మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం - ఈ డైలాగ్ మూవీ లవర్స్‌కు బాగా తెలుసు. థియేటర్లలో ప్రతి సినిమాకు ముందు ఓ ప్రకటన ప్లే చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది కనుక. ముఖేష్ యాడ్ వైరల్ కావడం, సినిమాల్లో పంచ్ డైలాగ్స్ వేయడం తెలిసిందే. పబ్లిక్ ప్లేసుల్లో మందు, దమ్ము కొట్టడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలోనూ సేమ్ రూల్ తీసుకు వచ్చింది. 


పబ్లిగ్గా బస్సులో దమ్ము కొట్టడం కుదరదు. కానీ ట్రైన్ జర్నీలో వాష్ రూమ్ (బాత్ రూమ్)కు వెళ్లి సిగరెట్ కాల్చి కంపు కంపు చేసి వచ్చే జనాలు ఉన్నారు. మరి, కొత్తగా వచ్చిన వందే భారత్ ట్రైన్ సంగతి ఏంటి? ఆ ట్రైన్‌లో దమ్ము కొడితే ఏమవుతుందో తెలుసా? పొగరాయుళ్లు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.


వందే భారత్ ట్రైన్ వాష్ రూముల్లో సెన్సార్ డిటెక్టర్లు
Does Vande Bharat Have Washroom?: అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వందే భారత్ ట్రైన్ రూపొందించారు. ప్రతి భోగీలో సీసీ కెమెరాలు ఉంటాయి. వాష్ రూమ్‌లలో సీసీ కెమెరాలు లేవు. సో, అక్కడ ఏం చేసినా ప్రూఫ్ ఉండదని సిగరెట్ కాల్చవచ్చని ఆలోచేస్తే పప్పులో కాలేసినట్టే. కెమెరాలు లేవు గానీ సెన్సార్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ వాష్ రూమ్‌లో నిప్పు వెలిగినా లేదంటే పొగ వచ్చినా ఆ సెన్సార్ డిటెక్టర్లు పసిగడతాయి. అలారమ్ మోగుతుంది. ట్రైన్‌లో సంబంధిత అధికారులకు సమాచారం వెళుతుంది.


అధికారులు వాష్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి తప్పించుకోవచ్చని అనుకుంటే దమ్ము కొట్టే బాబులు మరోసారి పప్పులో కాలేసినట్టే. అలారమ్ మోగిన సమయంలో వాష్ రూమ్ నుంచి ఎవరెవరు బయటకు వచ్చారనేది సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది గనుక సదరు పొగరాయుడ్ని వెంటనే పట్టుకుంటారు. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.


వందే భారత్ ట్రైన్ అన్ని స్టేషన్లలో ఆగదు. మేజర్ స్టేషన్లలో కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఆగుతుంది. ఆ సమయంలో స్టేషన్ బయటకు వెళ్లి దమ్ము కొట్టి మళ్లీ వచ్చి ట్రైన్ ఎక్కడం జరగని పని. ఒకవేళ నాలుక పీకుతుందని ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు. అందుకని, ఎనిమిది గంటలకు పైగా దమ్ము కొట్టకుండా ఉండలేమని డిసైడ్ అయ్యే పొగరాయుళ్లు వందే భారత్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోకుండా ఉండటం మంచిది. బుక్ చేసుకుని ట్రైన్‌లో దమ్ము కొడితే బుక్ అయిపోతారు మరి... తస్మాత్ జాగ్రత్త!


Also Readవిశాఖ నడిరోడ్డు మీద అర్ధరాత్రి అమ్మాయిల పడిగాపులు... ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అరాచకాలకు నరకం చూసిన ప్రయాణికులు



సిగరెట్ ప్యాకెట్స్ మీద దమ్ము కొట్టడం వల్ల వచ్చే అనర్థాలను తప్పనిసరిగా ప్రచురించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల్లో అవగాహన పెంచడం కోసం సినిమా హాళ్లలోనూ ప్రకటనలు ఇస్తోంది. పబ్లిక్ ప్లేసుల్లో దమ్ము కొట్టిన వారికి జరిమానాలు విధిస్తోంది. అయినా మందు బాబులు, పొగ రాయుళ్లు మాట వినడం లేదు. యథేచ్ఛగా మనసు కోరినప్పుడు మందు, దమ్ము కొట్టేస్తున్నారు. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మందు, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!