కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్


ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi liquor Case) ఎమ్మెల్సీ కవితను (Mlc Kavitha) సీబీఐ కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచింది. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని.. ఆమె నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. దీంతో కోర్టు రూం నుంచి కవితను అధికారులు తీసుకెళ్తుండగా కవిత మాట్లాడారు. ఇంకా చదవండి




పులివెందుల ప్రజలకు షర్మిల ప్రశ్న


హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు.  ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు ..అధర్మం మరోవైపు ఉన్నాయని, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు,అధికారం మరోవైపు ఉన్నాయన్నారు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా.. హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.  పులివెందులలో ఆమె సునీతతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంకా చదవండి


మడకశిరలో ట్రయాంగిల్‌ ఫైట్‌- ఎన్డీఏ


 సత్యసాయి జిల్లాలో ఏకైక ఎస్సీ నియోజకవర్గం మడకశిర. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధానంగా ఇరు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని పెట్టడంతో లెక్కలు మారిపోయాయి. ఎన్డీఏ, వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు గట్టి పోటీ కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. ఇంకా చదవండి


నాడు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపారు - నేడు ఆత్మహత్య చేసుకున్నారు


మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. గత నెలలో తమ ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అంకన్నగూడేనికి చెందిన దంపతులు అనిల్ (26), దేవి (22).. గ్రామానికి సమీపంలోని అడవిలో శవాలై కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు. అనిల్ మృతదేహం చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో లభ్యమైంది. దేవి మృతదేహం కింద పడిపోయి, పుర్రె, ఎముకల చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో వారు ఆత్మహత్య చేసుకుని దాదాపు నెల రోజులు దాటి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా చదవండి


పోటీ పడి రేవంత్ రెడ్డిని బలపరుస్తున్న బీఆర్ఎస్


తెలంగాణ రాజకీయాలు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కన్నా ఎక్కువగా  రేవంత్ రెడ్డినే  విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.  ప్రభుత్వం ఉండదని హెచ్చరికలు పదే పదే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా తనపై కుట్ర జరుగుతోందని అంటన్నారు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్న  అభిప్రాయంతో విపక్షాలు మరింతగా దాడి చేస్తున్నాయి. నిజానికి ఈ రాజకీయాలను కాస్త తరచి చూస్తే.. రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అనిపిస్తుంది. ఆయనను  బీఆర్ఎస్, బీజేపీ కలసి సంయుక్తంగా బలపరుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓ సామెత చెప్పినట్లుగా విపక్షాలు రాళ్లు విసిరితే.. వాటిని పట్టకుని తన చుట్టూ దుర్బేద్యమైన రక్షణ కోటను రేవంత్ రెడ్డి కట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇంకా చదవండి