Trinayani Today April 18th Episode: తిలోత్తమ వల్లభలు విశాలాక్షి మెడలో తాళి దొంగతనం  చేయడానికి వస్తారు. ఇక సుమన కూడా చాకు పట్టుకొని దొంగతనానికి వస్తుంది. ఆ తాళి తీసుకొంటే నాది అయిపోతుంది అనుకుంటుంది. అదంతా గమనిస్తున్న గాయత్రీ పాప శబ్ధం చేస్తుంది. దాంతో సుమన దాక్కుంటుంది. ఇక హాసిని వచ్చి చూసి గాలికి ప్లవర్ వాష్ పడిందనుకొని వెళ్లిపోతుంది. 


సుమన వెళ్లగానే తిలోత్తమ విశాలాక్షి దగ్గరకు వెళ్లి కత్తెరతో మంగళ సూత్రం దొంగతనం చేసేస్తుంది. దాన్ని ముడి వేసుకొని తిలోత్తమ తన మెడలో వేసుకుంటుంది. 


సుమన: అయ్యో అమ్మవారి మంగళ సూత్రాలు అత్తయ్య మెడలో వేసుకున్నారు ఏంటి.
వల్లభ: మా అమ్మకి మంగళ సూత్రం మార్చడం అలవాటేలే.. 


ఇంతలో కరెంట్ వెళ్లిపోతుంది. సుమన, వల్లభ తిలోత్తమను ఎంత పిలిచినా తిలోత్తమ పలకదు. ఇక విశాలాక్షి లేచి తిలోత్తమ దగ్గరకు వెళ్తుంది. విశాలాక్షి ముఖం మొత్తం భగ భగ మంటలు వచ్చి కోపంగా చూస్తుంది. ఇక కరెంట్ వచ్చేసరికి తిలోత్తమ ముఖం చేతులు నల్లగా మాడిపోయి ఉంటాయి. దీంతో అందరూ హాల్‌లోకి వచ్చి ఏమైందని అడుగుతారు. ఎందుకు ఇలా రంగు మారిపోయావని తిలోత్తమను ప్రశ్నిస్తారు.


నయని: వజ్రాల మంగళ సూత్రాలు అత్తయ్య మెడలో ఉన్నాయి ఏంటి. 
పావనా: ఇంత గోలగా ఉన్న ప్రశాతంగా పడుకుంది ఏంటి సోదరి.
విశాలాక్షి: ఏమైంది..
హాసిని: నీ తాళి తీసుకుంది దొంగ అత్తయ్య. ఇందాకే చూడా విశాలాక్షి మెడలో తాళి ఉండేది. ఇంతలోనే తీసేశారా.. 
తిలోత్తమ: నేను ఎందుకు ఇలా అయిపోయాను. నాకు ఏమైంది.
విశాల్: ఒకరి వస్తువు దొంగలించినందుకు శాస్తి జరిగింది అనుకుంటానమ్మ.
తిలోత్తమ: ఇది మీ అమ్మ చేయించిన తాళి కదా నేను మీ అమ్మకి సవతిని కదా అందుకే ఈ తాళిని..
నయని: అది మీరు అనుకుంటే సరిపోదు అమ్మగారు కూడా అనుకోవాలి.
తిలోత్తమ: అది సరే నయని నేను ఇలాగే ఉండాలా. నన్ను నేను చూసుకోవడానికే ఇబ్బందిగా ఉంది ఏం చేస్తే మామూలుగా మారుతానో చెప్పండి. 
 విశాల్: విశాలాక్షి మెడలో నుంచి తీశావ్ కాబట్టి తనకు క్షమాపణ చెప్పాలమ్మా.
విశాలాక్షి: క్షమాపణ అడిగితే లాభం లేదు చెంప దెబ్బ ఒక్కటైనా తినాలి. నేను కొట్టను ఏది ఎవరిదో వారే హక్కులు కలిగి ఉంటారు. కాబట్టి వారి చేతనే శిక్ష అమలు చేయాలి. గాయత్రీని ఎత్తుకొని తన చేత ఒక చెంప దెబ్బ కొట్టిస్తే తిలోత్తమ శరీరం తిరిగి మామూలు మనిషి అవుతుంది.
తిలోత్తమ: ఈ పిల్ల నన్ను కొడుతుందా..


హాసిని: మనసులో.. చంపేస్తుంది కూడా త్వరలో..


విశాలాక్షి గాయత్రీని ఎత్తుకొని తిలోత్తమకు చెంప దెబ్బ కొడుతుంది. ఇక వల్లభను మీ అమ్మను తీసుకెళ్లి ముఖం శుభ్రం చేయమని అంటుంది. 


మరోవైపు తిలోత్తమ, వల్లభ అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. జరిగింది అఖండ స్వామికి చెప్తారు. 
అఖండ: అమ్మవారకి అర్పించిన మాంగల్యాన్ని తిరిగి మానవ మాత్రులు ఎవ్వరూ వేసుకోరాదు అని తెలీదా తిలోత్తమ.
తిలోత్తమ: తెలుసుకానీ అంత ఖరీదు అయినది నా మెడలో వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నా.
వల్లభ: బొగ్గులా అయింది మమ్మీ. కానీ నా డౌట్ ఏంటి అంటే అమ్మవారి తాళి ఆ విశాలాక్షి కూడా వేసుకుంది కదా. మరి తనకు ఎందుకు ఏం కాలేదు. 
అఖండ: విశాలాక్షి వేసుకుంది కాబట్టి. మాయ అర్థం కాదు అంత త్వరగా.. 
తిలోత్తమ: ఆ పిల్ల నాకు మహాంకాళిలా కనిపించి భయపెట్టింది స్వామి. స్వామి రేపు నయనిని తడి బట్టలతో వెళ్లమని విశాలాక్షి చెప్పింది. మీరు ఒక చిన్న సాయం చేస్తారా.. నీళ్లలో కూడా మంట ఆరకుండా ఉండేది ఏదైనా ఉంటే నాకు ఇస్తారా.
వల్లభ: మా మమ్మీ చాలా దూరం ఆలోచిస్తుంది స్వామి తర్వాత చెప్తుంది.
అఖండ: వల్లభ చేతిలో ఓ బాటిలో పెట్టి ఆ ద్రవం నీళ్లలో కూడా మండుతుంది అని చెప్తాడు. మరోవైపు విశాలాక్షి హసినికి ఉసిరి దీపాలు సిద్ధి చేయమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్