అక్టోబరు 29 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఓ శుభవార్త వింటారు. మీ ఖర్చులు తగ్గుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
వృషభ రాశి
ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు. మీలో ఉండే లోపాలు సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. ఇంటి విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోకండి. షేర్ మార్కెట్‌లో పెద్దగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పాత విషయాలపై వివాదాలు పెట్టుకోకండి.
మిథున రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీరు మాట్లాడే స్వభావం విమర్శలు ఎదుర్కొంటుంది. కొన్ని కారణాల వల్ల మనసు కలత చెందుతుంది. చేపట్టిన పనులు ఆగిపోతాయి. మీ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి.
Also Read: దీపావళికి ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు!
కర్కాటక రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. ఉద్యోగం, వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. పిల్లల విజయాల పట్ల గర్వపడతారు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. అధికారులు మీ పనిని ప్రశంసించవచ్చు
సింహ రాశి
ఈ రోజు శత్రువులు హాని కలిగించవచ్చు. మీకు పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. అతిథులు ఇంటికి వస్తారు. అనుకున్న పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
కన్యా రాశి
ఈ రోజు కొత్త భాగస్వామ్య వ్యాపారం ప్రారంభిస్తారు. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి రావచ్చు. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
తులా రాశి
ఈ రోజు ప్రత్యర్థులు మీపై పుకార్లు వ్యాప్తి చేస్తారు. కుటుంబంలో క్రమశిక్షణ రాహిత్యం ఉంటుంది. విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. గత అనుభవాల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. కొన్ని పనులలో లాభం ఉంటుంది.
వృశ్చిక రాశి
మీ సన్నిహిత వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించాలి. మీరు ఇంట్లో పెద్దల నుంచి మద్దతు పొందుతారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పురోగమిస్తాయి. నూతన మూలల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు చాలా మంచిది. కొన్ని తీవ్రమైన విషయాలను సన్నిహితులతో చర్చిస్తారు. మీరు ప్రయాణానికి సంబంధించి ఆలోచనలు చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మకర రాశి
రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు . ఈరోజు ఎవరికీ సలహా ఇవ్వకండి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. పాత పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీరు ప్రయాణంలో చాలా ఆసక్తిని కనబరుస్తారు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
కుంభ రాశి
వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కోపం , అత్సుత్సాహం కారణంగా పని ప్రభావితం అవుతుంది. కార్యాలయంలో మీ హక్కులు పరిమితం కావచ్చు. ఖర్చులను నియంత్రించండి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీన రాశి
ఆర్థిక అంశాలు ప్రభావితం కావచ్చు. ఆఫీసు పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. మిత్రులను కలుసుకున్న తర్వాత మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు రోజు చాలా మంచిది. పని ప్రదేశంలో వాతావరణం సహకరిస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: దీపావళికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా - దీపాలు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి!