Sigachi Chemical Explosion | నేటికీ ఆచూకీ దొరకని అఖిల్ మృతదేహం..పెళ్లైన ఐదు నెలలకే పెను విషాదం| ABP
సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి నేటికి ఆరురోజులు గడిచినా ఇంకా గల్లంతైన వారి ఆచూకీ దొరకలేదు. మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నా ప్రయోజనం లేదు. మరో 8 మృదేహాలు దొరకాల్సి ఉండగా, ఇప్పటికే శరీర భాగాలు విడిపోవడంతో వాటిని బాక్స్ లో ప్యాక్ చేశారు. ఉప్పల్ కు చెందిన అఖిల్ అనే యువకుడు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో విధినిర్వహణలో ఉన్నాడు. పేలుడుకు కొద్ది నిమిషాల ముందే, తాను కంపెనీలోనికి వచ్చినట్లు భార్యకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసిన 5నిమిషాల్లోపై సిగాచీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే సిగాచీ ఫ్యాక్టరీ వద్దకు అఖిల్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆ రోజు నుండి నేటి వరకూ గత ఆరు రోజులుగా తమ బిడ్డ అఖిల్ కోసం గుండెల నిండా విషాదం నింపుకుని ఎదురుచూస్తున్నా ప్రయోజనం లేదు. వారి ఆవేదన, కన్నీళ్లకు సమాధానం చెప్పే వారు కూడా లేకుండా పోతున్నారు.