ఏప్రిల్ 19 శుక్రవారం తిథి వార నక్షత్రం


శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం
తిథి: ఏకాదశి శుక్రవారం రాత్రి 8.39 వరకు..తదుపరి ద్వాదశి
నక్షత్రం: మఖ ఉ.11.55 వరకు తదుపరి పుబ్బ
అమృతఘడియలు: ఉ.9.17 నుంచి 11.02 వరకు
వర్జ్యం: రా.8.45 నుంచి 10.31 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుంచి 9.05 వరకు మళ్లీ మధ్యాహ్నం 12.24 నుంచి 1.14 వరకు   


Also Read: సమ్మర్ హాలీడేస్ లో మీ పిల్లలకు ఇవి తప్పనిసరిగా నేర్పించండి!


ఏప్రిల్ 19 శుక్రవారం రాశిఫలాలు


మేష రాశి


ఈ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగులతో వాదోపవాదాలు జరుగుతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. పై అధికారుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయవద్దు. కుటుంబానికి సమయం కేటాయించండి. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  


వృషభ రాశి


వాహనం కొనుగోలు చేయాలనుకున్న ఈ రాశివారి కోర్కె నెరవేరుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొత్త మూలాల నుంచి  ఆర్థిక లాభం ఉండవచ్చు. మీ బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి జీవితంలో శుభవార్త అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. 


Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయ్ - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా!


 మిథున రాశి


మిథున రాశి దంపతుల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. కొన్ని పనులు నిలిపివేయడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.  కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. 


కర్కాటక రాశి


ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. వ్యాపారంలో హెచ్చు తగ్గులుంటాయి...ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.  పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  


సింహ రాశి


ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు కావచ్చు. లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త. లాటరీ, బెట్టింగ్ లకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు మీరు పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది.  సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది.


కన్యా రాశి


ఈ రోజు మంచి రోజు అవుతుంది. న్యాయపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆలోచించకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు.  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనిలో మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగండి. 


Also Read: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా!


తులా రాశి


ఈ రోజు మీరు మీ పనిని శ్రద్ధగా పూర్తి చేస్తారు. మీ జీవితంలో  ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులున్నాయి జాగ్రత్త. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి.  వ్యాపారంలో నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. మీ ఖర్చులను నియంత్రించుకోండి. తొందరపడి ఏదైనా వస్తువు కొనవద్దు..


వృశ్చిక రాశి


ఈ రాశి వ్యాపారుల పరిస్థితి బాగుంటుంది. తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ రోజు కొంత గందరగోళంలో గడిచిపోతుంది. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. శత్రువులపై నిఘా ఉంచండి. మీ ప్రణాళికలను బయటపెట్టొద్దు. వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. 


Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!


ధనుస్సు రాశి


ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విదేశాలకు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు పై చదువుల విషయంలో అనుకున్న ప్రయోజనాలు పొందుతారు. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి. ఉద్యోగంలో సవాళ్లు అధిగమించేందుకు సీనియర్ల సలహాలు తీసుకోండి.  


మకర రాశి 


ఈ రాశివారు ఈ రోజు కొత్త పనులేవీ ఈ రోజు ప్రారంభించవద్దు.  ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


కుంభ రాశి


ఈ రాశివారు శుభ కార్యాలలో పాల్గొంటారు. కోర్టు కేసులలో విజయం సాధించవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు..


Also Read: ఈ ఏడాది బంగారం, ఎర్ర చందనం, సరుకుల ధరలు ఏవి పెరుగుతాయి - ఏవి తగ్గుతాయో తెలుసా!


మీన రాశి


ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. వ్యాపారులు రిస్క్ తీసుకోవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ సమస్యలను మీ సన్నిహితులతో పంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది..సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.


గమనిక: ఓ రాశిలో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు...మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మారుతాయని గుర్తించాలి....