Guppedantha Manasu Serial Today: కాలేజీ బోర్డ్ మెంబర్స్ సమావేశం అవుతారు. మహేంద్రని టార్గెట్ చేసి మీ వల్ల కాలేజీ పరువు పోయిందని అంటారు. అందరూ అలా అనటంతో మహేంద్ర కాలేజీ నుండి తప్పుకుంటాను అని చెప్తాడు. మహేంద్ర ఇంట్లో వసుధార , అనుపమ కలిసి మహేంద్ర తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉంటారు.
వసుధార: ఏది ఏమైనా మీ డెసిషన్ చెప్పకుండా ఉండాల్సింది మావయ్య.
మహేంద్ర: అయినా అలా చెప్పినందుకు నేనేమీ బాధపడట్లేదు, పశ్చాత్తాపం పడట్లేదు. నేను మాట్లాడిన దానిలో నాకే తప్పు కనిపించలేదు.
అనుపమ: తప్పు అని కాదు మావయ్య. అది మీ కాలేజ్. మీ నాన్నగారు మీకు అప్పచెపిన కాలేజ్. దాంతో మీకు ఎంతో బాండింగ్ ఉంటుంది. కాలేజ్ విషయంలో మీ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కాదు అనుకోని కాలేజీ వదిలేయడం నాకు ఇష్టం లేదు మావయ్య.
మహేంద్ర: చూడమ్మా నాకు బాధ్యత ఉండొచ్చు. కాదనటం లేదు కానీ నన్ను మించి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వాళ్లు చాలామంది ఉన్నారు. నా తర్వాత, అన్నయ్య తర్వాత మన ఋషి కాలేజీనీ చాలా సక్రమంగా చూసుకుంటారు. ఆ తర్వాత జగతి ఆ తర్వాత నువ్వు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాలేజీని నడిపిస్తున్నప్పుడు నాకు కాలేజీ విషయంలో ఎటువంటి బెంగ లేదు. ప్రస్తుతానికి ఉన్న బెంగ ఒక్కటే...
అనుపమ: ఎందుకు మహేంద్ర మా విషయంలో ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు. మా గురించి ఆలోచిస్తూ నువ్వు కాలేజీ వదిలేయడమేంటి..
మహేంద్ర : నేను మీ విషయంలో ఎమోషనల్ గా ఆలోచిస్తున్నాను సరే. మరి నువ్వు ఎందుకు మా విషయంలో ఎమోషనల్ గా ఉన్నావు. జగతి చనిపోయిందని తెలియగానే నువ్వెందుకు ఎమోషనల్ అయ్యావు. రిషి కనిపించట్లేదు అని తెలియగానే నువ్వు ఎందుకు కంగారు పడ్డావు.
అనుపమ: అదేం ప్రశ్న మహేంద్ర. జగతి నాకు బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కి ఏదైనా జరిగితే ఎమోషనల్ అవుతారు కదా. అలాగే జగతి కొడుకు అంటే నాకు కూడా కొడుకుతో సమానం. అందుకే రిషి విషయంలో నేను అంత ఫీల్ అయ్యాను.
మహేంద్ర : నీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నువ్వు అంతగా రియాక్ట్ అయినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నేను కూడా అలాగే ఉంటాను కదా. నువ్వు మాకు ఎంత సహాయం చేసావు అనుపమ. నాకు జగతికి దగ్గర ఉండి పెళ్లి చేశావు. పెద్దలని ఎదిరించి మా ఇద్దరినీ ఒక్కటి చేశావు. మా జీవితానికి ఒక అర్థం ఇచ్చావు. నువ్వు నేను జగతి వేరు కాదు. మన ముగ్గురం ఒక్కటే. అలాంటిది నీకు సమస్య వస్తే నేను సైలెంట్ గా ఎలా ఉంటాను.
అనుపమ: నా సమస్య వేరు నీకు వచ్చిన సమస్యలు వేరు.
మహేంద్ర: సమస్య ఏదైనా సమస్యే అనుపమ.
అనుపమ: సరే మహేంద్ర జరిగినదేదో జరిగిపోయింది అంతా మరిచిపోయి నువ్వు కాలేజీకి వెళ్ళు. నువ్వు మా గురించి ఆలోచించే నువ్వు ఇదంతా చేస్తున్నావు. కానీ ఇకనుండి వదిలేసేయ్ మా బాధలో మేము పడతాము.
మహేంద్ర: అది ఎలా చేస్తాను అనుపమ వదిలే ప్రసక్తే లేదు.
అనుపమ: అయితే ఏం చేస్తావు మహేంద్ర. అసలు నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావు.
మహేంద్ర: పరిష్కారం చేయాలి అనుకుంటున్నాను
అనుపమ: దేనికి
మహేంద్ర: ఇప్పుడు మీరు పడుతున్న బాధలకి మీ ముందు ఉన్న సమస్యలకి
అనుపమ: అది పరిష్కారం లేని సమస్య.
మహేంద్ర: అది నీ భ్రమ. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలానే నీ సమస్య కూడా ఉంది
వసుధార: ఏంటి మావయ్య ఏ విధంగా దీనిని పరిష్కరించాలి అనుకుంటున్నా రు.
మహేంద్ర: మనోని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను.
మహేంద్ర నిర్ణయానికి వసు, అనుపమ షాక్ అవుతారు. అసలు ఒప్పుకోను అంటుంది అనుపమ. ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే దేవయాని అనుపమకి ఫోన్ చేసి మహేంద్ర గురించి తెగ డైలాగులు చెబుతుంది. జగతి పోయిన తర్వాత నువ్వు వచ్చి మా ఇంట్లో తిష్ట వేసి కూర్చున్నావు అంటుంది. అసలు నువ్వు, నీ కొడుకు వల్లే మహేంద్ర అందరి ముందు మను కు తండ్రి నేనే అని చెప్పాడు. ఇప్పుడు నీవల్ల మా పరువు మొత్తం పోయింది. నువ్వు నీ కొడుకు మాయ చేయడం వల్ల మా లైఫ్ అంత సర్వనాశనం అయిపోయింది అని చెబుతున్నప్పుడు..సడన్గా మహేంద్ర వచ్చి ఫోన్ తీసుకుంటాడు. మీరు అంతగా ఫీల్ అవ్వద్దు... కాసేపట్లో మీ ఇంటికి వచ్చి మీకొక ఇన్విటేషన్ ఇస్తాను అని కూడా చెప్తాడు... మహేంద్ర దేని గురించి చెబుతున్నాడో దేవయానికి అర్థం కాదు. మహేంద్ర చేయబోయే ఫంక్షన్ ఏదన్నది తెలియక శైలేంద్ర కూడా కంగారు పడతాడు. బాబాయ్ కొత్త కాలేజీ పెడతాడేమో అంటాడు శైలేంద్ర.