Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌ ముకుందకు జాగ్రత్తలు చెప్పడంతో రేవతి మనసులో వీడేంటి ముకుంద మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా.. అది ఒకందుకు మంచిదే ముకుందకు ఎవరూ లేరు వీడికి ఓ తోడు దొరుకుతుంది అని అనుకుంటుంది. ఇక ముకుంద ఆదర్శ్‌కి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. ముకుంద వెనకాలే రజిని వెళ్లుంది.


రజని: ముకుంద. వరసలు బాగానే కలుపుతున్నావ్. అలాగే వెనక గోతులు బాగానే తవ్వుతావ్.
ముకుంద: ఇప్పుడు నేను ఏం చేశాను పిన్నిగారు.
రజని: ఏం చేయకుండానే ఆదర్శ్‌ నీ కోసం అంత పరితపించిపోతాడా.. కాసేపు కనిపించకపోయే సరికి ముకుంద ఏది ముకుంద ఏది అని నానా హడావుడి చేసేశాడు.
ముకుంద: పిన్నిగారు అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకొని టెన్షన్ పడుతున్నారు. ఆదర్శ్‌కి సంగీతకి పెళ్లి చేసే బాధ్యత నాదే అని చెప్పాను కదా. అసలు వాళ్లిద్దరి పెళ్లి చేయడం మీ కంటే నాకే ఎక్కువ అవసరం. 
రజని: నీకు అవసరమా.. ఎందుకు.. 
ముకుంద: ఎందుకు అంటే ఆ పెళ్లి అయిపోతే మీరు నన్ను అనుమానించడం మానేస్తారు కదా అందుకే. 
రజని: ఏంటో ఈ ముకుందని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడంలేదు. అసలు నా కూతురు ఎక్కడ..


సంగీత మంచి లంగావోణి వేసుకోగా మధు మంచి ఫొటోలు తీసి నీలో హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని అంటాడు. ఇంతలో రజిని ఫోన్‌కు అడ్డుగా వస్తుంది. తన కూతురికి ఫొటోలు తీయొద్దని అంటుంది. ఇంతలో కృష్ణ వచ్చి మధు తీస్తే తప్పు ఏంటి అని అడుగుతుంది. తప్పులు వెతకొద్దని చెప్తుంది. కృష్ణ మాటలకు సంగీత ఫిదా అయిపోతుంది. 


సంగీత: చూశావా అక్క కృష్ణ ఎంత మంచిదో మరి నువ్వు ఎందుకు కృష్ణ అక్కతో మాట్లాడొద్దు అంటావ్.  
రజిని: నోరు మూసుకోవే..
కృష్ణ: పిన్ని సంగీతని నాతో మాట్లాడొద్దని చెప్పారా.. సంగీతని నాతో మాట్లాడొద్దు అని చెప్పినా నువ్వు నాతో మాట్లాడకపోయినా నేను నీతో మాట్లాడుతూనే ఉంటా పిన్ని. ఎందుకు అంటే ఈ ఇంట్లో అందరూ నన్ను అపార్థం చేసుకున్నవాళ్లే తర్వాత నా మంచితనం తెలిసి నాతో కలిసిపోయారు. నువ్వు అంటే ఎప్పుడో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటావ్. అయినా సంగీత చాలా మంచిది పిన్ని. చేతిలో సెల్‌ఫోన్ ఉన్నా పట్టించుకోదు. నువ్వు గీసిన గీత దాటదు. ఇలాంటి ఆడపిల్లలు ఈరోజుల్లో ఎంత మంది ఉన్నారు దానికి సంతోషించు. 


మరోవైపు శ్రీరామనవమి కోసం భవాని ఇంట్లో అందరికీ కొత్త బట్టలు ఇస్తుంది. దూరం నుంచి చూస్తున్న ముకుందని కూడా పిలిచి బట్టలు ఇస్తుంది. అందర్ని వేకువనే లేవమని చెప్తుంది. అందర్ని ఉపవాసం ఉండమని పూజ తర్వాత పానకం తాగాకే ఉపవాస విరమణ చేయాలని చెప్తుంది. 


ముకుంద: ఈ పానకంతోనే నీ కడుపులో బిడ్డ పుట్టకుండా చేస్తానే.. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్‌లెట్ కృష్ణకి ఎలా ఇవ్వాలా అనుకున్నాను. పానకం గ్లాస్‌లో ఆ ట్యాబ్‌లెట్‌ వేసి ఇచ్చేస్తా.. ఇక ముకుంద రేవతితో పాటు తాను పానకం చేస్తానని అంటుంది. భవాని సరే అంటుంది.
కృష్ణ: అందరికీ అన్ని చెప్తున్నారు మరి నేను ఏం చేయాలి అత్తయ్య.
మధు: ఏం చేయాలో నేను చెప్తాను ఒకసారి అటు చూడు..( త్వరగా బిడ్డని కని ఇస్తామని కృష్ణ, మురారిలు భవానికి మాట ఇస్తున్నట్లు మధు తీసిన ఫొటోని ఫ్రేమ్ కట్టించి గొడకు తగిలిస్తాడు.) 
మురారి: పొద్దున్నే ఫొటో తీశావ్ కదరా అప్పుడే ఫ్రేమ్ కట్టించేశావా..
ముకుంద: (మనసులో.. పిచ్చోళ్లు కృష్ణకు పిల్లులు పుడతారు అని కలలు కంటున్నారు. రేపటితో ఆ కల చెదిరిపోతుందని తెలీదు.) ఇప్పుడు అర్థమైంది కదా అన్నింటి కంటే పెద్ద బాధ్యత నీకు అప్పగించారు కాబట్టి ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోమని నీకు పని ఇచ్చారు. అంతే కదా మేడమ్.. 
భవాని: సరే సరే వెళ్లి అందరూ పడుకోండి.
మధు: మురారి, కృష్ణలతో బ్రో నాకు తెలిసి పెద్దపెద్దమ్మ ఎవర్ని ఎప్పుడు ఏం అడగలేదు. అందరికి కావల్సినవి ఇవ్వడం తప్ప. ఆవిడ అడిగిన ఈ ఒక్కటి మాత్రం మీరు నెరవేర్చాలి ప్లీజ్.


ఆదర్శ్‌: ముకుంద ఎక్కడుంది కనిపించడం లేదు. బయటకు ఎక్కడికైనా వెళ్లిందా.. 
ముకుంద: బయట నుంచి వస్తూ.. వైదేహి ఇచ్చిన ఈ ఒక్క ట్యాబ్లెట్ కృష్ణకి ఇస్తే చాలు. ఇక ఎప్పటికి తాను తల్లి కాలేదు. మళ్లీ నేనే ఈ ఇంటికి కోడలు అవుతాను. 
ఆదర్శ్‌: ముకుంద ఎక్కడికి వెళ్లావ్..
ముకుంద: ఈయన ఇక్కడ ఉన్నప్పుడు నేను వచ్చానా.. లేక నా కోసం ఎదురు చూస్తున్నాడా.. ఇక శారీ బ్లౌజ్ కుట్టించడానికి వెళ్లానని చెప్తుంది.
ఆదర్శ్‌: సారీ ముకుంద ఇకపై ఇలా జరగదు. ఇకపై అన్నీ నీకు ముందే వస్తాయ్. ముకుంద ఒక్క నిమిషం.
ముకుంద: మనసులో.. మళ్లీ ఏమొచ్చిందో.. 
ఆదర్శ్‌: బ్లౌజ్ కుట్టించడానికి ఇచ్చావ్ కదా మరి శారీ ఏది.
ముకుంద: ఈయనకు అన్నీ కావాలి. ఏదైనా చెప్తే విని ఊరుకోవచ్చు కదా. అది పొద్దున్నే డెలివరీ బాయ్ ఇస్తాడు.


ఉదయం కృష్ణ ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది. ఆదర్శ్‌ వస్తాడు. కృష్ణ నవ్వినా ఆదర్శ్‌ ఏమీ అనడు. పొద్దుపొద్దున్నే ఈవిడ ముఖం చూడాల్సి వచ్చింది ఏం జరుగుతుందో ఏమో అని అంటాడు. అది విని షాక్ అయిన కృష్ణ ఏమన్నావ్ ఆదర్శ్ అని అడుగుతుంది. ఇంతలో మురారి వచ్చి జాగింగ్‌కు వెళ్లడం లేదా అని అడుగుతాడు. 


ఆదర్శ్‌: వెళ్దామనే వచ్చా కానీ వెళ్తే ఏమవుతుందా అని ఆగిపోయా. ఏమైనా జరగొచ్చు కదా బయటకు వెళ్లేటప్పుడు వారం వర్జ్యం చూసుకొని వెళ్లాలి కదా..
కృష్ణ: తను నాగురించే అంటున్నాడు. పొద్దుపొద్దున్నే నన్ను చూశాడంట. నన్ను చూసి బయటకు వెళ్తే ఏదో జరుగుతుంది అంట. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను ఏసీపీ సార్. ఉంటే ఇద్దరి మీద ఉండాలి కానీ నా ఒక్కదాని మీద కోపం ఎందుకు. ఇంత వరకు చూపులతో కోపం చూపించే వాడు. ఇప్పుడు మాటల వరకు వచ్చింది. ఇక నుంచి ముసుగు వేసుకొని తిరుగుతా.. ఎవరికి ఏ ప్రమాదం జరగదు. పోనీ ఇంట్లో నుంచి వెళ్లిపోనా.
మురారి: ఏం మాట్లాడుతున్నావ్. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావ్. 
కృష్ణ: తన నా ముఖం మీదే అన్నాడు ఏసీపీ సార్.. నా మాట మీద నమ్మకం లేదా.. ఊరికే చెప్తున్నా అనుకుంటున్నారా..
మురారి: నాకు ఏం అర్థం కావడం లేదు. నీ మీద వాడికి ఎందుకు కోపం. ఉంటే ముకుంద మీద ఉండాలి కదా. ఉండు ఇప్పుడే తేల్చేస్తా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అయ్యో శోభ ఎంత మాట అన్నావ్.. సౌర్య తండ్రి నువ్వా? అతనా? నర్శింహను ప్రశ్నించిన రెండో పెళ్లాం!