Narmada Pushkaralu 2024 : ప్రతి నదికి పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి.బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటూ నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. పుష్కర సమంలో నదీ స్నానం, దానం, పిండ ప్రధానం ముఖ్యమైనవి. అయితే ఈ 12 రోజులు ఏ రోజు ఏ దానం చేయాలంటే...
పుష్కర సమయంలో చేయవలసిన దానాలు గురించి పురాణాల్లో ఇలా ఉంది...
మొదటి రోజు
బంగారం, వెండి, ధాన్యం , భూధానం చేస్తే..ఈ లోకలం సమస్త భోగాలు అనుభవించి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు
రెండో రోజు
వస్త్ర దానం, ఉప్పు దానం, రత్న దానం చేస్తే...ఈ లోకంలో సంతోషంగా జీవితాన్ని గడిపి..మరు జన్మలో సార్వభౌముడు అవుతారు
Also Read: ఇవాల్టి నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!
మూడో రోజు
బెల్లం, ఫలాలు దానం ఇస్తే.. సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు
నాలుగో రోజు
నెయ్యి , నూనె, పాలు, తేనె దానం చేసినవారు... అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, దీర్ఘాయుష్షు పొందుతారు
ఐదో రోజు
ధాన్యం, గోదానం, హలం దానం ఇచ్చినవారు..ఇహలోకంలో భోగాలు అనుభవించి దేహం విడిచిన తర్వాత శివుడి సన్నిధికి చేరుతారు
ఆరో రోజు
ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేస్తే ఆరోగ్యవంతులవుతారు
Also Read: చిన్న చిన్న లాభాల కోసం మీ బంధాన్ని రిస్క్ లో పెట్టొద్దు - రాశి ఫలాలు 1 మే 2024 !
ఏడో రోజు
గృహదానం, పీట దానం, శయ్య దానం చేసినవారు...ఈ జన్మ మరుజన్మలో విలాసవంతమైన జీవితం పొందుతారు
ఎనిమిదో రోజు
చందన దానం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేసిన వారు సకల ఐశ్వర్యాలు పొందుతారు
తొమ్మిదో రోజు
పిండ ప్రదానం, కంబళి దానం చేస్తే...పుణ్యలోకాలు పొందుతారు
పదో రోజు
కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు దానం చేస్తే...ఆరోగ్యం, ఆయుష్షు
పదకొండో రోజు
గజ దానం చేస్తే మరణానంతరం వైకుంఠంలో అడుగుపెడతారు
Also Read: శివుడిని నేరుగా దర్శించుకోకూడదా!
పన్నెండో రోజు
పుష్కరాల్లో ఆఖరి రోజు నువ్వులు దానం ఇస్తే సకల సమస్యల నుంచి విముక్తి పొందుతారు....
బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరాలు
- బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది - ( 2023)
- బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నది - ( 2024)
- బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నది- ( 2025)
- బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది - ( 2026)
- బృహస్పతి సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నది - ( 2027)
- బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నది - ( 2028)
- బృహస్పతి తులా రాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నది - ( 2029)
- బృహస్పతి వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమా నది - ( 2030)
- బృహస్పతి ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు తపతి/బ్రహ్మపుత్రా నది - ( 2031)
- బృహస్పతి మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రా నది - ( 2032)
- బృహస్పతి కుంభ రాశిలో ప్రవేశించినప్పుడు సింధు నది - ( 2033)
- బృహస్పతి మీన రాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నది - ( 2034)
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి . మధ్యప్రదేశ్ లో నర్మదా నది తీరంలో కొలువయ్యాడు ఓంకారేశ్వరుడు. ఇక్కడున్న అమ్మవారిని అన్నపూర్ణదేవిగా కొలుస్తారు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం , అమలేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడ అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం , భోజ్‌పూర్ శివాలయం చాలా పురాతనమైనవి.