Ahoi Ashtami 2024: ఆశ్వయుజ మాసం అమావాస్య దీపావళి... ఈ రోజుకి ఏడు రోజుల ముందు అష్టమి వస్తుంది. ఏటా ఆశ్వయుజమాసంలో కృష్ణ పక్షానికి ముందు వచ్చే అష్టమిని అహోయి అష్టమి అంటారు. ఈ ఏడాది అహోయి అష్టమి అక్టోబరు 24 గురువారం వచ్చింది.


ఈ రోజు ఉపవాసం ఆచరించి, సూర్యాస్తమయం తర్వాత పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమిస్తారు. పిల్లల శ్రేయస్సు, ఆయువు, ఆరోగ్యం కోసం వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అహోయి మాత  అంటే గౌరీ స్వరూపం అని చెబుతారు. పూజ చేసేవారు గోడపై అమ్మవారి రూపాన్ని గీస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన చిత్రాలు కూడా విక్రయిస్తారు. ఆ ఫొటోల్లో అమ్మవారు, చిన్నారులు, సింహం బొమ్మలుంటాయి. సింహం బొమ్మ ఉండడం వెనుక ఓ కథ పురాణాల్లో ఉంది..


Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!


అహోయి అష్టమి కథ


అహోయి అష్టమి ఉపవాసం, వ్రతం  శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఒకప్పుడు  ఓ వ్యాపారి ఉండేవాడు. తనకి ఏడుగురు కొడుకులు. దీపావళికి ఇంటి అలంకరణ, ప్రమిదలు , ఇతర సామగ్రి తయారీ కోసం మట్టి తెచ్చేందుకు వెళ్లింది ఆయన భార్య. అడవిలో మట్టిని తవ్వుతుండగా పొరపాటున తను మట్టిని తవ్వుతున్న పారతో సింహపు పిల్లను చంపేసింది. ఆ ఆందోళనతో ఇంటికి చేరుకుందామే. ఏడాదిలో వారి పిల్లలు ఏడుగురు చనిపోతారు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేని దంపతులు తీర్థయాత్రలకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు. అప్పుడు వారికి మార్గమధ్యలో ఎదురైన ఓ వృద్ధ మహిళ సూచించిన వ్రతమే అహోయి అష్టమి.  చిన్నారి సింహాన్ని చంపినందుకు ఆ పాపం నీ బిడ్డలకు తగిలిందని వారు కష్టాల నుంచి బయటపడి మళ్లీ నిన్ను చేరుకోవాలంటే ఈ వ్రతం ఆచరించమని చెప్పిందామె. అహోయి దేవిని జీవుల సంతానానికి రక్షకురాలిగా భావిస్తారు. పిల్లలు తిరిగొస్తారన్న మాట వినగానే ఆ తల్లి అహోయి అష్టమి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించింది. కష్టాలు తొలగిపోవాలంటూ అష్టమి రోజు ఈ వ్రతం ఆచరించగానే తన సంతానం తిరిగి ఇంటికొచ్చారు. అప్పటి నుంచి పిల్లల క్షేమంకోసం ప్రతి తల్లీ అహోయి అష్టమి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభమైంది


Also Read: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!


అహోయి అష్టమి వ్రత విధానం


కర్వాచౌత్, కార్తీకసోమవారం ఉపవాసాల్లానే ఉంటుంది అహోయి అష్టమి ఉపవాసం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ రోజంతా ఉపవాసం ఉంటారు. కనీసం నీళ్లు కూడా ముట్టుకోకుండా నిర్జల ఉపవాసం ఆచరిస్తారు. సాయంత్రం నక్షత్రాలను దర్శించుకున్న తర్వాత అమ్మవారి పూజ ఆచరించి వ్రతాన్ని విరమిస్తారు. పూజ అనంతరం వ్రత కథను చదువుకోవాలి. 
 
అహోయి అష్టమి వ్రతాన్ని ఆచరిస్తే  పిల్లలపై చెడు దృష్టి, ప్రతికూలత, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజు ఇనుము వస్తువులు వినియోగించకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి తినకపోవడమే కాదు ఇంట్లో ఇతరుల కోసం చేసే వంటలో వినియోగించకూడదు. ఉపవాసం విరమించిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం సమర్పించాలి. పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలి. 


కేవలం పిల్లల ఆరోగ్యం, ఆయుష్షు కోసం మాత్రమే కాదు.. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలుంటాయంటారు.


Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!