TTD Break Darshans News | తిరుమల: విద్యార్థులకు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మే 01 నుంచి వీఐపీ బ్రేకు దర్శనాల్లో టీటీడీ మార్పు చేసింది. వేసవి సెలవుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.  

Continues below advertisement


శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం మే ఒకటో తేదీ నుంచి టీటీడీ పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. టెన్త్, ఇంటర్ విద్యార్థులతో పాటు స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని టీటీడీ భావించింది. ఇందులో భాగంగా మే 1 తేదీ నుంచి జూలై 15 వ తారీకు వరకు, స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ పరిమితం చేయనుంది. అదేవిధంగా మే 01 నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి అమలు చేయనున్నామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.