Shlokas For Children To Learn: అంతా ఇంగ్లీష్ మీడియం చదువులే..ఇప్పటి తరం పిల్లలకు తెలుగు చదవడం రాయడం అస్సలు రావడం లేదు. ఆ సమస్యను అధిగమించాలంటే సమ్మర్ హాలిడేస్ లో కొంత ప్రాక్టీస్ చేయించాలి. క్లాస్ బుక్ తీయమంటే మాట వినరు. అందుకే చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తే నోరు తిరుగుతుంది...మాటలో స్పష్టత పెరుగుతుంది..కొంత టైమ్ కుదురుగా కూర్చుంటారు.. కొత్త విషయాలు నేర్చుకోవడంపై శ్రద్ధ పెరుగుతుంది.  పైగా హాలిడేస్ లో రోజంతా ఖాళీగా ఉంచితే పిల్లలు టీవీలు, ఫోన్లకు అతుక్కుని ఉండిపోతారు. ఇప్పటికే చాలా మంది పిల్లలకు అదో వ్యసనంగా మారింది... వాళ్లలో మార్పు ఎలా తీసుకురావాలో అర్థంకాక తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు. అందుకే హాలిడేస్ కదా అని బద్ధకంగా వాళ్లని వదిలేయకుండా ఉదయాన్నే నిద్రలేపండి...స్నానం, టిఫిన్ తర్వాత ఈ శ్లోకాలు నేర్పించండి... లంచ్ తర్వాత కాసేపు నిద్రపుచ్చండి...సాయంత్రం వాతావరణంలో వేడి తగ్గిన తర్వాత దగ్గర్లో ఉన్న పార్కులోనో, చుట్టుపక్కల పిల్లలతోనో ఒళ్లు అలసేలా ఆడేలా ప్రోత్సహించండి... ఆడుకుని వచ్చిన తర్వాత కాసేపు టీవీ చూడనివ్వండి...డిన్నర్ తర్వాత నిద్రపుచ్చండి. పిల్లల్ని టీవీ, ఫోన్ల నుంచి దూరం పెట్టేందుకు ఇదో పరిష్కారం కావొచ్చు...


సమ్మర్లో మీ పిల్లలకు నేర్పించాల్సిన శ్లోకాలు ఇవే...


ఓం సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః


Also Read: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా!


వినాయకుడి శ్లోకం


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా ||


శ్రీ సరస్వతీ సూక్తమ్


ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ  ధీనా మవిత్ర్యవతు 


Also Read: ఈ రాశివారు ఈ రోజు మాజీ ప్రేమికులను కలిసే అవకాశం ఉంది - ఏప్రిల్ 18 రాశిఫలాలు!


సరస్వతి శ్లోకం


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి ||


హయగ్రీవ శ్లోకం


జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే.


గురు శ్లోకములు


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ||


మహామృత్యుంజయ మంత్రం


ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||


Also Read: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రామరాజ్యం కోరుకోవడం అత్యాశే కదా!


శ్రీరామ శ్లోకం


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే  
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే  


ఆపదామప హత్తారం దాతారం సర్వ సంపదః
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||


శ్రీ మహావిష్ణు శ్లోకం


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం ||


ఆంజనేయ శ్లోకం


మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ||


Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!


లక్ష్మీదేవి శ్లోకం


లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం |
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ||
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ||


నవగ్రహ శ్లోకం


ఆదిత్యాయ సోమాయ, మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
శ్రీ మాత్రే నమః