South Indian cuisine Mutton Chutney Recipe : మటన్ పచ్చడి కాదండోయ్ చట్నీనే ఇది.. నోటికి మరింత రుచిగా, సరికొత్త టేస్టీ రెసిపీ
Non Veg Chutney Recipe : మటన్ పచ్చడి గురించి వింటూనే ఉంటాము. కానీ మటన్ చట్నీ గురించి తెలుసా? రెండూ ఒకటే అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇదో మరోరకం, టేస్టీ వంటకం. రెసిపీ ఎలానో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు
మటన్ - 1/2 Kg
టోమాటో - 1.5 Kgs
వెజిటెబుల్ ఆయిల్ - 2 tbsp
కశ్మీరి కారం - 1 tbsp
కారం - 1.5 tbsp
ఉప్పు - 1 tbsp
పసుపు - 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tbsp
పుదీనా - 10 ఆకులు
కొత్తిమీర - చిన్నకట్ట
నీళ్లు - 1.5 cups
మసాలా పొడికోసం
ధనియాలు - 50 గ్రాములు
నువ్వులు - 10 గ్రాములు
కాళోంజి - 20 గ్రాములు
చట్నీ కోసం
నూనె - 500ml
వెల్లుల్లి - 25-30 రెబ్బలు
జీలకర్ర - 1 tsp
ఆవాలు - 1 tsp
ఎండు మిర్చి - 12
కరివేపాకు - గుప్పెడు
నిమ్మరసం - 10-12 lemons
తయారీ విధానం
మటన్ బోన్ లెస్ తీసుకోవాలి. లేదా ఉడికించిన తర్వాత బోన్స్ తీసేయాలి. ముందుగా మటన్‌ని శుభ్రం చేసుకుని.. దాని ప్రెజర్ కుక్కర్లో వేయాలి. దానిలో టమోటో ముక్కలు, నూనె, కశ్మీరి కారం, కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి.. అన్ని కలిసేలా పిసుకుతూ కలపాలి. అన్ని బాగా కలిసిన తర్వాత దానిలో ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసి స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. ఇది నాలుగు విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత.. మూత తీసేసి.. మీడియం మంటమీద కుక్కర్‌ని స్టౌవ్ మీద ఉడికించాలి. నీరు ఆవిరై.. దగ్గరగా అవుతున్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.
మటన్ చల్లారేలోపు.. స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. దానిలో ధనియాలు, నువ్వులు, కాళోంజి సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. వాటిని చల్లారనివ్వాలి. అనంతరం దానిని పౌడర్‌గా చేసుకోవాలి. ఇప్పుడు మటన్ చల్లారిందో లేదో చెక్ చేసుకుని.. దానిని పేస్ట్ చేసుకోవాలి. అవును.. మటన్ మిశ్రమాన్ని రోట్లో లేదా మిక్సీలో వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఇలా చేసే సమయంలో బోన్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. ఎలా చేసినా పేస్ట్‌గా అయ్యేలా మాత్రం చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పెద్ద కడాయి పెట్టుకోవాలి. దానిలో 500 ml నూనె వేసి.. కాగనివ్వాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అవి వేగిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అన్ని వేగిన తర్వాత.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మటన్ పేస్ట్‌ని దీనిలో వేసుకోవాలి. మటన్‌ని దానిలో ఉడకనివ్వాలి. ఎంతగా అంటే.. మటన్ పేస్ట్ పూర్తిగా ఆయిల్‌ని పీల్చుకుని.. మంచి కలర్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
మటన్ పేస్ట్ నూనెలో ఉడికే సమయంలో దానిని బాగా తిప్పుతూ ఉండండి. లేదంటే చట్నీ అడుగు పట్టేసే అవకాశముంది. దీనికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు సమయం పడుతుంది. ఇప్పుడు దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఇది వేసిన తర్వాత మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు.. నిమ్మకాయలను కట్ చేసి.. ఫ్రెష్ జ్యూస్ తీసుకోవాలి. గింజలు లేకుండా నిమ్మరసాన్ని తీసుకోవాలి.
మటన్ పేస్ట్, ధనియాల పొడి మిశ్రమం ఉడికిన తర్వాత నిమ్మరసాన్ని వేసి కలిపేయాలి. మటన్‌లో నిమ్మరసం పూర్తిగా కలిసేలా కలిపి.. స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ చట్నీ రెడీ. దీనిని మీరు రోటీల్లో, అన్నంలో, చపాతీల్లో ముఖ్యంగా బిర్యానీలో కూడా తినొచ్చు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా ఆకట్టుకుంటుంది.
Also Read : ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్.. సండే స్పెషల్‌గా హీరో రెసిపీని ఫాలో అయిపోండి
Ingredients
- 500 Gram మటన్
- 1.5 Kilogram టోమాటో
- 2 Tablespoon వెజిటెబుల్ ఆయిల్
- 1 Tablespoon కశ్మీరి కారం
- 1.5 Tablespoon కారం
- 1 Tablespoon ఉప్పు
- 1 Teaspoon పసుపు
- 2 Tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్
- 10 Piece పుదీనా
- 1 Cup కొత్తిమీర
- 1.5 Cup నీళ్లు
- 50 Gram ధనియాలు
- 10 Gram నువ్వులు
- 20 Gram కాళోంజి
- 500 Milliliter నూనె
- 30 Piece వెల్లుల్లి రెబ్బలు
- 1 Teaspoon జీలకర్ర
- 1 Teaspoon ఆవాలు
- 12 Piece ఎండు మిర్చి
- 20 Piece కరివేపాకు
- 10 Piece నిమ్మరసం
Cooking Instructions
కుక్కర్లో టమోటో ముక్కలు, నూనె, కశ్మీరి కారం, కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి బాగా కలిపి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

