Digilocker App: ప్రస్తుతం టెక్నాలజీ కాలంలో కూడా చాలా మంది తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను దగ్గర ఉంచుకుంటారు. పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లెైసెన్స్, ఆర్సీ కార్డు వంటివి చాలా మంది వాలెట్‌లో చూస్తూనే ఉంటాం. ఇన్ని డాక్యుమెంట్లను క్యారీ చేయడం కాస్త ఇబ్బంది కూడా. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిలాకర్ యాప్ మీ దగ్గరుంటే ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఎప్పుడు అవసరం అయితే అక్కడ వాటిని మీరు అందరికీ చూపించవచ్చు. అంతే కాకుండా ఈ యాప్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ యాప్ ఎలా ఉపయోగించాలి? ఇది సేఫ్ యేనా? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.



యాప్ సురక్షితమేనా?
సాధారణంగా ఇలాంటి పత్రాలను మన వ్యాలెట్‌లో పెట్టుకున్నప్పుడు పర్స్ పోతే అవన్నీ పోతాయి. వాటికి తిరిగి అప్లై చేసి మళ్లీ సంపాదించడం అంటే తల ప్రాణం తోకకు వచ్చినట్లే. అంతే కాకుండా పత్రాలు ఎక్కువసేపు జేబులో ఉంచడం వల్ల చిరిగిపోవచ్చు లేదా పసుపు రంగులోకి మారవచ్చు. వీటన్నిటికీ ఒక్క డిజిలాకర్ యాప్‌తో చెక్ పెట్టవచ్చు. ఇది ప్రభుత్వ యాప్. కాబట్టి ఇది పూర్తిగా సురక్షితమైనది. అంటే మీ పత్రాలను ఎవరూ యాక్సెస్ చేయలేరన్న మాట.


అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో మీరు అప్‌లోడ్ చేసిన పత్రాలను ఎక్కడైనా చూపించవచ్చు. అవి పూర్తిగా చెల్లుబాటు అవుతాయి కూడా. అంటే మీ జేబులో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు డిజిలాకర్‌లో ఉన్న లైసెన్స్‌ను ట్రాఫిక్ పోలీసులకు చూపించవచ్చు. దీన్ని నిరాకరించే హక్కు ఏ పోలీసులకు ఉండదు. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే మీరు అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు


వేటిని సేవ్ చేయవచ్చు?
ఈ యాప్‌లో మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 10వ తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, పెన్షన్ సర్టిఫికేట్, వెహికల్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను సేవ్ చేయవచ్చు. మీరు ఈ యాప్ నుంచి ఈ పత్రాలన్నింటినీ యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్‌లో డాక్యుమెంట్‌ల ఫోల్డర్‌ని క్రియేట్ చేయండి. అవసరమైనప్పుడు దాన్ని చూపించండి.


ఈ యాప్‌లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూడటం ఎలా?
1. మొదట డిజిలాకర్ యాప్ ఓపెన్ చేయాలి.
2. అనంతరం అక్కడ హోం పేజీలో ‘ఎడ్యుకేషన్’ సెక్షన్‌కు వెళ్లాలి.
3. అందులో 'Board of Intermediate Education, Andhra Pradesh' లేదా BIEAP ఆప్షన్లను సెలక్ట్ చేయాలి.
4. అక్కడ మీ లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
5. అనంతరం ‘సబ్మిట్’పై క్లిక్ చేయండి.
6. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.



Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది