అక్టోబరు 23 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏదైనా ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. క్రీడలతో సంబంధం ఉన్నవారికి ప్రాముఖ్యత లభిస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లవచ్చు. శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండండి
వృషభ రాశి
ఈ రోజు మనసులో సంతృప్తి ఉంటుంది. స్నేహితుల సలహాలను స్వీకరించగలరు. ఆర్థిక లాభాలకు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు జ్ఞానం, వ్యాపారంలో పాత అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు. పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. అనుకోని ప్రయాణం చేయవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మీకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాల తీవ్రత పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు చాలా మంచిది. మీ కెరీర్లో మరో మలుపు రాబోతోంది. ఆత్మావలోకనం, చర్చకు రోజు గొప్పది. మీరు జ్ఞానోదయ వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.
Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!
కార్కాటక రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో కోపంగా ఉండవచ్చు. ఎవరికీ సలహా ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. అనవసరమైన మానసిక ఒత్తిడికి లోనుకావద్దు. గొంతు ఇన్ఫెక్షన్ సమస్య ఉండవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించండి. యోగా, ప్రాణాయామం తప్పకుండా చేయండి.
సింహ రాశి
కెరీర్‌కు సంబంధించి ప్రయత్నాలు కొనసాగిస్తారు. నూతన పనిని ప్రారంభిస్తున్నట్లయితే పూర్తి సన్నాహాలు చేయండి. మీ దినచర్య బిజీగా ఉంటుంది. షేర్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ పిల్లల విజయాల గురించి మీరు గర్వపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. పాత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. పూర్వీకుల వివాదాలు తలెత్తవచ్చు.
కన్యా రాశి
ఈ రోజు వ్యాపారంలో డబ్బు లావాదేవీలకు సంబంధించి వివాదం రావచ్చు. మతపరమైన , ఆధ్యాత్మిక చింతనలు ప్రభావితమవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆఫీసులో బాస్ మీకు పెద్ద పని అప్పగించవచ్చు. యువతకు శుభవార్త అందుతుంది.
తులా రాశి
ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. ఆలోచించకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. వివాహ సంబంధాల మధ్య వృత్తిపరమైన ఒత్తిడి రానివ్వవద్దు. కళారంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ఆశించిన గౌరవం లభించదు. కార్యాలయంలో పని పెరుగుతుంది. పెద్దల అభిప్రాయం తీసుకున్నాకే నూతన వ్యవహారాలు చేపట్టండి. మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండవచ్చు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు కొత్త పనిలో ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. దాంపత్య సంబంధాలలో సంతోషం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో ఉండే అడ్డంకులు పరిష్కారమవుతాయి. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. బాధ్యతల నిర్వహణ విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. నూతన పనిపట్ల ఆసక్తి కనబరుస్తారు. అనుకోని ఆర్థికలాభం పొందుతారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. నూతన వాహనం కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. కార్యాలయంలో గత అనుభవాలను పాఠాలుగా మలుచుకుంటారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు విజయం సాధిస్తారు.
Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
మీన రాశి
ఎవరితోనైనా ఉండే విభేదాలు పరిష్కారమవుతాయి. మీ ఆరోగ్యం కారణంగా ఒత్తిడికి లోనవుతారు. పని చేయాలని అనిపించదు. మీ ప్రణాళికలను బహిరంగపరచవద్దు. శత్రువు మీకు వ్యతిరేకంగా చురుకుగా మారవచ్చు. ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పెద్ద ఖర్చులు ఆకస్మికంగా తలెత్తవచ్చు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.