Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని కార్తీక్‌తో చూసిన నరసింహ ఫుల్లుగా మందు తాగి వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని భార్య వచ్చి ఏమైందని అని అడుగుతుంది. అది కనపడిందా అని నరసింహని అడుగుతుంది. సీరియస్‌గా చూసిన భర్తతో ఓ కనిపించిందా అని అంటుంది.
నరసింహ: నువ్వు తెలివైన దానివే దీప. పండగకు కూడా పాత మొగుడేనా అన్న సామెతని నిజం చేశావ్. నువ్విచ్చిన షాక్‌కి తెల్లార్లు తాగినా దిగేలా లేదు.
మరో వైపు శివనారాయణ ఇంట్లో ఉగాది ఏర్పాట్లు జరుగుతాయి. సుమిత్ర ఇంటికి దూపం వేస్తుంటుంది. కార్తీక్ కూడా రెడీ అయిపోతాడు. అక్కడికి జ్యోత్స్న వచ్చి బావ నువ్వు పెళ్లికొడుకులా ఉన్నావ్ అంటుంది. దానికి కార్తిక్ అలా అని బుగ్గన చుక్క పెడతావా ఏంటి అంటాడు.
జ్యోత్స్న: బావ ఓ మాట అడగనా.. ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా.. లేక డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోవచ్చా..
కార్తీక్: ఎంగేజ్మెంట్ లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు.
శ్రీథర్: రేయ్ మీరు మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నారేంట్రా.. ముహూర్తాలు పెట్టేవరకు అయినా ఆగుతారా.. మూడు ముళ్లు వేసిన తర్వాత చెప్తారా..
కార్తీక్: హలో మాస్టారు ఇక్కడ అంత సీన్ లేదు. ఆఫ్ విని ఏదేదో అనుకుంటున్నారు.
జ్యోత్స్న: తర్వాత జరిగేది అయినా అదే కదా బావ.
కార్తీక్: ఇక్కడేం జరిగిందో అయినకు తెలీదు. నేనేం అనుకుంటున్నానో ఈవిడకు తెలీదు. ఎవడి స్క్రీన్‌ప్లే వాడు రాసుకుంటున్నాడు. అసలు ఇంత వరకు చెప్పకుండా ఈ పారు ఏం చేస్తుంది.
అందరూ ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకొని ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక శ్రీథర్ తన బావ దశరథతో వియ్యంకుడు గారు ఇప్పుడే మా వాడు క్లారిటీ ఇచ్చాడు అని అంటాడు. ఏం క్లారిటీ ఇచ్చాడని పారు అడిగితే కార్తీక్ వచ్చి నేను చెప్తా పారు అని ఉగాది శుభాకాంక్షలు అంటాడు. అంతేనా కార్తీక్ అని సుమిత్ర అంటే దానికి కార్తీక్ ఉత్తరాయణం.. దక్షిణాయణం.. ఆ రుతువు ఈ రుతువు అని నవ్విస్తాడు.
కాంచన: మీ అత్తయ్య అడిగేది రుతువుల గురించి కాదురా మేమంతా ఎదురు చూస్తున్న శుభవార్త గురించి.
పారు: అవును కార్తీక్ నేను కూడా వెయిటింగ్.. ఇక కార్తీక్ తాను చెప్పిన విషయం జ్యోత్స్నకు చెప్పావా అని సైగ చేస్తాడు. ఇక పంతులు వస్తాడు. కార్తీక్ తన జాతకం ఎలా ఉంది అని అడిగితే మీకు ఏంటి బాబు మీరు దశరథ గారికి కాబోయే అల్లుడు కదా అదిరిపోతుంది అంటాడు. దాంతో కార్తీక్ అందరి కళ్లు నా మీదే అనుకుంటాడు. ఇక సుమిత్ర, జ్యోత్స్నలు కొత్త బట్టల్ని దీప వాళ్లకి ఇస్తామని వెళ్తారు.
ఇక దీప తాను కొన్న బట్టలకు పసుపు బొట్లు పెడుతూ.. ఇవి చూస్తే చాలా ఖరీదులా ఉన్నాయి. ఇవి నిజంగానే తక్కువకు వచ్చాయా ఆయన గారు ఏమైనా చేశారా అని ఆలోచిస్తుంది. ఇంతలో జ్యోత్స్న వాళ్లు వచ్చి బట్టలు ఇచ్చి అవే వేసుకోమని అంటారు.
