Weekly Horoscope For April 28th To May 4th

Continues below advertisement


మేష రాశి


ఈ వారం మీ ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు ఇవ్వవచ్చు. మోడలింగ్ కెరీర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఖరీదైన బ్రాండ్ల నుంచి ఆఫర్‌లను పొందే అవకాశం ఉంది. పాత అప్పులు తిరిగి చెల్లించడంలో సక్సెస్ అవుతారు. రుచికరమైన ఆహారాన్ని ఆనందిస్తారు. మీరు చేసే పనులకు ప్రశంసలు పొందుతారు. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేయండి. కాలేయానికి సంబంధించిన సమస్యలు వెల్లడవుతాయి. భారీ యంత్రాలకు సంబంధించిన పనిలో ఇబ్బంది ఉంటుంది. పాత ప్రతికూల విషయాలు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. కార్యాలయంలో చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా చూసుకోవాలి. మంగళవారం,  బుధవారం స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి.


వృషభ రాశి


ఈ  వారం మీకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి వేసుకునే ప్రణాళికల వల్ల లాభపడతారు.  జీవిత భాగస్వామిపట్ల ప్రేమ పెరుగుతుంది.  కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఆర్థిక స్థితిలో గణనీయమైన మెరుగుదల వచ్చే అవకాశం బలంగా ఉంది. ప్రభుత్వ పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. సంగీతం , ఆటలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత స్థానంలో ఉండేవారికి ఈ వారం మంచి ఫలితాలుంటాయి. ఇతరులపై మీ బలహీనతలను రుద్దొద్దు. తీవ్రమైన ఆలోచనల ప్రభావం మీపై పడనీయకండి. మీ ప్రణాళికలు ఇతరుల ముందు బయటపెట్టొద్దు. 


మిథున రాశి


ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. బంధువుల రాక మీలో ఆనందాన్ని నింపుతుంది. మీ దినచర్య చాలా క్రమబద్ధంగా ఉంటుంది. మీరు ప్రజలకు ప్రేరణగా ఉంటారు. కార్యాలయంలోని సీనియర్లు మీ పనిని ప్రశంసిస్తారు. మీరు ఈ వారం చేసిన కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు.  కొత్త సంస్థలను ప్రారంభించడానికి డబ్బు ఖర్చు చేస్తారు. దగ్గరివారితో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. గుండె రోగులు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల వివాహం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. మీ బాధ్యత నుంచి విధుల నుండి వెనక్కి తగ్గవద్దు. రోగనిరోధక శక్తి తగ్గుదల ఉండవచ్చు. పాత తప్పులను పునరావృతం చేయకుండా ఉండండి.


కర్కాటక రాశి


ఈ వారం మీకు కెరీర్ పరంగా చాలా బావుంటుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ ఆలోచనలకు మద్దతు పెరుగుతుంది. మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేయవచ్చు. వ్యాపార పర్యటనలను చాలా ఆనందిస్తారు. ఈ వారం మీరు అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటారు.  మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు. ఉద్యోగులతో సంబంధాలు తీపిగా ఉంటాయి. స్నేహితులు ,  సోదరుల నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. మీరు ఎక్కువ ఖర్చులపై ఒత్తిడిలో ఉండవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొంత ఒత్తిడి కలిగి ఉండవచ్చు. కొంతమంది దగ్గరి వ్యక్తులు మీపై అసూయపడతారు. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే పత్రాల విషయంలో జాగ్ర్తతపడాలి.


సింహ రాశి


ఈ వారం మీరు ఉన్నత విద్యలో మంచి పోరోగతి సాధిస్తారు. ప్రభుత్వానికి సంబంధించి చేపట్టిన పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకోసం డబ్బులు ఖర్చు చేస్తారు. విదేశాల్లో ఉన్న మీ ఆస్తుల నుంచి లాభపడతాపు. ఎనిమిదవ ఇంట్లో  శని, రాహువు కారణంగా మనసులో గందరగోళం ఉంటుంది. శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధాల గురించి భావోద్వేగంగా  ఉంటారు.  రచయితలు,  జర్నలిస్టులకు ఈ సమయం కష్టంగానే ఉంటుంది. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక లావాదేవీల్లో లోపాలకు అవకాశం ఇవ్వొద్దు.  


కన్యా రాశి


ఈ వారం మీరు చాలా కష్టపడతారు. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. పని ‍ఒత్తిడి ఉన్నప్పటికీ ఆహ్లాదకరమైన ఫలితాలు పొందడం వల్ల రిలీఫ్ గా అనిపిస్తుంది. మీరున్న రంగంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారు. ఇంటాబయటా మీ గౌరవం పెరుగుతుంది. పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ పరిచయాలు మీకు ఉపయోగపడేలా ఉంటాయి. మీ వ్యక్తిత్వం భావజాలంలో కొన్ని మార్పులు ఉండవచ్చు.  మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  చట్టపరమైన విషయాలలో విజయం మీదే అవుతుంది. ఆర్థిక విషయాలలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కొత్త సంస్థను ప్రారంభిస్తుంటే ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండకండి. కష్టమైన పరిస్థితులలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.