Diwali 2024 Shani Dosha Nivaran Deepam : జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగిపోయేందుకు ఉపవాసాలు, పూజలు,  అభిషేకాలు చేస్తుంటారు. కానీ ఇవన్నీ ఉపశమనం మాత్రమే కానీ పూర్తిగా ఏ దోషమూ తొలగిపోదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఏ గ్రహం శుభ - అశుభ స్థానాల్లో ఉంటే పెద్దగా పరిగణలోకి తీసుకోరు కానీ శనికి భయపడని వారుండరు. శనిబాధల నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజు అభిషేకాలు చేస్తారు, నవగ్రహ ఆలయాలను సందర్శిస్తుంటారు. జపాలు, హోమాలు ఇలా ఎన్నో అనుసరిస్తారు. అయితే వీటన్నింటికన్నా ఉపశమనం దీపావళి రోజు వెలిగించే నువ్వుల దీపం. ఈ దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి - ఏ సమయంలో వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శని ప్రబావం ఎలా ఉంటుందో తెలుసుకోండి... 


Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!


ఏల్నాటి శని  


ఏల్నాటి శని ఎంట్రీ ఇచ్చిందంటే ఏడున్నరేళ్లు భరించాల్సిందే. ఈ ఏడున్నరేళ్లలో అనారోగ్యం, దంపతుల మధ్య మనస్పర్థలు, కుటుంబంలో వివాదాలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, తొందరపాటు మాటలు, ఉద్యోగంలో పని ఒత్తిడి, ఏం చేసినా నష్టం తప్పదు.  


అర్ధాష్టమ శని


అర్ధాష్టమ శని అంటే నాలుగేళ్లుంటుంది.. ఈ సమయంలో మతిమరుపు, వాహన ప్రమాదం, పని ఒత్తిడి, లేనిపోని చికాకులు ఉంటాయి.


అష్టమ శని


అష్టమ శని కూడా నాలుగేళ్లు తప్పదు.. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వెంటాడేస్తాయ్. చికాకులు, వివాదాలు, కష్టాలు తప్పవు


Also Read: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!


శని ప్రభావం ఈ రేంజ్ లో ఉంటుంది
 
హిరణ్యకశిపుడు లాంటి మహా బలశాలి శనిదోషం ఉన్న సమయంలోనే హతమయ్యాడు. త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసానికి వెళ్లడానికి కారణం శనిదోషమే. నలమహారాజు శనిప్రభావంతో రాజ్యానికి భార్యకు దూరంగా ఏడేళ్లపాటూ వంటవాడిగా జీవించాడు. పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి కూడా కారణం శనిప్రభావమే. ఈశ్వరుడు కూడా శనికి భయపడి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. అంటే శనికి అందరూ సమానమే.


శని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కానీ ఆ దోష నివారణ కోసం కొన్ని రెమిడీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి దీపావళి రోజు వెలిగించే నువ్వుల దీపం.. 


దీపావళి రోజు ఉదయాన్నే తలకు స్నానం ఆచరించిన తర్వాత..దేవుడి మందిరం దగ్గర కూర్చుని మూడు గుప్పెడల నల్ల నువ్వులు తెల్లటి వస్త్రంలో వేసి ముడివేయండి. ముడి  చివర ఎలా ఉండాలంటే దీపం వెలిగించే ఒత్తిలా ఉండాలి. ఆ చిన్న మూటను నువ్వులనూనెలో నానబెట్టి పక్కనపెట్టేయండి. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజ అనంతరం దీపాలు వెలిగించే ముందుగా ఈ నువ్వుల దీపాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లి వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి. ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించి స్వీట్ తీసుకుని...ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేయండి. ఈ దీపాన్ని బాణసంచా కాల్చడం పూర్తై లోపలకు వెళ్లేముందు కూడా వెలిగించవచ్చు. ఇంటి ప్రహరి బయట, అపార్ట్ మెంట్ వాసులైతే అపార్ట్ మెంట్ బయట వెలిగించండి.. ఇంటి ద్వారం దగ్గర, ఆవరణలో నల్ల నువ్వుల దీపం వెలిగించవద్దు. వెలిగించే దీపం పూర్తిగా మాడి మసైపోవాలి.. అందుకే అందులో కర్పూరం ఏదైనా వేస్తే బాగా వెలుగుతుంది. తద్వారా శనిప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు.


Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!