Diwali Lakshmi Puja Process: దీపావళి రోజు లక్ష్మీ పూజ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత దీపాలు పెట్టే సమయంలో ఆచరిస్తారు. దీనికోసం శుభఘడియలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పూజ నిర్వహించేవారు కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు పండితులు.


@ పూజకు ఉపక్రమించేముందు పరిశుభ్రత చాలా అవసరం. పరిశుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే శ్రీ మహాలక్ష్మి పూజ చేసేముందు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాలు, పూలు కట్టాలి, ఇంటిముందు అందమైన ముగ్గు వేయాలి. 


@ బంగారం , వెండి లేదా లోహంతో చేసిన పాదముద్రలను దీపావళి రోజు అమ్మవారి ఆరాధనలో ఉంచాలి. బంగారం, వెండితో చేసిన పాదముద్రలు పూజలో పెట్టలేకుంటే కాగితంపై మెట్ల గుర్తును వేసి పూజించాలి


@ లక్ష్మీపూజలో శంఖం తప్పనిసరిగా పెడతారు. శంఖం లేకుండా లక్ష్మీపూజ చేయడం అసంపూర్ణం అని భావిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవితో పాటూ దక్షిణాభిముఖ శంఖాన్ని పూజించడం వల్ల ఆనందం, ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతారు


@దీపావళి రోజు పూజలో శ్రీయంత్రాన్ని ఉంచుతారు.లక్ష్మీదేవితో పాటూ శ్రీ యంత్రాన్ని పూజిస్తే అప్పుల బాధలు తీరిపోయి సిరిసంపదలకు లోటుండదని చెబుతారు


@ దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మికి తియ్యటి పదార్థాలు నివేదిస్తారు. నివేదన అనంతరం స్వీట్స్ అందరకీ పంచితే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. 


@ పసుపు , కుంకుమ శుభానికి - సౌభాగ్యానికి చిహ్నం. అందుకే ఈ రోజు పూజలో అమ్మవారిని పసుపు, కుంకుమతో ఆరాధించాలి 


@ ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా గణేషుడిని ఆరాధిస్తారు. దీపావళి రోజు తమలపాకుపై స్వస్తిక్ గుర్తు వేస పూజలో ఉంచుతారు. 


@ దీపావళి రోజు లక్ష్మీపూజలో ఏనుగు బొమ్మలు , చెరుకుగడలు ఉంచుతారు.
 
@ దీపావళి రోజు చాలామంది పూజలో కొత్తిమీర గింజలు పెడతారు. దీపావళి రోజు పూజలో కొత్తిమీర గింజలు ఉంచి వాటిని పూజలో పెడతారు.. ఇలా చేస్తే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు 


@ ఈ రోజు అవకాశం ఉంటే తామర పూలతో లక్ష్మీ ఆరాధన చేయడం అత్యంత శుభప్రదం. తామర పూలతో లక్ష్మీపూజ చేస్తే ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తుందని విశ్వసిస్తారు.   


Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!


లక్ష్మీ -కుబేర పూజ మంత్రం
ఓం శ్రీం శ్రియై నమః


ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః


కుబేర ప్రార్థనా మంత్రం
దండాయ నమస్తుభ్యము నిధిపద్మధిపాయ చ
త్వత్ప్రసాసేన్ ధంధన్యాదిసంపదః..


మహాలక్ష్మి మంత్రం


ఓంశ్రీహ్రీంశ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్
ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయై నమః.


శ్రీ లక్ష్మీ బీజ మంత్ర ఓం
హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః


అర్ఘ్య మంత్రం


క్షీరోదరనవసంభూతే సురసురనామస్క్రిత్.
సర్వదేవమయే మాతర్ గృహానాగగరఘ్య నమో నమః.


Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!


అభ్యర్థన మంత్రం


సురభి త్వం జగన్మత్తర్దేవీ విష్ణుపాదే స్తి.
సర్వదేవమయే గ్రాసమ్ మాయా దత్తమిం గ్రాస్..


ప్రార్థన మంత్రం


సర్వమయే దేవి సర్వదేవైర్లద్కృతి.
మరమ్మభిలాషితం సఫలం కురు నందిని


Also Read: కార్తీకమాసం మొదటి రోజు గోవర్ధన పూజ .. దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది!