Navanayaka Phalithalu 2024 to 2025: నవనాయకుల ఫలాల్లో భాగంగా నవగ్రహాల్లో రాజు - కుజుడు, మంత్రి- శని, సైన్యాధి పతి - శని, సస్యాధిపతి - కుజుడు అని ఓ కథనంలో చెప్పుకున్నాం...మొత్తం 9 శాఖల్లో మిగిలిన 5 స్థానాలైన...ధాన్యాధిపతి , అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి , రసాధిపతి , నీర్సాధిపతిగా ఏ గ్రహాలున్నాయో..ఫలితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం...


Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజు కుజుడు - మంత్రి శని , మరికొందరు పెద్దనాయకులకు జైలు తప్పదు!


2024 to 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో  పంటలు, ఆహారం, సరుకుల ధరలకు సంబంధించిన 5 శాఖల్లో ఏఏ నవగ్రహాలున్నాయంటే...


ధాన్యాధిపతి - చంద్రుడు


ధాన్యాధిపతి చంద్రుడు అయినందున వర్షాలు బాగా కురుస్తాయి, దేశంలో ప్రజలు సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ధాన్యం, బియ్యం ధరలు పెరుగుతాయి. ప్రత్తికి మంచి ధర వస్తుంది..నూలు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. చంద్రుడు మనఃకారకుడు అయినందున యవ్వనంలో ఉన్న స్త్రీ-పురుషులు మానసిక ఆందోళనకు గురవుతారు. 


అర్ఘ్యాధిపతి - శని


శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శనికి కేటాయించిన శాఖలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే మంత్రి, సైన్యాధిపతి అయిన శనికి అర్ఘ్యాధిపతిగా మూడో శాఖ ఇది. అర్ఘ్యాధిపతి శని అయినందను ఓ దశలో ధరలు భారీగా పెరిగి ఆ తర్వాత తగ్గుతాయి. వ్యాపార రంగంలో ఒడిదొడుకులు ఉంటాయి. నూనె వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. బొగ్గు, రాయి ధరలు అధికంగా ఉంటాయి. దేశంలో అగ్నిప్రమాదాలు, ఆస్తినష్టాలు జరుగుతాయి. షేర్ మార్కెట్ బావుంటుంది


Also Read: చెప్పుడు మాటలు విని తర్వాత పశ్చాత్తాప పడితే ఏ లాభం - అయోధ్యకాండలో ఆసక్తికర విషయాలివే!


మేఘాధిపతి - శని


శనికి ఈ ఏడాది నాలుగో శాఖ మేఘాధిపతి. మేఘాధిపతి  శని అయినందున ఈశాన్య రుతుపవనాలు త్వరగా ప్రవేశించినా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేటవుతాయి. తుపాను, ప్రమాదాలు అధికంగా ఉంటాయి. జలాశయాలు నిండుకుండల్లా ఉంటాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతాయి. చాలా రహదారులు ధ్వంసం అవుతాయి...


రసాధిపతి - గురుడు


రసాధిపతి గురుడు అయినందున మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు, దేవతా పూజలు,యజ్ఞాలు, యాగాలు అధికంగా జరుగుతాయి. దేశంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాల నిర్మాణం జోరందుకుంటుంది. వివాదాస్పద కట్టడాలపై కొనసాగుతున్న వివాదాలు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. చెరుకు పంట బావుంటుంది...బెల్లం, పంచదార, చింతపండు ధరలు పెరుగుతాయి. పసుపు, మిరియాల పంటలకు భారీగా లాభాలు వస్తాయి


Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


నీరసాధిపతి - కుజుడు


ఈ ఏడాదికి రాజు అయిన కుజుడే...నీరసాధిపతి. ఫలితంగా చందనం, అగరు, కస్తూరి, పగడం, ఎరుపు రంగు వస్త్రాలకు గిరాకీ బావుంటుంది. దానిమ్మ లాంటి ఫలాల దిగుబడి బావుంటుంది. బంగారం, ఎర్రచందనం ధరలు భారీగా ఉంటాయి. ఎరుపు భూముల్లో పంటలు బాగా పండుతాయి.  కుటుంబాల్లో కలహాలుంటాయి. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి...


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.