సంయుక్తా మీనన్ (Samyuktha Menon)కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ఉంది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసిందని చెప్పవచ్చు. 'సంయుక్త ఉంటే సినిమా హిట్టే' అని దర్శక నిర్మాతల్లో ఓ నమ్మకం ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. విజయాలకు తోడు నటిగానూ ఆమె ప్రూవ్ చేసుకున్నారు. దాంతో ఆమెకు ముంబై మూవీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


హిందీ సినిమా చేయనున్న సంయుక్త!
Samyuktha: Bridging the Gap Between Tollywood Success and Bollywood Debut: ఇటీవల సంయుక్త హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ముంబై వెళ్లిన వీడియో, విజువల్స్ వైరల్ అయ్యాయి. మలయాళీ అమ్మాయి ముంబై ఎందుకు వెళుతుందని ఆరా తీయగా తెలిసిన కొత్త విషయం ఏమిటంటే... తెలుగులో సంయుక్త బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్, వాటిలో ఆవిడ నటన చూసి బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయట. స్క్రిప్ట్ నేరేషన్ కోసం సంయుక్త ముంబై వెళ్లారని తెలిసింది. త్వరలో ఈ అమ్మాయి హిందీ సినిమాకు సంతకం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?






రెండు పాన్ ఇండియా సినిమాలో...
Samyuktha Menon Upcoming Movies List: ప్రస్తుతం సంయుక్తా మీనన్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతున్న 'స్వయంభు' సినిమాలో ఆమె ఓ కథానాయిక. అది కాకుండా శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న 'నారి నారి నడుమ మురారి'లో కూడా ఆమె నటిస్తున్నారు. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!



తెలుగులో డబుల్ హ్యాట్రిక్ కొడతారా?
Samyuktha Journey Into Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'తో సంయుక్తా మీనన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో కనిపించారు. కథలో కీలకమైన పతాక సన్నివేశాల్లో 'అన్నా' అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను పిలిచే సందర్భంలో ఆమె నటనకు పేరు వచ్చింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా చేశారు. అదీ హిట్టే. ఆ తర్వాత ధనుష్ 'సార్'లో కథానాయికగా నటించారు సంయుక్త. ఆ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం అందుకున్నారు.


సాయి తేజ్ జోడీగా నటించిన 'విరూపాక్ష' ఆమె ప్రయాణంలో మైలురాయి అని చెప్పాలి. పతాక సన్నివేశాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న రోల్ చేశారామె. 'డెవిల్' కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఐదు హిట్స్ సంయుక్త ఖాతాలో ఉన్నాయి. నెక్స్ట్ మూవీ హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ వస్తుందని చెప్పవచ్చు.


Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే