Bhadradri Temple Annual Income: ఏటా సమ్మర్ వచ్చేసరికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో సందడి మొదలవుతుంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారు.. స్వామివారి ఆదాయం పెరిగేది కూడా ఈ సమయంలోనే. సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీరామ పట్టాభిషేకానికి తెలుగు రాష్ట్రాలతో పాటూ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు.
తెలుగు సంవత్సరం ప్రారంభమైన ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ శ్రీరామనవమి. ఈ ఏడాది మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకూ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 6 శ్రీరామనవమి, ఏప్రిల్ 7 పట్టాభిషేకం జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తరలివచ్చే భక్తులు మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా భారీగా కానుకలు సమర్పిస్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే సీతారాముడికి కాసులు కురిసే సమయం ఇదే. మార్చి మొదలుకుని జూన్ స్కూల్స్ రీఓపెన్ వరకూ విపరీతమైన రద్దీ ఉంటుంది.
మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఏడాదికి 30 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని అంచనా..అయితే అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 23.74 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో పెద్దగా భక్తుల రద్దీ లేదుకానీ మార్చి ఎండింగ్ నుంచి జూన్ వరకూ భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కల్యాణ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అందుకే ఈ సమయంలోనే ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ మేరకు భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్ యాప్ ప్రారంభించారు. రామాలయంతో పాటూ అనుబంధ ఆలయాలు, ఆ చుట్టుపక్కల దర్శనీయ స్థలాల వివరాలు ఇందులో పొందుపరిచారు. ఇదే యాప్‌ను మరించ అభివృద్ధి చేసి పూజలు, అభిషేకాలు, హారతులు, వసతి బుకింగ్ కోసం వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇప్పటికే శ్రీరామ కల్యాణం టికెట్లు, రామ పట్టాభిషేకం టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులో ఉంచారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ప్రశాంతంగా తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ సెక్టార్లతో పాటూ క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. వేసవి కావడంతో మంచినీరు, మజ్జిగ సరఫరా చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో పాటూ స్వామి వారి హుండీ ఆదాయం పెరుగుతుందన్నది అధికారుల ఆలోచన.
(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
గడిచిన ఐదేళ్లలో రామచంద్రుడి హుండీ ఆదాయం వివరాలు
2019 - 2020 : ఆదాయం 48.46 కోట్లు - వ్యయం 48.74 కోట్లు
2020-2021 : ఆదాయం 38.61 కోట్లు - వ్యయం 36.33 కోట్లు
2021 - 2022 : ఆదాయం 42.83 కోట్లు - వ్యయం 44.99 కోట్లు
2022 - 2023 : ఆదాయం 54.41 కోట్లు - వ్యయం 54.33 కోట్లు
2023 - 2024 : ఆదాయం 79.46 కోట్లు - వ్యయం 74.85 కోట్లు
ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా..ఈ మేరకు ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులు ప్రచారం జోరు పెంచారు. ఫలితంగా గడిచిన ఐదేళ్ల కన్నా ఈ ఏడాది ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా..
(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)