Trinayani Today April 12th Episode తిలోత్తమ, సుమనలు గాయత్రీ దేవి చీరలు పట్టుకొని ఓ చోటకు వస్తారు. వాటిని అలా తీసి చూస్తే గత సారి నాగయ్య పాము వచ్చాడని.. వాటిని నలిపి ఇస్త్రీ పాడు చేస్తే గాయత్రీ దేవి వస్తుందని అనుకుంటారు. ఇక వల్లభ గాయత్రీ పెద్దమ్మ రాలేదు కానీ పిల్ల వచ్చిందని అంటాడు. పాపని చూసిన సుమన గాయత్రీ పాపని తిట్టి పాప మీద చీర విసిరేస్తుంది. ఇదేదో బాగుంది అని తిలోత్తమ, వల్లభలు చీరలు అన్నీ పాప మీద కప్పేస్తారు. బాగుంది బాగుంది అని నవ్వుకుంటారు. 


నయని చూస్తే తిడుతుంది అని పాప మీద కప్పిన చీరలు తీసేయమని తిలోత్తమ చెప్తుంది. దీంతో విశాల్ పాప మీద కప్పిన చీరలు తీస్తాడు. అప్పుడు గాయత్రీ పాప ఓ బూచిలా కనిపిస్తుంది. దీంతో వల్లభ కెవ్వు మంటాడు. ఇంట్లో అందరూ వచ్చి ఏమైందని అడుగుతారు. బూచి అని వల్లభ పాపని చూపిస్తాడు. చిన్న పిల్లని బూచి అంటారేంటి అని అందరూ వల్లభని తిడతారు.


నయని: గాయత్రీ అమ్మగారి చీరలు ఇలా పడేశారేంటి.
వల్లభ: ఈ చీరలు కింద పడిన తర్వాతే నాకు బూచి కనిపించింది.
విక్రాంత్: బూచి అంటే ఏంటి బ్రో.
వల్లభ: అంటే దెయ్యమేకదా..
నయని: అమ్మగారి చీరలు అన్నీ ఇలా నేలమీద పడేసినందుకే మీకు అలా అనిపించొచ్చు.
విశాల్: అమ్మ మళ్లీ మళ్లీ ఈ చీరల జోలికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.
తిలోత్తమ: గురువుగారు చీరలే నీ కన్న తల్లి జాడ చూపిస్తాయి అన్నారు కదా నాన్న. అది ఎలా సాధ్యం అవుతుందా అని చెక్ చేస్తున్నాం.
విక్రాంత్: పెద్దమ్మ ఆచూకి తెలుసుకోవాల్సిన వాళ్లు తెలుసుకుంటారు. మీరెలాంటి ప్రయత్నాలు చేయకండి.


సుమన తన చీరలు అన్నీ తీసుకొచ్చి విక్రాంత్ ముందు పడేస్తుంది. విక్రాంత్ ఏంటి నా ముందు పడేశావ్ నీకు పిచ్చా అని అడిగితే.. నా చీరలకు విలువ లేదు అంట ఆ గాయత్రీ అత్తయ్య కట్టిన చీరలే గొప్ప అని హాసిని అక్క అంటుందని చెప్తుంది. అందులో అనుమానం ఏముంది అని విక్రాంత్ అంటాడు. ఉడికిపోయిన సుమన ఆవిడలో ఏముంది అంత గొప్ప ఏదో పెద్ద జ్ఞాని అన్నట్లు ఆమెను చూస్తారని అంటుంది. అది నిజమే అని విక్రాంత్ అంటే అందుకేనా 30 ఏళ్లకే చచ్చింది అని సుమన గాయత్రీ దేవి గురించి అంటుంది. దీంతో విక్రాంత్ సుమన చెంప పగలకొడతాడు. 


విక్రాంత్: చచ్చింది.. గిచ్చింది.. అని నోరు జారితే పళ్లు కూడా జారుతాయ్. 
సుమన: మరణించింది అన్నా చావే.. చచ్చింది అన్నా చావే.. అర్థం చేసుకోకుండా చేయి చేసుకుంటారు ఎందుకు..
విక్రాంత్: భావం ఒక్కటే అయినా వాడే భాషను బట్టి సంస్కరిస్తారు. నీకు నచ్చకపోతే మూలన కూర్చొని గిల్లుకో. అంతే కానీ నీ ఈసడింపు మాటలతో ఇంకొకరిని గిల్లుకోవాలి అని చూడకు. 
సుమన: ఆ సరే కానీ నా చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి.. ఒక్కొటి పాతికి వేలు అని సుమన అనడంతో విక్రాంత్ తిట్టి పడేస్తాడు. 


మరోవైపు నయని, హాసినిలు గాయత్రీ దేవి చీరలు ఏఏ గుడిలో ఇచ్చారో వాటిని తెలుసుకోవడానికి పాత ఫైళ్లు అన్నీ తిరగేసి తెలుసుకుంటుంటారు. ఇంతలో విశాల్ వస్తే చీరలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే అక్కడ గాయత్రీ దేవి గారు ఉంటారని కనిపెట్టడం ఈజీ అవుతుందని నయని అంటుంది. 


నయని: గాయత్రీ అమ్మగారు ఎన్ని గుళ్లలో చీరలు సమర్పించారో ఆ ఆడ్రస్‌లకు వెళ్లి నా తొలి బిడ్డ జాడ వెతికితే దొరికిపోతుంది.
విశాల్: నయని చెప్పగానే మీరిద్దరూ సాయం చేస్తున్నారు.(అబ్బా మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదే..)
నయని: బాబుగారు అమ్మగారు మొత్తం 11 దేవాలయాలకు చీరలు సమర్పించారు.
హాసిని: ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటి అంటే జోగయ్య శాస్త్రిగారు అర్చన చేసే పరమేశ్వరి ఆలయానికి కూడా గాయత్రీ దేవి గారు చీర సమర్పించారు.
పావనా: అంటే ఏంటి అమ్మ ఆ గుడి దగ్గర మన గాయత్రీ అమ్మ ఉందనా. ఉంటే గాయత్రీ పాపని తీసుకొచ్చినట్లు తనని తీసుకొచ్చే వాళ్లం కదా. 
విశాల్: మామయ్య మీ తెలివి తేటలకు జోహార్లు.. కాస్త సైలెంట్‌గా ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుంది.
నయని: క్లూ అయితే దొరికింది. ఈ దారిలో ప్రయత్నిస్తే అమ్మగారి జాడ తెలుస్తుంది. పెద్దయ్య గారి దగ్గర మన గాయత్రీ పాప ఉండేది. అక్కడే అమ్మగారు ఉండేవారా.. చూద్దాం.  


వల్లభ, తిలోత్తమలు అఖండ స్వామి దగ్గరకు వస్తారు. అఖండ స్వామి వాళ్లతో కళ్లెదుట సత్యం ఉన్న గ్రహించలేకపోతున్నారు అని అంటాడు. ఇక తిలోత్తమ గురువుగారు చెప్పిన చీరల గురించి చెప్తుంది. ఇక అఖండ స్వామి వాళ్లకు కాటుక ఇచ్చి దానితో అంజనం వేయాలని అంటారు. అయితే గురువుగారు ఆ పని చేయాలి అంటారు. తలోత్తమ సరే అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక ఇంట్లో అందర్ని తిలోత్తమ హాల్‌లోకి పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ దొంగ అని ఫ్రూవ్‌ చేసిన మనోహరి – మిస్సమ్మను ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్న అమర్‌