మరోవైపు నర్సింహ ఫోన్ చూస్తూ ఉంటాడు. తన భార్య రావడం చూసి ఫోన్ దాచేస్తాడు. శోభ ఉగాది పచ్చడి భర్త ముందు పెట్టి తినమని చెప్తుంది. దాంతో నర్సింహ బంగారం ప్రతీ పండగకు నువ్వే కదా తినిపిస్తావు.ఈసారి ఏంటి ఇలా పక్కన పెట్టావు అంటాడు. దానికి శోభ నువ్వు ముందు నీ మొదటి పెళ్లాం దగ్గర నుంచి విడిపోయి ఆ పత్రాలు నా చేతిలో పెట్టలేదు అనుకో గిన్నే పక్కన పెట్టడం కాదు నీ మొహం పగలగొడతా అంటుంది.
నర్సింహ: వదిలించుకోవడం సంగతి పక్కన పెడితే అసలు ఈ సంగతి ఏంటో అర్థంకావడం లేదు దీప. నువ్వు నా కోసమే సిటీకి వచ్చావా.. లేదా ఇంకా ఎవరి కోసమో వస్తే నేను దొరికానా.. నిన్ను కారులో తీసుకెళ్లింది ఎవరో తెలుసుకోవాలి అనుకున్నా కదురలేదు. అసలు వాడికి నీకు ఏంటి సంబంధం. వాడితో ఎందుకు ఉన్నావ్. దీని బట్టి ఒకటి అర్థమైంది.. నువ్వు నా కంటే ఇంకా ఏదో పెద్ద కథ నడుపుతున్నావ్. కంగారు పడకు ఇక నుంచి నిన్ను వెంటడటమే నా పని. ఈ సిటిలో నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా. నిన్ను అయితే మనస్శాంతిగా బతకనివ్వను.
మరోవైపు అందరూ పూజకు కూర్చొంటారు. దీప, సౌర్య కొత్త బట్టలు వేసుకొని వస్తారు. సౌర్యని సుమిత్ర ముద్దులాడుతుంది. పారిజాతం రగిలిపోతుంది. ఇక దీపని చూసిన శివనారాయణ మనసులో.. పేదింటి అమ్మాయి అయిన దీప గొప్పింటి బిడ్డలా కనిపిస్తుంది అనుకుంటాడు.
ఇక సౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్లి నా డ్రస్ ఎలా ఉంది కార్తీక్ అని అంటుంది. అందరూ నోరెళ్ల బెడతాడు. ఇక కార్తీక్ సౌర్య పెద్ద రౌడీ అని తనని నేను రౌడీ అంటాను అని తను నన్ను కార్తీక్ అంటుంది అని అంటాడు. ఇక కార్తీక్ సౌర్యకు చాక్లెట్ ఇస్తే పాప తీసుకోకుండా తల్లిని చూస్తుంది. దీంతో సుమిత్ర తీసుకో అంటుంది.
కార్తీక్: మనసులో.. పైకి కనపడటం లేదు కానీ నువ్వు ఇక్కడ ఎంత ఇబ్బందిగా కూర్చొన్నావో నాకే తెలుసు దీప.
ఇక దీప శివనారాయణని పెద్దయ్య గారు అంటే తాత అని పిలవమని అంటారు. దీప పిలవలేను అంటే అలా పిలవకపోతే నా కొడుకును నీతో దత్తత తీసుకోమని అయినా తాత అని పిలుపించుకుంటా అంటాడు. అందరూ బలవంతం చేయడంతో దీప తాతయ్య గారు అంటుంది. ఇక శివనారాయణ సౌర్యతో ముద్దు పెట్టించుకుంటాడు. నన్ను ఏమని పిలుస్తావ్ అని అంటే ముద్దుల తాత అంటాను అంటుంది.
ఇక శివనారాయణ ఉగాది పచ్చడి పోటీలు పెడతారు. గెలిచిన వారికి తులం చైన్ ఇస్తాను అంటాడు. దానికి దీపని జడ్జిని చేస్తాడు. ఇక దీప పారిజాతం తప్ప ఇంట్లో అందరూ మంచి వాళ్లే అనుకుంటుంది. అందరూ ఉగాది పచ్చడి చేయడంలో నిమగ్నం అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.