Mesha Rasi Ugadi Panchangam 2025 April to 2026 March :  శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి మాస ఫలితాలు...


మేష రాశి  ( అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం )
ఆదాయం: 2 , వ్యయం:14  , రాజపూజ్యం:5 , అవమానం:7


ఏప్రియల్ 2025


ఈ నెలలో మేష రాశివారికి గ్రహసంచారం అనుకూలంగాలేన అన్నిరంగాల వారికి నష్టాలు తప్పవు. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి.  మీరు ఊహించని సంఘటనలు జరుగుతాయి. స్నేహతులతో విరోధాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.


మే 2025


మేష రాశివారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది. గత నెలవరకూ పడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. శత్రువులే మిత్రులవుతారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఎంతటి కార్యాన్ని అయినా సాధించేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. 


జూన్ 2025


ఈ నెలలో ఆర్థిక లాభం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు.ఉన్నతాధికారుల వల్ల లాభపడతారు. సంతోషకర వార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. నూతన గృహనిర్మాణాలు కలిసొస్తాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.


Ugadi Panchangam in Telugu (2025-2026): శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాశి ఫలితాలు - గురు, శని గ్రహాలు మిమ్మల్ని అంతెత్తున కూర్చోబెడతాయ్!


జూలై 2025


ఈ నెలలోనూ మేష రాశివారికి అనుకూల గ్రహసంచారం ఉంటుంది..కానీ..ఆదాయాన్ని మించిన ఖర్చులు చేస్తారు. దూరప్రయాణాలు తప్పుతాయి. మాటపట్టింపులుంటాయి. వ్యక్తిగత జీవితంలో తగాదాలు వచ్చినా వెంటనే సమసిపోతాయి. 


ఆగష్టు 2025


ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి. అధికారుల  అనుగ్రహం మీపై ఉంటుంది. 
 
సెప్టెంబర్ 2025


ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. చేయాల్సిన పనులపై పెద్దగా ఆసక్తి ఉండదు. సోమరితనం ఉంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. సంతానం కారణంగా ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. కోపం పెరుగుతుంది. వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త.


అక్టోబర్ 2025
 
అక్టోబరులో మేష రాశివారికి అన్ని రంగాలవారికి కలిసొస్తుంది. చేపట్టిన వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. ధైర్యంగా దూసుకెళ్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. 


Ugadi 2025 Aadayam Vyayam : ఉగాది 2025 విశ్వావసు నామసంవత్సరంలో మీ రాశి ప్రకారం ఆదాయం - వ్యయం తెలుసుకోండి!


నవంబర్ 2025
 
ఈ నెల ఆరంభం అదిరిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కానీ నెలలో రెండో భాగం అంతగా  అనుకూలించదు. చేపట్టిన వ్యవహారాలు పూర్తికావు, ప్రయాణాల్లో ఇబ్బందులు, అకాల భోజనం, ఆరోగ్యం భంగం ఉంటుంది. మీ గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఎదురవుతాయి 


డిశంబర్ 2025


డిసెంబరు నెలలో గ్రహసంచారం అనుకూలంగా ఉండదు..అందుకే ఏం అనుకున్నా పూర్తిచేయలేరు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు బాధపెడతాయి.ఏదో ఆందోళన వెంటాడుతుంగది. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారుతుంది.


జనవరి 2026


ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 2026లో గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బావుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రువులపై పైచేయి లాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. జీవనం ప్రశాంతంగా అనిపిస్తుంది.


ఫిబ్రవరి 2026


ఈ నెల కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. వివాహాది శుభాకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది


మార్చి 2026
 
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం లో ఆఖరి నెల మార్చి 2026 మేష రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అనుకూల గ్రహసంచారం మీకు కలిసొస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి.సోదరుల మూలకంగా లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. గౌరవం పెరుగుతుంది.
 Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


 ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు