Satyabhama Today Episode సత్య తన తండ్రికి కాల్ చేసి తాను అత్తింట్లో ఆనందంగా ఉన్నాను అని చెప్తుంది. అత్తారింట్లో అడుగుపెడుతున్నప్పుడు సమస్యల వలయం అనుకున్నాను అని ఇప్పుడు తెలుస్తుంది ఎంత అదృష్టవంతురాలిని అనుకుంటుంది. ఇంటి నిండా పనివాళ్లు అని అత్త తనకి కాలు కింద పెట్టనివ్వడం లేదని అంటుంది. ఇక మామ కూడా ఏమీ అనరు అని చెప్తుంది.  


విశ్వనాథం: మరి అల్లుడుగారు అమ్మ.
సత్య: ఆయనకు నా మీద మామూలు ప్రేమకాదు. రాక్షస ప్రేమ.
విశాలాక్షి: అంటే..
సత్య: తట్టుకోలేని ప్రేమ. అంటే ఒక్క నిమిషం వదిలిపెట్టరు అనుకో ఎప్పుడూ వెనకే ఉంటారు. మా అమ్మనాన్నలతో మాట్లాడుకుంటా కాసేపు వదిలేయండి మహా ప్రభు అని 
అడిగి బలవంతంగా వదిలించుకొని వచ్చాను. ( క్రిష్ సత్య మాటలు వింటుంటాడు)
విశాలాక్షి: మరి పెళ్లికి ముందు ఎందుకు రౌడీలా నిన్ను వేధించుకు తిన్నాడు. ఎందుకు గోడల మీద రాశాడు. 
సత్య: అయ్యో అమ్మ అదంతా ఓ పీడ కల. పైగా అదంతా చేసింది మీ అల్లుడు కాదు. కాళీ అని ఓ రౌడీ ఉన్నాడు కదా. మీ అల్లుడు పేరు చెప్పి వాడు చేశాడు ఈ దౌర్జన్యాలు అన్నీ. (క్రిష్ షాక్ అవుతాడు. సత్య తనని అర్థం చేసుకుంది అనుకొని హ్యాపీగా ఫీలవుతాడు.)
విశ్వనాథం: నిజమేనా సత్య.
సత్య: నిజమే నాన్న నేను ముందు నమ్మలేదు అనుమానించాను. పాపం మీ అల్లుడు అమాయకుడు. మీరు ఇక నా గురించి ఎక్కువ ఆలోచించకండి నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఉంటాను.. నాన్న ఒక్క నిమిషం మీ అల్లుడు పిలుస్తున్నారు..
క్రిష్: అబ్బబ్బబా.. ఏమి యాక్టింగ్‌రా బాబు..
విశాలాక్షి: హమ్మాయ్య..
క్రిష్: క్లాప్స్ కొడుతూ.. అబ్బబ్బబా.. మహానటి.. మహానటి.. యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నేను అబద్ధాల కోరుని అన్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి. నీ దగ్గర సమాధానం లేదు అందుకే పారిపోతున్నావ్. నెత్తి దించుకుంటున్నావ్. అది కాదు సంపంగి మీ వాళ్లతో నీ ప్రాబ్లమ్ ఓపెన్‌గా చెప్పొచ్చు కదా దాచుకోవడం ఎందుకు. 
సత్య: అలా చెప్పుకొనే పరిస్థితే ఉంటే ఇలా ఈ పంజరంలో వచ్చి చిక్కుకునే దాన్ని కాదు. నేను ఏం చేసినా మా అమ్మానాన్నల సంతోషం కోసమే చేశాను. 
క్రిష్: ఏదైతే ఏమైంది కానీ నాకు అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. నీ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు  ఆ కాళీ గాడు చేశాడని నమ్మావు.. 
సత్య: నేను ఒప్పుకోలేదు. 
క్రిష్: ఒప్పుకున్నావ్. మీ ఇంట్లో వాళ్లకి చెప్పావ్. కానీ ఏమాటకు ఆ మాట సంపంగి. నువ్వు నా గురించి మీ వాళ్లతో చెప్పినప్పుడు ఏమని పించిందో తెలుసా.. నా మనసులోకి తొంగి చూసినట్లు.. నా మనసులో ఏముందో అదే యాజటీజ్ అదే చెప్పావ్..


సత్య చెప్పింది నిజం కాదు అని విశ్వనాథం అంటాడు. సత్య నిజంగానే సంతోషంగా ఉండి ఉంటే అల్లుడిని తీసుకొని వచ్చేదని.. ఎప్పుడో కాల్ చేసి మాట్లాడేది అని అంటాడు. తాము ఎక్కడ టెన్షన్ పడతామో అని కాల్ చేసిందని అంటాడు. ఇక విశాలాక్షి సత్య దగ్గరికి వెళ్దామని అడుగుతుంది.  దీంతో విశ్వనాథం వద్దు అనేస్తాడు.


భైరవి: సత్య, క్రిష్‌ల ఫొటో ఫోన్‌లో చూస్తూ.. ఎందుకురా తొందర పడ్డావ్. నువ్వు సంతోషంగా లేవు మాకు సంతోషం లేదు. నీకు సుఖం లేదు మాకు సుఖం. లేదు. ముళ్ల కంపను తెచ్చి ఇంటిలో తెచ్చి పెట్టావ్ కదరా.. అసలు ఎందుకురా నవ్వుతున్నావ్‌రా..
పంకజం: ఎవరితో మాట్లాడుతున్నారమ్మా.. 


ఇక పంకజం బట్టలు ఉతకడానికి అడిగితే భైరవి గదిలో పెట్టాను కదా ఉతికి ఆరేశావు కదా అంటుంది. దానికి పంకజం నేనా అని షాక్ అయిపోతుంది. ఇంతలో సత్య వచ్చి నేను ఉతికి ఆరేశాను అని చెప్తుంది. ఇక నుంచి రోజూ నేనే చేస్తా అని చెప్తుంది. 


భైరవి: కాకా పడుతున్నావే..
సత్య: లేదు కోడలిగా నా కర్తవ్యం నెరవేరుస్తా.. అత్తయ్య ఈ పూట వంట ఏం చేయాలి.
పంకజం: తిన్నట్లే..
భైరవి: నువ్వు వడ్డించడం చూసుకో వంట గురించి మర్చిపో.
సత్య: పెద్ద లిస్ట్ చెప్పి ఇవి చాలా ఇంకా చేయాలా..
క్రిష్: వామ్మో ఇదేంటిరా సత్య కొత్తగా కనిపిస్తుంది. స్పీడ్ పెంచింది. గేరు మార్చింది. ఇదేంటిది..
భైరవి: పొద్దున్నే జోకులు వేస్తున్నావా.. 
సత్య: అయ్యో మీతో జోకులా గంటలో వంట చేస్తా..
భైరవి: నాన్ వెజ్ తినని దానివి ఎట్లా వండుతావ్.. ఎట్లా నమ్మాలి.


మీరే చూస్తారు కదా అని సత్య వెళ్తుంది. ఇక పంకజం మొగుడ్ని కొంగుకు చుట్టుకుంది. మిమల్ని కంట్రోల్‌లో పెట్టాలి అనుకుంటుంది అని భైరవికి పనామె చెప్తుంది. ఇక సత్య ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తుంది అని భైవరి అనుకుంటుంది. 


ఇక సత్య తన అక్క వంట చేస్తుంటే పక్కకు తప్పుకోమని చెప్తుంది. రోజూలా కాకుండా ఈ రోజు హుషారుగా ఉన్నావని ఎప్పుడూ ఇలాగే ఉండు అని రేణుక సత్యతో అంటుంది. ఇక ఇద్దరు అక్కాచెల్లెలు కబుర్లు చెప్పుకొని వంట చేస్తారు. ఇక రేణుక క్రిష్‌ని ఇష్టపడి చేసుకున్నావా.. లేక బలవంతంగా చేసుకున్నావా అని అడుగుతుంది. సత్య, రేణులకు సరదాగా నవ్వుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు మనస్శాంతి లేకుండా చేస్తానన్న నర్శింహ.. కార్తీక్‌ ఇంట్లో జడ్జిగా మారిన వంటలక్క!