Sri Ram Navami 2024: వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో అత్యంత ఆసక్తికర అంశాలు ఇవే...


అయోధ్యకాండలో... అయోధ్య నుంచి బయలుదేరిన రాముడు శృంగభేరిపురంలో గుహుడిని కలుసుకున్నాడు, ఆ తర్వాత అరణ్యంలో అడుగుపెట్టాడు. ఎందరో మహర్షులను కలుసుకున్నాడు...చిత్రకూటంలో ప్రశాంతంగా ఉన్నాడు. అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్లాడు, దండకారణ్యంలో అడుగుపెట్టాడు. ఇలా అయోధ్యలోనే కాకుండా వనవాసం చేరుకునేవరకూ జరిగిన సంఘటనలన్నీ అయోధ్య కాండలో కనిపిస్తాయి.  


గచ్ఛతా మాతులకులం భరతేన తదాఽనఘః |
శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతిపురస్కృతః


అయోధ్య కాండలో మొదటి శ్లోకం ఇది...


భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు ప్రయాణం కావడంతో అయోధ్యకాండ ప్రారంభమవుతుంది. తనతో పాటూ శత్నుఘ్నుడిని కూడా రమ్మని పిలిచాడు భరతుడు. అటు మిథిలానగరంలో నలుగురి సోదరులకు వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివధనస్సుని రాముడు విరిచిన తర్వాత ఈ సందడి మొదలైంది. రాముడు-సీత, లక్ష్మణుడు-ఊర్మిళ, భరతుడు- మాండవి, శత్రుఘ్నుడు - శృతకీర్తి... అందరూ కలసి మిథిలానగరానికి వెళ్లిపోయారు. మేనల్లుడు భరతుడి వివాహం గురించి కూడా తెలియదు కేకయి మహారాజుకి. ఆ విషయం తెలియక అయోధ్యకు వచ్చిన మహారాజుకి..తన మేనల్లుడి పెళ్లి సంగతి తెలిసి మిథిలానగరానికి పయనమయ్యాడు. వివాహం తర్వాత రాముడు, లక్ష్మణుడు దశరథుడితో అయోధ్యకు వచ్చేస్తే...కేకయి మహారాజు భరత, శత్రుఘ్నులను తనింటికి తీసుకెళ్లాడు.. అయోధ్యకాండలో అసలు ఘట్టం మొదలయ్యేది ఇక్కడే...


Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


శ్రీరామ పట్టాభిషేకం సందడి


పెళ్లిచేసుకుని అయోధ్యలో అడుగుపెట్టిన రామచంద్రుడికి వెంటనే పట్టాభిషేకం చేసేయాలని నిర్ణయించుకున్నాడు దశరథుడు. మేనమామ ఇంటికి వెళ్లిన భరతుడు తిరిగి వచ్చేలోగా ఆ ఘట్టం పూర్తిచేయాలి అనుకున్నాడు ధశరథుడు. అంటే ఏదో అడ్డంకి రాబోతోందని ముందే గ్రహించాడు. ఆ తర్వాత రాముడు..లక్ష్మణుడి దగ్గరకు వెళ్లి మనిద్దరం కలసి పాలన చేద్దాం అని చెప్పాడు. రాత్రికి రాత్రి అయోధ్య వెలిగిపోయేలా ఏర్పాట్లు చేశాడు. ఇవన్నీ చూసిన మంధర కైకేయి దగ్గరకు వెళ్లింది...


Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజు కుజుడు - మంత్రి శని , మరికొందరు పెద్దనాయకులకు జైలు తప్పదు!


కైకేయి - మంధర


కౌసల్య పేరుకూడా పలకడం ఇష్టంలేని మంధర..రామ మాతా అని సంభోదించి దానాలు భారీగా చేస్తోందంటూ రామ పట్టాభిషేకం వార్త చెప్పింది. 
మంథర: కైకేయిని ఉద్దేశించి...నిద్రపోతున్నావా నీకు అసలు నిద్రెలా పడుతోంది..ఇప్పటివరకూ నీకున్న వైభవం అంతరించిపోతోబోతోంది గమనించావా 
కైకేయి: పనిగట్టుకుని నిద్రలేపాల్సిన అవసరం ఏంటి..ఏం జరిగింది
మంథర: రాముడికి పట్టాభిషేకం జరుగుతోంది...
కైకేయి: అంతులేని ఆనందంతో ముత్యాలహారం బహుమతిగా ఇవ్వబోతూ...నాకు రాముడు, భరతుడికి వ్యత్యాసం లేదు... ఇద్దరూ ఒక్కటే..రాముడికి తన తల్లిని ఎంత ప్రేమిస్తాడో నాపట్ల కూడా అంతే భక్తిభావం చూపిస్తాడంటూ రాముడి గొప్పతనం గురించి మంథరకి చెబుతుంది
మంథర: నీ కన్న బిడ్డ మేనమామ ఇంట్లో ఉండగా తనకి తెలియజేయకుండా దశరథుడు ఎందుకు నిర్ణయించాల్సి వచ్చింది... ఇది దశరథుడు - రాముడు- కౌశల్య పన్నిన కుట్ర..నువ్వు కనిపెట్టలేకపోయావు. అసలు వీళ్లు భరతుడుని బతకనిస్తారా...తనకి ప్రాణాపాయం తలపెట్టకుండా ఉంటారా?
కైకేయి: అప్పటివరకూ సానుకూలంగా ఉన్న కైకేయి ఆలోచన..భరతుడి ప్రాణహాని మాటవినేసరికి మారిపోయాయి...


Also Read: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!


ఆతర్వాత మందిరంలోకి వచ్చిన దశరథుడిని..వరాలు కోరింది కైకేయి... దశరథుడు ఎంత ప్రాధేయపడినా కైకేయి మనసు మారలేదు. ఆ తర్వాత రాముడిని రమ్మని కబురుపెట్టింది కైకేయి. తాను కోరిన వరాలగురించి చెప్పింది. ఆ మాటలు విన్న రామచంద్రుడు సరే అన్నాడు.  ఆ తర్వాత తల్లి కౌశల్య మందిరలోకి వెళ్లి...నీకు, సీతకు, లక్ష్ముణుడికి దుఃఖం కలిగించే వార్త ఇది అంటూ అరణ్యవాసం గురించి చెప్పాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన రథం కూడా ఎక్కలేదు..ఇది రాజుగారి రథం..ఇప్పుడు నేను అరణ్యవాసం చేయాలి కాబట్టి రాజుగారి రథం ఎలా ఎక్కుతాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు ఇంటికి చేరుకున్న భరతుడికి ఈ విషయం తెలిసి అన్నగారిని తిరిగి తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లి ఒప్పించడంలో విఫలమయ్యాడు.


కైకేయి కూడా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో రాముడిని బతిమలాడినా...తండ్రి మాట జవదాటేది లేదని చెప్పాడుయ  చివరకు రాముడి పాదుకలు తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి 14 ఏళ్లు పాలన సాగించాడు భరతుడు..... ఈ కింద ఉన్న లింక్ పాదుకా పట్టాబిషేకం కథనమే....


Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!