అనంతరం మూత తీసేసి.. మీడియం మంటమీద కుక్కర్‌ని స్టౌవ్ మీద ఉడికించాలి. నీరు ఆవిరై.. దగ్గరగా అవుతున్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.

పాన్‌లో ధనియాలు, నువ్వులు, కాళోంజి సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేయాలి. చల్లారిన తర్వాత వాటిని పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం మటన్ మిశ్రమాన్ని రోట్లో లేదా మిక్సీలో వేసి పేస్ట్‌గా చేసుకోవాలి.

ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని.. వెల్లుల్లిని వేయించుకోవాలి. దానిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి తిప్పిన తర్వాత మటన్ పేస్ట్‌ని ఉడకనివ్వాలి.

ఉడికిన తర్వాత ధనియా పౌడర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. అనంతరం నిమ్మరసం వేసి కలిపి స్టౌవ్ ఆపేస్తే మటన్ చట్నీ రెడీ.

Summary
Mutton Chutney Recipe : మటన్ పచ్చడి కాదండోయ్ చట్నీనే ఇది.. నోటికి మరింత రుచిగా, సరికొత్త టేస్టీ రెసిపీ
Non Veg Chutney Recipe : మటన్ పచ్చడి గురించి వింటూనే ఉంటాము. కానీ మటన్ చట్నీ గురించి తెలుసా? రెండూ ఒకటే అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇదో మరోరకం, టేస్టీ వంటకం. రెసిపీ ఎలానో చూసేద్దాం.
Ingredients
- 500 Gram మటన్
- 1.5 Kilogram టోమాటో
- 2 Tablespoon వెజిటెబుల్ ఆయిల్
- 1 Tablespoon కశ్మీరి కారం
- 1.5 Tablespoon కారం
- 1 Tablespoon ఉప్పు
- 1 Teaspoon పసుపు
- 2 Tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్
- 10 Piece పుదీనా
- 1 Cup కొత్తిమీర
- 1.5 Cup నీళ్లు
- 50 Gram ధనియాలు
- 10 Gram నువ్వులు
- 20 Gram కాళోంజి
- 500 Milliliter నూనె
- 30 Piece వెల్లుల్లి రెబ్బలు
- 1 Teaspoon జీలకర్ర
- 1 Teaspoon ఆవాలు
- 12 Piece ఎండు మిర్చి
- 20 Piece కరివేపాకు
- 10 Piece నిమ్మరసం
Main Procedure