Karthika Deepam Idi Nava Vasantham Today Episode సౌర్య ఉన్న షాపింగ్ మాల్‌లోకే శోభ వస్తుంది. శోభ సౌర్యని చూసి నువ్వేనా ఆరోజు మా ఇంటికి వచ్చి పూలు కోసిన పిల్లవి నువ్వే కదా అంటుంది. దీంతో శౌర్య అమ్మో గుర్తుపట్టేసింది అని పరుగు పెడుతుంది. ఇక శోభ ఆగవే అని అంటుంది. దానికి నర్శింహ వచ్చి ఎవర్నే ఆగమంటున్నావ్ అని అడుగుతుంది.  


శోభ: నీ కూతుర్ని నిద్రలో తలచుకున్నా దాని ముఖం నాకు బాగా గుర్తొస్తుంది. అంత బాగా చూశా ఆ బుడ్డదాన్ని. అది ఇక్కడ ఉంది అంటే ఆ దీప కూడ ఇక్కడికి వచ్చినట్లే కదా. పిల్లని తీసుకొని షాపింగ్‌కు వచ్చింది అంటే ఊరు వెళ్లనట్లే కదా. నువ్వు తిడతావో తంతావో నాకు తెలీదు అది మాత్రం ఇక్కడ ఉండకూడదు.
నర్శింహ: మనసులో.. గుడి దగ్గర అంత గొడవ చేసినా అది పోలేదు అంటే దానికి ఎంత పొగరు. ఈసారి గట్టిగా ఇవ్వాలి.
శోభ: దాన్ని వెళ్లగొడతావా నేను ఇటు నుంచి ఇటే పుట్టింటికి వెళ్లిపోవాలా.
నర్శింహ: జుట్టు పట్టుకొని నీ ముందుకే తీసుకొస్తా. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడికి వెళ్లింది. 


కార్తీక్ జ్యోత్స్నతో మాట్లాడుతూ రౌడీ అని పిలుస్తాడు. సౌర్య కనిపించకపోయే సరికి తనని వెతుక్కుంటూ వెళ్లి నర్శింహకు ఎదురుపడతాడు. ఇక సౌర్య కూడా కార్తీక్ ఉన్న దగ్గరే శోభను తలచుకొని భయపడి దాక్కుంటుంది. కార్తీక్ నర్శింహను చూసి సౌర్య ఇతన్ని చూసి ఎందుకు దాక్కొంటుంది అని అనుకుంటాడు. సౌర్య కార్తీక్‌ని వచ్చేయ్‌మని పిలుస్తుంది. ఇంతలో జ్యోత్స్న కార్తీక్‌ని పిలవడంతో ఇప్పుడు ఏం మాట్లాడినా తెలిసిపోతుందని కార్తీక్ సౌర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక జ్యోత్స్న కార్తీక్ తల్లికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది. 


కాంచన: కోడలు అందరికి బట్టలు తీసుకుందామంటే వద్దు అన్నావంట ఏరా..
కార్తీక్: ఉగాదికి తీసుకున్నారు కదమ్మా ఇప్పుడు నేను తీసుకుంటానమ్మ.
శ్రీధర్: రేయ్ ఎవరు తీసుకున్నా ఒకటే కదరా.
కార్తీక్: మాస్తారూ నువ్వు అన్ని సగం తెలుసుకొని మాట్లాడుతావు.
శ్రీధర్: ఇదిగో కోడలిపిల్లా నువ్వు పుట్టగానే ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వలేదు. నీకు నా కొడుకును ఇచ్చాను. వాడిని జాగ్రత్తగా చూసుకొని వాడు నీ మాట వినేలా చేసుకోవాల్సింది నువ్వే.
జ్యోత్స్న: ఇకపై చూడండి మామయ్య నా దారిలో ఎలా పెడతానో.


శోభ: తల్లి రాకుండా పిల్ల ఒక్కదాన్నే పంపింది ఏంటి. దాన్ని తెచ్చినోడు ఎవడు. వాడు నీకు ముందే తెలుసా. వాడు ఎదురు పడగానే  అలా చూస్తూ నిలబడిపోయావ్ ఏంటి. నీ కూతురు నిన్ను చూసి కూడా దగ్గరకు రాలేదు ఏంటి. కొంపతీసి నీ కూతురికి నువ్వు ఎవరో తెలీదా. 
నర్శింహ: అది పుట్టిన తర్వాత నేను చూడలేదు. దీప చెప్పుండదు.
శోభ: ఆ దీప కానీ దాని కూతురు కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
నర్శింహ: కూతురు ఇక్కడ ఉంది అంటే దీప ఎక్కడుంది. 


దీప: అమ్మా జ్యోత్స్నకు ఇష్టమైన వంటలు ఏంటో చెప్పు అవే వండుతా..
సుమిత్ర: తనకు అన్నీ ఇష్టమే. నీకు నచ్చినవి వండు దీప.
దీప: నేను అన్నీ ఇష్టంగానే వండుతా..
దశరథ: పోనీ నువ్వు ఇష్టంగా తినేవి వండు..
దీప: నేను అన్నీ ఇష్టంగానే తింటాను. 
సుమిత్ర: విన్నారుగా అది దీప అంటే దాని మాటలు విని మీరు తట్టుకోవాలి అంటే మీకు గుండె ధైర్యం ఎక్కువ ఉండాలి.
దశరథ: అమ్మా దీప నువ్వు ఎంత వరకు చదువు కున్నావు.
దీప: 5 వరకు అండీ. మా నాన్నకి సాయంగా ఉండాలని మానేశాను. మా నాన్న నన్ను ప్రాణంగా చూసుకునే వాళ్లు. 
దశరథ: బాధ పడకమ్మా మనుషులు దూరం అయినా ప్రేమలు దూరం కావమ్మ. ఏదో ఒకరూపంలో మీనాన్న నీతోనే ఉంటాడు. మనకు కావాల్సిన వాళ్లు మనతో ఉండటం అదృష్టం. వాళ్లు మనతో లేకపోయిన మనకు ఇష్టమైన వాళ్లలో కనిపించడం ఆనందం. నీకు మేం అదృష్టం ఇవ్వలేం కానీ ఆనందాన్ని ఇవ్వగలం. ఈ సారి నీకు మీ నాన్న గుర్తొస్తే దగ్గరున్న వాళ్లని గుర్తు చేసుకో దూరం అయిన వాళ్లని కాదు. (అని తనని తండ్రి అనుకోమని చెప్పకనే చెప్తాడు.)


మరోవైపు జ్యోత్స్న, సౌర్యలకు కార్తీక్ ఐస్‌క్రీమ్ కొంటాడు. ఇక సౌర్య సరిగా ఐస్‌క్రీమ్ సరిగి తినకపోతే కార్తీక్ మూతి తుడుస్తాడు. అది అటుగా వెళ్తున్న శోభ చూసి భర్త బండి ఆపమని నీ పిల్లకు వాడు సేవలు చేస్తున్నాడు. అసలు ఆ బిడ్డ తండ్రి నువ్వా అతనా అని ప్రశ్నిస్తుంది. 
 
ఇక జ్యోత్స్న ఇంకో ఐస్‌క్రీమ్ కావాలా అని సౌర్యని అడుగుతుంది. దానికి సౌర్య నిన్ను ఏమని పిలవాలి అని అడుగుతుంది. అందుకు జ్యోత్స్న తన పేరు చెప్తే సౌర్య జ్యో అని మొదటి అక్షరం పలికి రెండో అక్షరం పలక లేకపోతుంది. దీంతో జ్యోత్స్న జ్యో అంటే చాలు అంటుంది.


జ్యోత్స్న: సౌర్య మీ నాన్న ఎక్కడ ఉంటాడు. 
సౌర్య: తెలీదు.. నేను ఎప్పుడు చూడలేదు.
జ్యోత్స్న: తెలీకపోవడం ఏంటి.
కార్తీక్: అవన్నీ మనకు ఎందుకు జ్యోత్స్న ఎవరి పర్సనల్స్ వాళ్లకు ఉంటాయి. వెళ్దాం పదండి. 
సౌర్య: కార్తీక్ నాకు ఒక కలర్ పెన్సిల్ బన్ కావాలి.
కార్తీక్: అవి ఎందుకు..
సౌర్య: సర్‌ఫ్రైజ్..


ఇక అనసూయ మల్లేశ్ ఇంట్లో సామానులు తోముతూ ఇది ఓ బతుకా అని అనుకుంటుంది. ఇక మల్లేశ్ కూరలో కారం లేదు చారులో ఉప్పు లేదు అని తిడతాడు. దానికి అనసూయ కూడా రివర్స్ అయి వెళ్లిపోతుంది. 


మరోవైపు సౌర్య బట్టల బ్యాగ్‌ తీసుకొని ఇంటికి వస్తుంది. కార్తీక్ కొన్న కొత్త డ్రస్ చూపిస్తుంది. కార్తీక్ కొన్నాడని చెప్తుంది. దానికి దీప ముందే చెప్పాను అయినా ఆ మనిషి వినలేదు అనుకొంటుంది. ఇక సౌర్య అమ్మని పక్కన కూర్చొపెట్టుకొని కార్తీక్ చాలా మంచొడు అని జరిగినవన్నీ చెప్తుంది. ఇక తండ్రి గురించి అడుగుతుంది. ఇక దీప సౌర్యని కార్తీక్‌కు దూరంగా ఉంచాలి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి తాళి మెడలో వేసుకొని మాడి మసైన తిలోత్తమ.. గాయత్రీదేవితో చెంప దెబ్బ!