Effects of Mars and Saturn 2024 to 2025:  నవనాయకుల ఫలాలు అనే మాట విన్నారా?.. అంటే ప్రతి సంవత్సరం నవగ్రహాలు తమ శాఖలను మార్చుకుంటాయి. అవి ఉన్న స్థానాలను బట్టి ఆ ఏడాది దేశంలో ఫలితాలు ఆధారపడి ఉంటాయి. నవగ్రహాలకు మొత్తం తొమ్మిది శాఖలుంటాయి... అవి...


1.రాజు    2.మంత్రి   3.సైన్యాధిపతి   4.సస్యాధిపతి   5.ధాన్యాధిపతి  6.అర్ఘ్యాధిపతి   7.మేఘాధిపతి  8.రసాధిపతి    9.నీర్సాధిపతి....


2024 to 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నవగ్రహాల శాఖలు ఇవే...


1.రాజు - కుజుడు


శ్రీ క్రోధి నామ సంవత్సరానికి రాజు కుజుడు అవడం వల్ల పరిపాలన కఠినంగా ఉంటుంది. పాలకులు - ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధవాతావరణం తప్పదు..రాజీ ప్రయత్నాలు చేసినా కానీ ఫలించవు. రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్న కొందరు నాయకులకు ఊచలు లెక్కెట్టక తప్పదు...కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఏ విషయంలోనూ ఏకీభవించరు. ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి...ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం తప్పదు. దేశంలో రికార్డు స్థాయిలో అగ్నిప్రమాదాలు జరుగుతాయి.  ప్రతి కుటుంబంలోనూ బేధాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. 


Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!


2.మంత్రి - శని


ఈ ఏడాదికి కుజుడు రాజు అయితే...శని మంత్రి. ఫలితంగా దేశంలో, రాష్ట్రంలో దొంగతనాలు - మోసాలు భారీగా జరుగుతాయి. అగ్ని, విద్యుత్ సంబంధిత మారణాయుధాలవల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. వాహనప్రమాదాలు జరుగుతాయి. ఖనిజాల గనులను ప్రైవేట్ పరం చేయడంవల్ల ఆందోళనలు పెరుగుతాయి. దేశాన్ని రక్షించే సైనికులకు నూతన ఆయుధాలు సమకూరుతాయి...కొన్ని విషయాల్లో మందకొడిగా వ్యవహరించడం వల్ల నష్టపోతారు..కానీ చివరి నిముషంలో అప్రమత్తం అవడం వల్ల బయటపడగలుగుతారు. సైన్యంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు.


3. సైన్యాధి పతి - శని


శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మంత్రి మాత్రమే కాదు..సైన్యాధిపతి కూడా శనిదేవుడే. ఫలితంగా ప్రజల్లో అకారణ భయాలు , రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలం అనిపిస్తాయి. కొందరు రాజకీయ ప్రముఖులకు శిక్షలు తప్పవు.  సరిహద్దు దేశంలో ప్రాణనష్టం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఖ్యాతి పెరుగుతుంది. అగ్రరాజ్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి..


Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


4.సస్యాధిపతి - కుజుడు


ఈ ఏడాది రాజు మాత్రమే కాదు..సస్యాధిపతి కూడా కుజుడే. ఫలితంగా ప్రజలు, నాయకుల్లో వీరావేశం ఉంటుంది. మంత్రుల మధ్య విరోధాలు ఎక్కువవుతాయి. మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఒడిదొడుకులు తప్పవు.


మిగిలిన నాయకుల ఫలితాలు మరో కథనంలో తెలుసుకుందాం...


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.