Sri Rama Navami 2024:  మంథర మాటలు విన్న కైకేయి దశరథుడిని వరాలు కోరింది..తండ్రి మాట జవదాటని రాముడు..తల్లి కౌసల్యాదేవి అనుమతి తీసుకుని వనవాసానికి బయలుదేరాడు.. ఆ వెంటే సీతా, లక్ష్మణుడు సిద్ధమయ్యారు. అడవిలోకి దించివచ్చే బాధ్యత రథసారధి సుమంతుడికి అప్పగించాడు దశరథుడు. ఆ సమయంలో జరిగిన  భారీ చర్చ ఇది...


దశరథుడు...
రాముడు వెళ్లిపోవడం చూసి..స్పృహ కోల్పోతూ - పక్కనున్నవాళ్లు నీళ్లు చల్లితే కళ్లు తెరుస్తూ.. మళ్లీ స్పృహ కోల్పోతూ  అన్నట్టుంది పరిస్థితి. స్పృహలోకి వచ్చిన ప్రతీసారీ రాఘవా అడవికి వెళ్లొద్దు..నేను మోసపోయాను...కైకేయి మాటలు పట్టించుకోవద్దు..నేను స్వయంగా చెబుతున్నాను...ఇవాళే అయోధ్య సింహాసనం అధిష్టించు అన్నాడు. 


అహం రాఘవ కైకేయ్యా వర దానేన మోహితః ! 
అయోధ్యాయా స్త్వమ్ ఏవాఽద్య భవ రాజా నిగృహ్య మామ్ !! 


రామా! నేను ఈ ఆడదాని వరాలకు కట్టుబడిపోయాను.  ఈమె నన్ను మోసగించింది, రెండు వరాలు అడుగుతానని ఇంత ధర్మ వ్యతిరేకమైన  కోర్కెలు కోరింది. నేను ఎంత బ్రతిమాలాడినా వినలేదు.  నాకు వయసు పైబడింది. నేను ఎలాగూ యుద్ధం చేయలేను... నా మాట నిలబడాలి అంటే నువ్వు అడవికి వెళ్ళాలి నువ్వు దయచేసి అడవికి వెళ్ళొద్దు,  మా నాన్న చెబితే నేనెందుకు అడవికి వెళ్లాలి....పెద్దవాడిని నేనే కాబ్టటి రాజ్యం నాకివ్వాలి  భరతుడికి ఎలా ఇస్తారని నన్ను ఓడించి...బంధించు.  రాజ్యాన్ని పాలించు...నిన్ను చూస్తూ బతికేస్తాను... అంతేకానీ నువ్వు వెళ్లిపోతే నేను బతకలేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు...


వాస్తవానికి అడవులకు వెళ్లమని కైకేయి చెప్పింది దశరథుడు స్వయంగా చెప్పలేదు...
సింహాసనం స్వీకరించమని దశరథుడు స్వయంగా చెబుతున్నాడు..
కానీ రామచంద్రుడు అధికారం కోసం ధర్మాన్ని పక్కనపెట్టలేదు. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టేందుకు తలవంచాడు...


Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!


సుమంతుడు
ఇదంతా వింటున్న రథసారధి సుమంతుడు....కైక నుంచి ఏమైనా మార్పు వస్తుందేమో అని ఎదురుచూశాడు కానీ ఆమె కిమ్మనకుండా నిల్చుని ఉంది కానీ రామా వెళ్లొద్దు అనలేదు...అప్పటికీ తన పొరపాటును గ్రహించలేదు...


దశరథుడు
రాముడిని అడవికి వెళ్లమన్నాను కానీ అక్కడ కష్టాలు అనుభవించాలని ఆదేశించడం లేదు. రాజ్యంలో ఎలాంటి సుఖసౌఖ్యాలు అనుభవించాడో అరణ్యంలోనూ అలానే ఉండాలని కోరుకున్నాను...అందుకే అక్కడ సకల సౌకర్యాలు కల్పించమని ఆదేశించాడు...


కైకేయి
మహానగరంలో సంపదలు రాముడితో పంపించేసి ఖాళీ రాజ్యాన్ని నా కొడుక్కి ఇస్తావా పాలించేందుకు..ఇందుకు వీల్లేదు..నగరంలో పూచికపుల్ల కూడా తరలించేందుకు వీల్లేదు...


Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!


వశిష్ట మహర్షి ఆగ్రహంతో....


అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కుల పాంసని ! 
వంచయిత్వా చ రాజానం న ప్రమాణే అవతిష్ఠసే !!


రాజుని వంచనచేసి వరాలు కోరావు . అసలు సీతమ్మ అడవులకు వెళ్ళవలసిన పనిలేదు..నువ్వు ఆ విషయం అడగలేదు. సీతమ్మ వెళ్లాల్సిన అవసరం లేదు.  అరణ్యవాసానికి వెళ్లమని నారచీరలు కట్టుకోమని చెప్పే హక్కు నీకు లేదు.


ఆత్మా హి దారా సర్వేషాం దార సంగ్రహ వర్తినాం ! 
ఆత్మీయ మితి రామ స్య పాలయిష్యతి మేధినీం !! 


నీకంటే ధర్మం తెలిసిన వాడిని... నువ్వు కోరిన కోర్కె ప్రకారం రాముడు అరణ్యానికి వెళితే...అర్థాంగి అయిన సీతాదేవి సింహాసనం అధిష్టించేందుకు అర్హురాలు.  


Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!


రాముడు


నవ పంచ చ వర్షాణి వన వాసే విహృత్యతే ! 
పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాఽన్తే నరాధిప !! 


నేను వనవాసానికి వెళ్లే 14 సంవత్సరాలు మీకు నిద్రలో ఉన్నట్టు గడిచిపోతుంది నాన్నగారు.. ఇంకా మీరు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాలి, మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం తీసుకోవాలా? నాకొద్దు...పుత్ర ధర్మం అదేనా?  మిమ్మల్ని సత్యవంతుడిగానే లోకం గుర్తుంచుకోవాలి.   


కైకేయి


రుదన్ ఆర్తిః ప్రియం పుత్రం సత్య పాశేన సంయతః ! 
కైకేయ్యా జోద్యమాన స్తు మిథో రాజా తం అబ్రవీత్ !! 


ప్రసంగాన్ని సాగదీయకు..రాముడు అడవికి వెళ్లేందుకు మంగళ శాసనం చేయి చాలు. వెళదామని వచ్చినవాడిని వెళ్లమని చెప్పు చాలు.


కైకేయి మాటలకు మరింత దుఃఖంలో కూరుకుపోయిన దశరథుడు...నువ్వు ధర్మాన్ని నమ్మకుండా  నన్ను కారాగారంలో పెడితే నేను సంతోషించేవాన్ని నువ్వు ధర్మాన్ని నమ్మావు కాబట్టి నేను ఏడుస్తున్నాను. నాయనా నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది సంతోషంగా వెళ్ళిరా..సుఖంగా  వనవాసం పూర్తిచేయాలని దీవించాడు.. అయితే ఈ ఒక్క రోజు అంతఃపురంలో ఉండు ఈ ఒక్క రాత్రీ పగలూ నిన్ను చూసుకుని నేను కౌసల్యా మురిసిపోతాం అని ప్రాధేయపడ్డాడు.


Also Read: సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఇదే!


రాముడు
 నాన్నగారూ నేను ఒక్క రోజు ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు..పైగా నేను కైకమ్మకు మాటిచ్చాను త్వరగా వనవాసానికి వెళ్లిపోతాను అని...


వశిష్ట మహర్షి


 భరత శ్చ స శత్రుఘ్న శ్చీర వాసా వనే చరః !
వనే వసంతం కాకుత్స్థ మను వత్స్యతి పూర్వజం !! 


జరగబోయేది చెప్తున్నాను కైకా జాగ్రత్తగావిను.. నీ భర్త శరీరం వదులుతాడు - భరతుడు నీ మాటని ధిక్కరిస్తాడు..సింహాసనాన్ని తిరస్కరిస్తాడు. ఏ నారవస్త్రాలు సీతారాములకు కట్టబెట్టాలని చూశావో అవే వస్త్రాలు భరతుడు కూడా ధరిస్తాడు.  మేం కూడా సీతారాములను అనుసరిస్తాం... నిర్జనమైన ఈ అరణ్యంలో నీవు మాత్రమే ఉంటావ్. నువ్వు అడిగిన వరాలు ఎందుకూ పనికిరావు...నువ్వు ఏం ఆశించి కోరావో వాటి ఫలితం దక్కదు... ఇప్పటికైనా ఆలోచించు...రాముడికి రాజ్యం అప్పగించు...


Also Read: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!


అప్పటికీ కైకేయిలో ఎలాంటి మార్పులేదు..రామచంద్రుడు కూడా తన పట్టువీడలేదు...ఇచ్చిన మాట దశరథుడు వెనక్కు తీసుకోకూడదు కానీ....కోరిన కోర్కెను కైకేయి విరమించుకోవచ్చు ....కానీ...ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు....


 తల్లిదండ్రుల కన్నీళ్ల మధ్య, అయోధ్య ప్రజలకు వీడ్కోలు చెప్పి వనవాసానికి వెళ్లారు సీతారామలక్ష్మణులు...