Chaitra Purnima Hanuman Jayanti 2024 Date: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!

Hanuman Jayanti 2024: హనుమాన్ విజయోత్సవాన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నారు. ఎందుకలా? హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతికి విజయోత్సవానికి ఉన్న వ్యత్యాసం ఏంటి?

Continues below advertisement

Chaitra Purnima Hanuman Jayanti 2024: ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే హడావుడి జరుగుతుంది. మరికొందరు వైశాఖ మాసంలో కదా హనుమాన్ జయంతి అని ప్రశ్నిస్తారు. ఇంతకీ ఆంజనేయుడి  జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా ? దీనికి క్లారిటీ కావాలంటే..హనుమాన్ విజయోత్సవం - హనుమాన్ జయంతి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియాలి...

Continues below advertisement

Also Read: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా!

 హనుమాన్ విజయోత్సవం - 2024 ఏప్రిల్ 23 మంగళవారం
 హనుమాన్ జయంతి - 2204 జూన్ 01 శనివారం

శ్లోకం
వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || 
ఈ శ్లోకం  ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. 

వైశాఖ మాసంలోనే హనుమాన్ జయంతి!

అంజనాకేసరుల కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారం కోసం రామ కార్య నిర్వాహణకు ఉదయించాడు.  పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది..శివుని అష్టముర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అవతరించాడు. హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత ప్రకారం..హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం ,  మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నం... కౌండిన్యస గోత్రములో జన్మించాడు అని ఉంది. అందుకే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలి

Also Read: సమ్మర్ హాలీడేస్ లో మీ పిల్లలకు ఇవి తప్పనిసరిగా నేర్పించండి!

చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం! 

వైశాఖంలో వచ్చేది హనుమాన్ జయంతి అయితే...మరి చైత్ర మాస పౌర్ణమి రోజును కూడా హనుమాన్ జయంతి అని ఎందుకంటారు అనే సందేహం రావొచ్చు. దానికి కారణం ఏంటంటే... హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడను వెతకడం, వారధి నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ...ఇలా రాముడు అయోధ్యకు చేరుకునేవరకూ అడుగడుగునా శ్రీరాముడి విజయం వెనుక భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అందుకే..అయోధ్యకు చేరుకుని పట్టాభిషేక ఘట్టం ముగిసినతర్వాత రాముడు ఇలా అనుకున్నాడట "  హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది, నేను తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను,  ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం , ఆనందం అన్నీ హనుమంతుడి వల్లనే సాధ్యమయ్యాయి" అని... ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు అప్పటి నుంచి శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు.

Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయ్ - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా!

యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్

అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నానని అర్థం.

Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!

Continues below advertisement
Sponsored Links by Taboola