Telangana Budget 2025: తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యాంరటీల అమలుకు కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం 56,084 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసన సభలో 3,04,965 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇందులో ఆయా శాఖల వారీగా కేటాయింపులు జరిపిన రేవంత్ సర్కార్ ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్ లో 56,084 కోట్లను కేటాయించింది.
1). మహా లక్ష్మి పథకం ( ఉచిత బస్సు) అమలుకు 4,305 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
2). ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 12,751 కోట్లు కేటాయించారు.
3). గృహ జ్యోతి పథకానికి (200 యూనిట్ల ఉచిత విద్యుత్ ) గాను 2080 కోట్లు కేటాయించింది.
4). రైతు భరోసాకు 18 వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
5). రాజీవ్ యువ వికాసం కోసం ఆరు వేల కోట్లను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
6). చేయూత పింఛన్ల కోసం రూ. 14 వేల కోట్ల 861 ను కేటాయించింది.
వీటితో సన్న బియ్యానికి బోనస్ చెల్లింపుల కోసం 1800 కోట్లు, 1400 కోట్లు రాజీవ్ ఆరోగ్య శ్రీ కోసం, 700 కోట్లు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 600 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది.