Vivo T3x 5G India Launch: వివో టీ3ఎక్స్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన మార్కెటింగ్ మెటీరియల్ ఇప్పటికే లీక్ అయింది. ఇందులో ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను చూడవచ్చు. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి కూడా. ఇప్పుడు ఈ ఫోన్ ధర ఎంత ఉండవచ్చు, డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ స్వయంగా టీజ్ చేసింది. దీంతో పాటు ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా వివో ప్రకటించింది. 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన వివో టీ2ఎక్స్‌కు తర్వాతి వెర్షన్‌గా వివో టీ3ఎక్స్ మార్కెట్లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో వివో టీ2ఎక్స్ మార్కెట్లోకి వచ్చింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
వివో తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో టీ3ఎక్స్ లాంచ్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం గంటలకు ఈ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో పాటు వీడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఫోన్ డిజైన్‌ను చూడవచ్చు. గ్రీన్, రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం ఈ కలర్ ఆప్షన్లను సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ పేర్లతో మార్కెట్ చేయనున్నారు.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
వివో టీ3ఎక్స్ 5జీలో వెనకవైపు పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు. ఇందులో రెండు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మైక్రో సైట్ ప్రకారం ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.15 వేలలోపే ఉండనుంది. వివో టీ3ఎక్స్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు.
4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉండనున్నాయని తెలుస్తోంది. స్టోరేజ్ మాత్రం 128 జీబీ అందించనున్నారట. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుందని సమాచారం. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుందట. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌ను అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉండనుందని సమాచారం.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది