులు రెండు రోజులు వచ్చినప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే అమావాస్య సాయంత్రానికి ఉన్న రోజు పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి నిస్సందేహంగా దీపావళి అక్టోబరు 31 నే జరుపుకోవాలి. ఈ వెలుగుల పండుగ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అద్భుత విషయాలివే...


Also Read: దీపావళికి ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు!


దీపావళి గురించి వాస్తవాలు (Fabulous Facts About Diwali 2024)


1. దేశవ్యాప్తంగా జరుపుకునే వేడుక దీపావళి. ఇది కేవలం హిందూ పండుగగా భావిస్తారు..సిక్కులు, జైనులు కూడా దివాలీ ఘనంగా జరుపుకుంటారు 


2. దీపావళి అంటే ఆ రోజు బాణసంచా కాల్చేస్తే సరిపోతుందనుకుంటారు కానీ..ఇది ఐదు రోజుల పండుగ. ధనత్రయోదశి, నరకచతుర్థశి, 
దీపావళి, బలిపాడ్యమి, భాయ్ దూజ్.  ఏటా ఈ పండుగలు ఒకే తేదీకి రావు.. చంద్రుడి స్థానాన్ని బట్టి నిర్ణయిస్తాయి. 
 
3. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ సందర్భంగా ప్రజలంతా ఇంటి ముందు దీపాల వరుసతో నింపేస్తారు..అందుకే దీపావళి అనే పిలుస్తారు


4. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చాలా ప్రత్యేకం. దక్షిణాదిన సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ఉత్తరాదిన దీపావళి అంతే పెద్ద పండుగ. ఈ రోజు లక్ష్మీపూజ చేయడం చాలా విశేషంగా భావిస్తారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ లక్ష్మీపూజ చేస్తున్నారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే  ఐశ్వర్యం , ఆనందం ఉంటుందని విశ్వసిస్తారు.


5. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునే దీపావళి వెనుక ఎన్నో ఇతిహాసాలున్నాయి.  ఉత్తర భారతదేశంలో... రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా జరుపుకున్నారు. ఈ రోజు అమావాస్య కావడంతో దీపాలు వెలిగించి బాణాసంచా వెలుగులతో అయోధ్యను నింపేశారు..


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!


6. బెంగాల్ ప్రాంతంలో ప్రజలు దుష్ట శక్తులను నాశనం చేసే కాళీమాతను పూజిస్తారు. నేపాల్‌, దక్షిణాది రాష్ట్రాల్లో నరకాసురునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటారు. 


7. దీపావళి అంటే పురాణ కథలు, భక్తి, పూజలు మాత్రమే కాదు.. బంధుమిత్రులు, స్నేహితులతో సరదాగా గడిపే సమయం. అందరూ స్వీట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. చిన్నా పెద్దా అంతా కలసి బాణాసంచా వెలిగించి ఆనందిస్తారు. ఇంటిని శుభ్రం చేసేందుకు, అలంకరించేందుకు ప్రత్యక సమయం కేటాయిస్తారు. 


8. రంగోలి.. దీపావళికి ప్రత్యేక సంప్రదాయం. రంగురంగుల ముగ్గులు, పూలు, రంగు రంగుల దీపాలు, అన్ని రంగులతో నిండిన అలంకరణ సామగ్రితో ఇల్లంతా నింపేస్తారు. దేవతలకు ఇదో ప్రత్యేక ఆహ్వానం అని భావిస్తారు. ప్రవేశ ద్వారాన్ని కన్నులపండువగా ముస్తాబుచేస్తారు.  


9. ఒక్కో పండుగ ఒక్కో ప్రాంతంలో ఫేమస్..కానీ దీపావళి దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇతర దేశాల్లో నివశించే హిందువులు కూడా ఈ వేడుకను అస్సలు మిస్సవరు. ఓ వైపు భక్తి మరోవైపు ఆనందంతో నిండి ఉంటుంది దీపావళి. 


10. యూకేలో లీసెస్టర్ నగరంలో దీపావళి వేడుకలు కన్నులపండువగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిపోతాయి. ఈ ప్రదర్శనలు చూసేందుకు వచ్చే పర్యాటకులతో నిండిపోతుంది నగరం.


Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!