Ugadi Yearly Rasi Phalalu 2025: కొత్త ఏడాదిలో  వృషభ రాశివారికి అన్ని విధాలుగా అనుకూల సమయం. ఏడాది ఫలితాలు మొత్తం ఇక్కడ చూసుకోండి...


ఈ రాశివారికి గురు బలం ఉండడంతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ( 2025-2026) అద్భుతంగా ఉంటుంది. అదృష్టం మొత్తం మీ సొంతం అన్నట్టుంటుంది. రాహుకేతువుల సంచారం మీకు కలిసొస్తుంది. వ్యక్తిగత జీవతం , వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అన్నింటా సంతోషమే. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా అవలీలగా సాధించేస్తారు. మీ మనోధైర్యం కొండంత అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. 


ఉద్యోగులకు


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి ఉద్యోగులకు యోగదాయంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో పనిచేసేవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఉద్యోగ స్థిరత్వం పొందుతారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారికి యాజమాన్యం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. 


రాజకీయ నాయకులుకు


రాజకీయాల్లో ఉండేవారికి ఉన్నతాధికారుల నుంచి అనుగ్రహ లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. అధిష్టానం నుంచి మీరు గౌరవం పొందుతారు. మీ కష్టానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీచేసేవారు మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ విశ్వావసు నామ సంవత్సర మేష రాశి నెలవారీ ఫలితాలు!


కళా రంగంలో ఉండేవారికి 


కళారంగంలో ఉండేవారికి ఈ ఏడాది నూతన అవకాశాలు లభిస్తాయి. గాయనీ గాయకులు, రచయితలకు వరుస అవకాశాలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులు పొందుతారు. పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. 


వ్యాపారులకు


ఈ ఏడాది వ్యాపారులకు యోగం కాలం. ఆర్థికంగా కలిసొస్తుంది. రిటైల్ వ్యాపారులకు కలిసొస్తుంది. నూతన వ్యాపారం చేసేవారికి అనుకూల ఫలితాలు పొందుతారు.  గృహనిర్మాణరంగంలో ఉండేవారు స్థిరాస్థి వృద్ధి చేస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో ఉండేవారు లాభపడతారు.
 
విద్యార్థులకు


శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉన్నత చదువులు చదువుతారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఎంట్రన్స్ పరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. 


Ugadi Panchangam in Telugu (2025-2026): శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాశి ఫలితాలు - గురు, శని గ్రహాలు మిమ్మల్ని అంతెత్తున కూర్చోబెడతాయ్!


క్రీడాకారులకు


ఆటల రంగంలో ఉండేవారికి ఇది కలిసొచ్చే సమయం. క్రీడల్లో విజయం సాధిస్తారు. పతకాలు , బహుమతులు పొందుతారు. 


వ్యవసాయదారులకు 


వృషభ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. గతంలో చేసిన అప్పులు తీరిపోతాయి. చేపలు, రొయ్యల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభం ఉంటుంది. పంట దిగుబడి పెరగడంతో లాభాలొస్తాయి. 


ఈ రాశి స్త్రీలకు విశేష యోగకాలం. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేసే మహిళలకు ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి. వివాహం కాని స్త్రీలకు ఈ ఏడాది తప్పకుండా పెళ్లి జరుగుతుంది. గ్రహాల అనుకూల సంచారంతో మీ మాటకు తిరుగులేదు. ఎదుటివారికి ఆకర్షణీయంగా కనిపిస్తారు.   


 Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


 ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు