Daily Horoscope for April 18th 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశి ఫలితాలను చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.... ఈ రోజు ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఎవరికి  ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి....


మేష రాశి


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. పనిలో ప్రొఫెషనల్‌గా ఉండండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అనుకూలమైనది. విడిపోయిన కొన్ని బంధాలు మళ్లీ చేరువవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం వస్తుంది. ఖర్చులు తగ్గించండి. వ్యాయామం దృష్టి సారించడం మంచిది. 


వృషభ రాశి


ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. వృషభ రాశి వారు ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. సమావేశాల్లో మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పడం మంచిది. ఒత్తిడికి దూరంగా ఉండడం ముఖ్యం. ఆరోగ్యం బావుంటుంది. 


Also Read: మూఢం వచ్చేస్తోంది మూహుర్తాలు పెట్టేసుకోండి త్వరగా - అసలు మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో తెలుసా!


మిథున రాశి


ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. కుటుంబ సంబంధాలలో పగ ఉండొచ్చు కానీ మీరు దానిని సహనంతో అధిగమించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. 


కర్కాటక రాశి 


ఈ రోజు మీకు గందరగోళం ఉంటుంది. ఆఫీసు రాజకీయాల రూపంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కోపం, వాదనలకు దూరంగా ఉండాలి.  మీరు ఈరోజు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. ఆర్థిక సంబంధింత సమస్యలు ఎదురవుతాయి. 


సింహ రాశి
 
ఈ రోజు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీ ప్రేమ జీవితం చురుకుగా ఉంటుంది. అధికారిక సమావేశాలలో పాల్గొనేటప్పుడు విచక్షణను ఉపయోగించండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు.  వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 


Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!


కన్యా రాశి


ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రేమికులను మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి ఆశ నెరవేరుతుంది. ఆర్థికంగా మరో అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నం చేయండి.


తులా రాశి


ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కొన్ని ప్రేమ సంబంధాలు సానుకూల మలుపు తీసుకుంటాయి. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. 


Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!


వృశ్చిక రాశి


ఈ రోజు అనుకోని పని కారణంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ బంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న వివాదాలుంటాయి. ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీ స్నేహితుల్లో ఒకరు ఆర్థిక సహాయం కోసం అడగవచ్చు. మీడియాకు సంబంధించిన వ్యక్తులను కొత్త అవకాశాలు పలకరిస్తాయి. కుటుంబం నుంచి సరైన మద్దతు లభించని వ్యక్తులు వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావంపై దృష్టిసారించాలి.  స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. 


మకర రాశి


ఈ రోజు మకర రాశి వారు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. కొన్ని ప్రాజెక్టులకు అదనపు శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితం బావుంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు , గృహోపకరణాల కొనుగోలుకు ఈ రోజు మంచిది. ఖర్చు చేసేటప్పుడు బడ్జెట్‌కు కట్టుబడి ఉండాలి 


Also Read: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!


కుంభ రాశి


ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఆర్థిక సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ భావాలు, మంచి చెడులన్నింటినీ మీ భాగస్వామితో పంచుకోండి. కుటుంబంలో ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు. ఏదైనా పెద్ద వైద్య సమస్య జీవితాన్ని ప్రభావితం చేయదు. 


మీన రాశి


ఈ రోజు  మీరు ఒత్తిడి నుంచి బయటపడేందుకు మీ మనసుకి ప్రశాంతతని ఇచ్చే పని మాత్రమే చేయండి. కార్యాలయంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుు మంచి లాభాలనిస్తాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో నిర్ణయం తీసుకునేముందు మరోసారి ఆలోచించాలి. ఆహారంపై శ్రద్ధ అవసరం. 


Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!