SLBC Tunnel News: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. కెడావర్ డాగ్స్ గుర్తించిన స్పాట్‌లో తవ్వకాలు చేసిన రెస్క్యూ సిబ్బందికి మానవ అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ మరింత లోతుగా తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు టీబీఎం మెషిన్‌ విడిభాగాలు అడ్డంకిగా మారాయి. వాటిని తొలగించి మరింత లోతుకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు. 


ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలింది. అప్పటి నుంచి 8 మంది కార్మికుల కోసం రాత్రి పగలు రెస్క్యూటీం శ్రమిస్తున్నారు. పదిహేను రోజుల నుంచి చేస్తున్న ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.  కేరళ నుంచి వచ్చిన కెడావర్‌ డాగ్స్‌ గుర్తించిన స్పాట్స్‌తో తవ్వకాలు చేపట్టిన రెస్క్యూ టీం మృతదేహాన్ని గుర్తించారు. 


Also Read: పరీక్ష కేంద్రాల్లో 'గోడ గడియారాలు' పెట్టాల్సిందే, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు


కార్మికులను రక్షించేందుకు 11 రెస్క్యూ టీంలు 15 రోజుల నుంచి నిరంతరం తీవ్రంగా శ్రమించాయి. వివిధ మార్గాల ద్వారా ప్రమాదం జరిగే ప్రాంతానికి చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్లంతా ప్రాణాలతో ఉన్నారని లోపలికి నిరంతరంగా ఆక్సిజన్ పంపించారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మృతదేహాల భాగాలు కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. ఇంకా లోతుగా వెళ్తే మరింత మంది మృతదేహాలు వెలికితీయనున్నారు. 


మొదటి రెండు రోజుల్లోనే 13.50 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీంలు చేరుకోగలిగాయి. మిగతా కొద్ది దూరం వెళ్లేందుకు టీబీఎం అడ్డంకిగా మారింది. మట్టి, బురద కూడా వారికి ఆటంకం కలిగించింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లోపలికి వెళ్లే మార్గం దొరకలేదు. కనీసం కార్మికుల మృతతదేహాలైనా దొరుకుతాయో లేదో అన్న అనుమానం కలిగింది. 


రెస్క్యూ ఆపరేషన్‌లో కేరళకు చెందిన కెడావర్ డాగ్స్‌ రంగంలోకి దించారు. దీంతో అధికారులు పురోగతి సాధించారు. ఆ డాగ్స్‌ మూడు స్పాట్‌లను గుర్తించాయి. అనంతరం అక్కడ తవ్వకాలు జరిగిన అదికారులకు మనిషి మృతేదేహం దొరికింది. అక్కడ ఇరుక్కుపోయిన టీబీఎంలో కార్మికుడి చేయి ఇరుక్కున్నట్టు తేల్చారు. దీంతో మరింత లోతుగా తవ్వేందుకు యత్నిస్తున్నారు. 


Also Read: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు డ్రైవర్ల మృతి, 10 మందికి గాయాలు